News
News
X

Singareni: సింగరేణిలో ‘కారుణ్యం’ పేరుతో టోకరా.. రూ.5 లక్షలు వసూళ్లు చేసిన దళారీ

సింగరేణి సంస్థలో కారుణ్య నియామకాల్లో పైరవీల జోరు సాగుతుంది. మెడికల్‌ అన్‌ఫిట్‌ చేయిస్తామని పేర్కొంటూ కార్మికుల వద్ద కొంత మంది పైరవీకారులు భారీగానే డబ్బులు వసూళ్లు చేస్తున్నారు.

FOLLOW US: 

సింగరేణి సంస్థలో కారుణ్య నియామకాల్లో పైరవీల జోరు సాగుతుంది. మెడికల్‌ అన్‌ఫిట్‌ చేయిస్తామని పేర్కొంటూ కార్మికుల వద్ద కొంత మంది పైరవీకారులు భారీగానే డబ్బులు వసూళ్లు చేస్తున్నారు. సింగరేణి సంస్థలో పనిచేసే కార్మికులు 58 ఏళ్ల పైబడిన వారు అనారోగ్యానికి గురైతే వారు మెడికల్‌ బోర్డుకు ధరఖాస్తు చేసుకోవచ్చు. బోర్డుకు హాజరైన కార్మికుడి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి మెడికల్‌ అన్‌ఫిట్‌ అయితే వారి వారసులకు తిరిగి సింగరేణిలో ఉద్యోగం కల్పిస్తారు. తమ వారసులకు ఉద్యోగం కల్పించేందుకు కార్మికులు దళారులను ఆశ్రయిస్తున్నారు. దీనినే ఆసరాగా చేసుకొని వారి వద్ద లక్షల రూపాయలు వసూళ్లు చేస్తున్నారు. అయితే ఈ విషయంలో మోసపోయిన కార్మికులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. మెడికల్‌ అన్‌ఫిట్‌ కోసం దళారీ చేతిలో మోసపోయిన కార్మికుడు కొత్తగూడెంలో పోలీసులను ఆశ్రయించాడు. ఇందుకు సంబందింoచిన వివరాలిలా ఉన్నాయి. 

సింగరేణి సంస్థలో పనిచేసిన పిల్లి రామకృష్ణ అనే కార్మికుడు రెండేళ్ల క్రితం మెడికల్‌ అన్‌ఫిట్‌ కోసం కాంట్రాక్టరుగా పనిచేస్తున్న జి.వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని కలిశాడు. ఒక నెలలో పనిచేస్తామని నమ్మబలకడంతో అతని మాటలు నమ్మి రూ.5 లక్షలు ఇచ్చారు. అయితే డబ్బులు ఇచ్చి రెండేళ్లు పూర్తి అయినప్పటికీ రామకృష్ణకు మెడికల్‌ అన్‌ఫిట్‌ కాకపోగా ఉద్యోగం నుంచి కూడా రిటైర్డ్‌ అయ్యాడు. అయితే తాము మోసపోయామని గ్రహించిన రామకృష్ణ అనేక మార్లు డబ్బులు తిరిగి చెల్లించాలని చెప్పినప్పటికీ వెంకటేశ్వర్లు మాత్రం డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో కొత్తగూడెం వన్‌టౌన్‌ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

భారీ ఎత్తున చేతులు మారుతున్న సొమ్ములు..

సింగరేణిలో కారుణ్య నియామకాల పేరుతో సాగుతున్న మెడికల్‌ బోర్డు వ్యవహారంలో భారీ ఎత్తున సొమ్ములు చేతులు మారుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై గతంలో సింగరేణి వ్యాప్తంగా అనేక కేసులు సైతం నమోదయ్యాయి. తమ వారసులకు ఉద్యోగం వస్తుందనే సింగరేణి కార్మికుల ఆశలను ఆసరాగా చేసుకుంటున్న దళారులు వారి వద్ద నుంచి లక్షల రూపాయలు వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఒక్కొ కార్మికుడి వద్ద రూ.5 లక్షల నుంచి 10 లక్షల వరకు వసూళ్లు చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై గతంలో కొంత మంది అధికారులపై ఆరోపణలు రావడంతో వారిపై సంస్థాగతంలో విజిలెన్స్‌ విచారణ నిర్వహించారు. ఏది ఏమైనప్పటికీ సింగరేణి సంస్థలో జరుగుతున్న మెడికల్‌ అన్‌ఫిట్‌ వ్యవహారంలో కార్మికులు దళారులు చేతిలో మోసపోకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Also Read: Uttam Kumar Reddy: తెలంగాణలో బొగ్గు గనుల వేలం నిలిపివేయాలి... లోక్ సభలో లేవనెత్తిన ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి

