అన్వేషించండి

Errabelli Dayakar Rao : వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఉండదు - ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు

BRS To TRS : వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కాదు టీఆర్ఎస్ పేరు మీదనే పోటీ చేస్తామని ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. పార్టీ మారు మళ్లీ మారుస్తామన్నారు.

Errabelli Dayakar Rao said TRS not BRS in the next election :  భారత రాష్ట్ర సమితి పేరును మళ్లీ తెలంగాణ రాష్ట్ర సమితిగా మార్చేందుకు బీఆర్ఎస్ పెద్దలు కసరత్తు చేస్తున్నారు. ఈ విషయాన్ని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రకటించారు. జనగామలో జరిగిన రైతు సదస్సులో మాట్లాడిన ఎర్రబెల్లి దయాకర్ రావు పార్టీ పేరు మార్పు అంశంపై స్పందించారు. బీఆర్ఎస్‌ను టీఆర్ఎస్ గా మారుస్తామని.. స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపునే పోటీ చేస్తామన్నారు. 

కొద్ది రోజులుగా బీఆర్ఎస్ నేతల్లో పార్టీ పేరును మళ్లీ బీఆర్ఎస్ గా మార్చాలన్న డిమాండ్ ఊపందుకుంటోంది. పార్టీ ఘోర పరాజయం తర్వాత తెలంగాణ భవన్‌కు వాస్తు మార్పులు చేస్తున్నారు. అయితే  వాస్తు అనేది నమ్మకమని.. కానీ పార్టీ పేరును మార్చడం అనేది చాలా ముఖ్యమని పార్టీ నేతలు చెబుతున్నారు.  అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం బీఆర్ఎస్ ను మళ్లీ టీఆర్ఎస్ గా పేరు మార్చాలని గులాబీ శ్రేణుల నుంచి డిమాండ్ వినిపిస్తోంది. తెలంగాణ ఉద్యమ పార్టీ అయిన టీఆర్ఎస్‌లో తెలంగాణను తొలగించి భారత రాష్ట్ర సమితిగా మార్చడంతో తెలంగాణ ప్రజలతో ఎమోషనల్ కనెక్షన్ మిస్ అయినట్లుగా క్యాడర్ భావిస్తోంది.   దీంతో ఓటర్లు బీఆర్ఎస్ ను తిరస్కరించారని కొందరు తెలంగాణవాదులు విశ్లేషిస్తున్నారు. అ  పార్టీ పేరులో తెలంగాణ పేరు తొలగించడం వల్ల ఆ పార్టీ అస్థిత్వానికి ప్రమాదంగా మారిందని బీఆర్ఎస్ నేతల్లో  గట్టి నమ్మకం ఏర్పడింది. 

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధనే లక్ష్యంగా 2001 వ సంవత్సరంలో ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)ని 22 సంవత్సరాల తర్వాత 2022 భారత రాష్ట్ర సమితిగా మార్చింది. జాతీయపార్టీగా దేశంలో అగ్గిపెడతానని కేసీఆర్ నమ్మకంతో ప్రకటించేవారు.  పార్టీ విస్తరించేందుకు మహారాష్ట్రంలో బిఆర్ ఎస్ తరఫున అనే సమావేశాలు ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఒక కమిటీని ఏర్పాటు చేశారు.  పార్టీ పేరు మార్చిన తర్వాత చాలా ఎన్నికలు ఇతర రాష్ట్రాల్లో వచ్చినా  పోటీ చేయలేదు. చివరికి  కర్నాటక ఎన్నికల్లో పోటీ చేయలేదు. తెలంగాణలో ఎన్నికల్లో బిఆర్ఎస్ ఓడిపోయింది. 

