Nagari Roja : నగరిలో రోజాకు "పంచ పాండవుల" కటీఫ్ .. మూడో సారి తప్పు చేయబోమని ప్రతిజ్ఞ !
నగరి ఎమ్మెల్యే రోజాకు సొంత నియోజకవర్గంలో అసమ్మతి కొండలా పెరిగిపోతోంది. ఐదు మండలాలకు చెందిన ముఖ్య నేతలు సమావేశమై రెండు సార్లు చేసిన తప్పు మళ్లీ చేయబోమని తీర్మానించుకున్నారు.
వైఎస్ఆర్‌సీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రోజాకు సొంత నియోజకవర్గంలో తిప్పలు తప్పడం లేదు. నగిర నియోజకవర్గంలో ఐదు మండలాలు ఉంటే.. ఆ మండలాల వైఎస్ఆర్‌సీపీ ముఖ్య నేతలంతా రోజాకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. నగరి పివికే ఫంక్షన్ హాల్ ఐదు మండలాలకు చెందిన వైఎస్ఆర్‌సీపీ అసమ్మతి నేతలు సమావేశం అయ్యారు. వీరంతా రోజాకు వ్యతిరేకులే. నగరి వైఎస్ఆర్‌సీపీ సీనియర్ నాయకుడు కేజి.కుమార్,పుత్తూరు నాయకుడు ఏలుమలై, వడమాలపేట మాజీ ఎంపీపీ మురళీధర్ రెడ్డి, విజయపురం మండలం నాయకుడు లక్ష్మీపతి రెడ్డి, నిండ్ర మండల పార్టీ నాయకుడు చక్రపాణిరెడ్డి , ప్రస్తుత రాష్ట్ర బీసీ కార్పొరేషన్ చైర్మన్ కె.జె. శాంతిలతోపాటు ఆయా మండల ఎంపీటీసీలు, సర్పంచ్‌లు సమావేశానికి హాజరయ్యారు.
Also Read: జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై టీఎస్ హైకోర్టులో విచారణ... నోటీసులు జారీ చేసిన హైకోర్టు
ఐదు మండలాలకు చెందిన తాము పంచపాండవులు గా ఉండి రెండు సార్లు రోజా ఎమ్మెల్యేగా గెలవడానికి కృషి చేశామని.. అయినా పార్టీలో తగిన స్థానం, గుర్తింపు, న్యాయం లేవని ఆవేదన వ్యక్తం చేశారు. పైగా అనేక విధాలుగా అవమానాలు ఎదుర్కొంటున్నామని బాధపడ్డారు. నియోజకవర్గంలో ఉన్న స్థానికులను కాదని బయట వ్యక్తులను రెండుసార్లు ఎమ్మెల్యే చేసినందుకు వారు తమదైన శైలిలో బుద్ధి చెప్పారని, ఇకపై పొరపాట్లకు తావు లేకుండా స్థానికులోనే మంచి నాయకుని ఎన్నుకుంటామని వారు తీర్మానించారు.
Also Read: ఫిట్‌మెంట్ ప్రకటన మంగళవారమే .. కొన్ని ఉద్యోగ సంఘాలకు సజ్జల సమాచారం !
రోజా స్థానికురాలు కాదన్న ఉద్దేశంతో వారు మాట్లాడారు. అదే విషయాన్నిహైకమాండ్ వద్దకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఐదు మండలాలకు చెందిన నాయకులతో కలిసి కట్టుగా కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించుకున్నారు. రోజా తీరుపై నేతలంతా అసహనం వ్యక్తం చేశారు. ఇక ఆమెకు ఎంత మాత్రం సహకరించకూడదని నిర్ణయించుకున్నారు. నిజానికి వీరందరితో రోజాకు చాలా కాలంగా సరైన రాజకీయ సంబంధాలు లేవు,. రోజాకు వ్యతిరేకంగానే పనిచేస్తున్నారు.
Also Read: తిట్ల నుంచి హత్య కుట్ర ఆరోపణల వరకూ ఏపీ రాజకీయాలు ! రాజకీయం అంటే అదేనా ? నేతలకు నైతికతే ఉండదా?
రోజా వ్యతిరేక వర్గం స్థానిక ఎన్నికల్లో అనేక చోట్ల స్వతంత్ర అభ్యర్థులను నిలబెట్టినా రోజా తాను నిలబెట్టిన అభ్యర్థులను గెలిపించుకున్నారు. అయితే రోజా దూకుడు వల్ల అమెకు కింది స్థాయి క్యాడర్ కూడా దూరమవుతున్నారు. ఐదు మండలాల ముఖ్య నేతలు రోజాకు వ్యతిరేకంగా గళం వినిపించడం... ఆమెకు ఇబ్బందికరమేనని వైఎస్ఆర్‌సీపీ వర్గాలు చెబుతున్నాయి.
Also Read: ఏపీ హైకోర్టుకు అదనపు భవనం.. భూమి పూజ చేసిన చీఫ్ జస్టిస్ !