KCR PK Issue: పీకే ఓ పాగల్ అని కేసీఆరే అన్నారు, ఇప్పుడు ఆయన భయపడుతున్నట్లే - మాజీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

ప్రశాంత్ కిషోర్ ఒక పాగల్ అని గతంలో ఓ సభలో కేసీఆర్ ఆన్నారని, ప్రశాంత్ కిషోర్ ప్రధాని కావాలని అనుకుంటున్నారని కేసీఆరే విమర్శించారని వివేక్ గుర్తు చేశారు.

FOLLOW US: 

తిరుమలలో తెలంగాణ మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సమేతంగా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రజలు మంచి పరిపాలన కోరుకుంటున్నారన్నారు. తెలంగాణాలో సీఎం కేసీఆర్ కు ఓటమి‌ భయం పట్టుకుందని, అందుకే కేసీఆర్ ప్రశాంత్ కిషోర్ జపం చేస్తున్నారని విమర్శించారు. 

ప్రశాంత్ కిషోర్ ఒక పాగల్ అని గతంలో ఓ సభలో కేసీఆర్ ఆన్నారని, ప్రశాంత్ కిషోర్ ప్రధాని కావాలని అనుకుంటున్నారని కేసీఆరే విమర్శించారని గుర్తు చేశారు. ప్రశాంత్ కిషోర్ సాయం తీసుకుంటున్నారంటే కేసీఆర్ ఓటమి పాలు అవుతున్నట్లు ఒప్పుకుంటున్నారని అన్నారు. అవినీతి, నియంతృత్వ కుటుంబ పాలనతో ప్రజలు విసిగిపోయి ఉన్నారని అన్నారు. తెలంగాణలో వరుస ఎన్నికలలో బీజేపీకే ప్రజలు పట్టం కడుతున్నారని ఆయన తెలిపారు.

ప్రాణహిత పుష్కరాలకు నిధులేవీ?

బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఉన్న మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి నిన్న ప్రాణహిత పుష్కరాల్లో పాల్గొన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి నిర్వహిస్తున్న పుష్కరాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న ఆయన కోటపల్లి మండలం అర్జునగుట్ట వద్ద ప్రాణహిత పుష్కర పుణ్య స్నానం చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ప్రాణహిత పుష్కరాలకు తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డితో కొట్లాడి మరీ రూ.10 కోట్ల నిధులు మంజూరు చేయించిన విషయాన్ని వివేక్ గుర్తు చేశారు. 

ఫామ్ హౌస్ లో యజ్ఞాలు చేసి తాను పెద్ద భక్తుడినని చెప్పుకునే ముఖ్యమంత్రి.. పుష్కరాల సందర్భంగా పూజ నిర్వహించేందుకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును ఆపి కమిషన్ల కోసం కాళేశ్వరం కట్టిండని వివేక్ ఆరోపించారు. ఈ అంశం నుంచి దృష్టి మరల్చడానికే ప్రాణహిత పుష్కరాలకు నిధులు మంజూరు చేయలేదని విమర్శించారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ గ్రాఫ్ ప్రజల్లో పడిపోతోందని వివేక్ అన్నారు. వారు ఏం మాట్లాడుతున్నారో వారికే అర్థంకాని పరిస్థితిలో ఉన్నారని చెప్పారు. వరంగల్ సభలో కేటీఆర్ ప్రధానిపై చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటన్న ఆయన.. రాష్ట్రానికి కేంద్రం నిధులు మంజూరు చేయడంలేదన్న ఆరోపణల్లో నిజం లేదని అన్నారు.

Published at : 26 Apr 2022 11:34 AM (IST) Tags: kcr prashanth kishore tirumala latest news Vivek Venkata swamy PK in Telangana Vivek Venkata swamy on KCR

సంబంధిత కథనాలు

AP TS 10th Exam Results: ఆ తేదీల్లో ఏపీలో టెన్త్ రిజల్ట్స్ విడుదలయ్యే ఛాన్స్ - తెలంగాణలో స్పాట్ వ్యాల్యుయేషన్ ప్రారంభం

AP TS 10th Exam Results: ఆ తేదీల్లో ఏపీలో టెన్త్ రిజల్ట్స్ విడుదలయ్యే ఛాన్స్ - తెలంగాణలో స్పాట్ వ్యాల్యుయేషన్ ప్రారంభం

Heavy Rush at Tirumala: తిరుమలకు వెళ్తున్న భక్తులకు టీటీడీ కీలక సూచనలు, కిలోమీటర్లు మేర క్యూలైన్లలో గోవిందా గోవిందా !

Heavy Rush at Tirumala: తిరుమలకు వెళ్తున్న భక్తులకు టీటీడీ కీలక సూచనలు, కిలోమీటర్లు మేర క్యూలైన్లలో గోవిందా గోవిందా !

Vijayashanthi: విజయశాంతి - వీకే శశికళ రహస్య భేటీ! మూడేళ్ల క్రితం సాధ్యంకానిది ఇప్పుడవుతుందా?

Vijayashanthi: విజయశాంతి - వీకే శశికళ రహస్య భేటీ! మూడేళ్ల క్రితం సాధ్యంకానిది ఇప్పుడవుతుందా?

Khammam: కానిస్టేబుల్ దంపతుల పాడుపని! ఏకంగా కోటిన్నర దోచేసిన భార్యాభర్తలు

Khammam: కానిస్టేబుల్ దంపతుల పాడుపని! ఏకంగా కోటిన్నర దోచేసిన భార్యాభర్తలు

Karimnagar: ఈసారి మామిడి పచ్చళ్ళు అంతంతమాత్రమే! రెండు రెట్లు ఎగబాకిన ధరలు

Karimnagar: ఈసారి మామిడి పచ్చళ్ళు అంతంతమాత్రమే! రెండు రెట్లు ఎగబాకిన ధరలు

టాప్ స్టోరీస్

Mahanadu Chandrababu : నేను వస్తా.. దోచినదంతా కక్కిస్తా - మహానాడులో చంద్రబాబు హెచ్చరిక !

Mahanadu Chandrababu :  నేను వస్తా.. దోచినదంతా  కక్కిస్తా - మహానాడులో చంద్రబాబు హెచ్చరిక !

YSR Rythu Ratham: ఏపీలో రైతులకు సబ్సిడీపై ట్రాక్టర్లు, ఇలా అప్లై చేసుకోండి - లాస్ట్ డేట్ ఎప్పుడంటే

YSR Rythu Ratham: ఏపీలో రైతులకు సబ్సిడీపై ట్రాక్టర్లు, ఇలా అప్లై చేసుకోండి - లాస్ట్ డేట్ ఎప్పుడంటే

Redmi 11 5G Launch: రెడ్‌మీ చవకైన 5జీ ఫోన్ వచ్చేస్తుంది - జూన్‌లోనే లాంచ్ - ధర లీక్!

Redmi 11 5G Launch: రెడ్‌మీ చవకైన 5జీ ఫోన్ వచ్చేస్తుంది - జూన్‌లోనే లాంచ్ - ధర లీక్!

Amalapuram Violence: కొనసాగుతున్న అరెస్టుల పర్వం - మరో 7 రోజులపాటు 144 సెక్షన్ పొడిగింపు, మరో కీలక నిర్ణయం

Amalapuram Violence: కొనసాగుతున్న అరెస్టుల పర్వం - మరో 7 రోజులపాటు 144 సెక్షన్ పొడిగింపు, మరో కీలక నిర్ణయం