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజే చాలా మంది ఒకే అభిప్రాయం వ్యక్తం చేశారు. అదే .. పేరు మార్పు వల్లే ఓడిపోయామని. మళ్లీ టీఆర్ఎస్ గా మార్చాలని కడియం శ్రీహరి వంటి వారు మూడు నెలల కిందటే డిమాండ్ చేశారు. చివరికి ఆయన కూడా పార్టీ మారిపోయారు. టిఆర్ఎస్ అనేది తెలంగాణ సెంటిమెంట్ తో పుట్టిన పార్టీ. దీనిని బిఆర్ ఎస్ గా మార్చగానే పార్టీ సెంటిెమెంటుకు దూరమయింది. అదే అసెంబ్లీ ఎన్నికల్లో కనిపించింది. అందువల్ల మళ్లీ తెలంగాణ ప్రజలకు దగ్గిరయ్యేందుకు పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సమితిగా పునరుద్ధరించాలనేది చాలా మంది హైకమాండ్‌కు చెబుతున్న  మాట. ఆ తర్వాత చాలా మంది నేతలది అదే అభిప్రాయం. ఎర్రబెల్లి దయాకర్ రావు స్టేట్మెంట్ ను బట్టి.. పార్టీ పేరు మళ్లీ  టీఆర్ెస్ గా మారనుంది. దీనికి అవసరమైన న్యాయపరమైన ప్రక్రియను ఆ పార్టీ ప్రారంభించినట్లగా తెలుస్తోంది.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Shock for YCP:  వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
Special Trains: తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్ - 20 ప్రత్యేక రైళ్లు పొడిగింపు, ఈ రైళ్లు రద్దు, పూర్తి వివరాలివే!
తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్ - 20 ప్రత్యేక రైళ్లు పొడిగింపు, ఈ రైళ్లు రద్దు, పూర్తి వివరాలివే!
Galiveedu MPDO: అన్నమయ్య జిల్లాలో వైసీపీ నేత వీరంగం - ఎంపీడీవోను తన్ని పిడిగుద్దులు, తీవ్ర ఉద్రిక్తత
అన్నమయ్య జిల్లాలో వైసీపీ నేత వీరంగం - ఎంపీడీవోను తన్ని పిడిగుద్దులు, తీవ్ర ఉద్రిక్తత
Allu Arjun Bail Petition: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా వేసిన నాంపల్లి కోర్టు, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రాయల చెరువులో డ్రాగన్ బోట్ రేస్‌ ప్రారంభంఎంతో అందమైన ఈ వైజాగ్ వ్యూ పాయింట్ గురించి మీకు తెలుసా..?అన్నామలై వ్యూహాలతో బలం పెంచుకుంటున్న బీజేపీనచ్చని పని చేసిన మన్మోహన్, అయినా మోదీ పొగడ్తలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shock for YCP:  వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
Special Trains: తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్ - 20 ప్రత్యేక రైళ్లు పొడిగింపు, ఈ రైళ్లు రద్దు, పూర్తి వివరాలివే!
తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్ - 20 ప్రత్యేక రైళ్లు పొడిగింపు, ఈ రైళ్లు రద్దు, పూర్తి వివరాలివే!
Galiveedu MPDO: అన్నమయ్య జిల్లాలో వైసీపీ నేత వీరంగం - ఎంపీడీవోను తన్ని పిడిగుద్దులు, తీవ్ర ఉద్రిక్తత
అన్నమయ్య జిల్లాలో వైసీపీ నేత వీరంగం - ఎంపీడీవోను తన్ని పిడిగుద్దులు, తీవ్ర ఉద్రిక్తత
Allu Arjun Bail Petition: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా వేసిన నాంపల్లి కోర్టు, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
Mother in law should die: అత్త త్వరగా చచ్చిపోవాలి - నోటుపై రాసి దేవుడి హుండీలో వేశారు - ఎంత టార్చర్ పడుతున్నారో?
అత్త త్వరగా చచ్చిపోవాలి - నోటుపై రాసి దేవుడి హుండీలో వేశారు - ఎంత టార్చర్ పడుతున్నారో?
JC Prabhakar Reddy News: డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
Gay Murderer: గే కానీ అమ్మాయిలా వేషం వేసి మగాళ్లను పిలుస్తాడు - వెళ్లారో చచ్చినట్లే - ఇప్పటికి 11 మంది !
గే కానీ అమ్మాయిలా వేషం వేసి మగాళ్లను పిలుస్తాడు - వెళ్లారో చచ్చినట్లే - ఇప్పటికి 11 మంది !
Manmohan Singh: 'మన్మోహన్ దూరదృష్టితో ఆర్థిక సంస్కరణలు తెచ్చారు' - మాజీ ప్రధాని పార్థివ దేహానికి తెలుగు రాష్ట్రాల సీఎంల నివాళి
'మన్మోహన్ దూరదృష్టితో ఆర్థిక సంస్కరణలు తెచ్చారు' - మాజీ ప్రధాని పార్థివ దేహానికి తెలుగు రాష్ట్రాల సీఎంల నివాళి
Embed widget