Also Read: Cm Jagan: జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై టీఎస్ హైకోర్టులో విచారణ... నోటీసులు జారీ చేసిన హైకోర్టు

Also Read: Nagari Roja : నగరిలో రోజాకు "పంచ పాండవుల" కటీఫ్ .. మూడో సారి తప్పు చేయబోమని ప్రతిజ్ఞ !

Also Read: Jagananna Vidya Deevena: ఏపీ ప్రభుత్వానికి మరో షాక్... విద్యాదీవెన రివ్యూ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు

Also Read: AP Skill Scam: "స్కిల్ స్కామ్‌" కేసులో లక్ష్మినారాయణకు బెయిల్.. గంటా సుబ్బారావు ఆచూకీపై ప్రకటన చేయని సీఐడీ !

Published at : 13 Dec 2021 05:41 PM (IST) Tags: karimnagar khammam singareni compassionate appointments SCCL Godavari khani

సంబంధిత కథనాలు

Minister  Srinivas Goud : విపక్షాలు కక్కుర్తి రాజకీయాలు చేస్తున్నాయి, రాజీనామాపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ కామెంట్స్

Minister Srinivas Goud : విపక్షాలు కక్కుర్తి రాజకీయాలు చేస్తున్నాయి, రాజీనామాపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ కామెంట్స్

Tiger Wandering: మళ్లీ కనిపించిన పులి, గజగజా వణికిపోతున్న ప్రజలు

Tiger Wandering: మళ్లీ కనిపించిన పులి, గజగజా వణికిపోతున్న ప్రజలు

TSRTC Offers: టీఎస్ఆర్టీసీ స్పెషల్ ఆఫర్స్, ఆగస్టు 15న ప్రత్యేక రాయితీలు!

TSRTC Offers: టీఎస్ఆర్టీసీ స్పెషల్ ఆఫర్స్, ఆగస్టు 15న ప్రత్యేక రాయితీలు!

Swine Flu in Adilabad: ఆదిలాబాద్ లో స్వై‌న్ ఫ్లూ కలకలం, ఆందోళనలో ప్రజలు

Swine Flu in Adilabad: ఆదిలాబాద్ లో స్వై‌న్ ఫ్లూ కలకలం, ఆందోళనలో ప్రజలు

Breaking News Live Telugu Updates: ఈజిప్టులో ఘోర ప్రమాదం, చర్చిలో అగ్ని ప్రమాదం 41  మంది మృతి 

Breaking News Live Telugu Updates: ఈజిప్టులో ఘోర ప్రమాదం, చర్చిలో అగ్ని ప్రమాదం 41  మంది మృతి 

టాప్ స్టోరీస్

50 మెగాపిక్సెల్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 7 జీబీ ర్యామ్ - ధర మాత్రం రూ.10 వేలలోపే!

50 మెగాపిక్సెల్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 7 జీబీ ర్యామ్ - ధర మాత్రం రూ.10 వేలలోపే!

Independence Day 2022: ప్రధాని మోదీ ఏ ప్రకటనలు చేస్తారో? స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంపై అంచనాలు

Independence Day 2022: ప్రధాని మోదీ ఏ ప్రకటనలు చేస్తారో? స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంపై అంచనాలు

Realme Cheapest 5G Phone: రూ.10 వేలలోపే 5జీ ఫోన్ - రియల్‌మీ మాస్టర్ ప్లాన్!

Realme Cheapest 5G Phone: రూ.10 వేలలోపే 5జీ ఫోన్ - రియల్‌మీ మాస్టర్ ప్లాన్!

Ola Electric Car: సింగిల్ చార్జ్‌తో హైదరాబాద్ టు తిరుపతి - ఓలా ఎలక్ట్రిక్ కార్‌తో మామూలుగా ఉండదు!

Ola Electric Car: సింగిల్ చార్జ్‌తో హైదరాబాద్ టు తిరుపతి - ఓలా ఎలక్ట్రిక్ కార్‌తో మామూలుగా ఉండదు!