అన్వేషించండి

Electricity Bills: విద్యుత్ వినియోగదారులకు బిగ్ అలర్ట్ - ఇకపై కరెంట్ బిల్లులు అలా చెల్లించలేరు, ఇవి తెలుసుకోండి!

Telangana News: ఆర్బీఐ నిబంధనల మేరకు ఇకపై విద్యుత్ బిల్లుల చెల్లింపులు ఫోన్ పే, పేటీఎం, అమెజాన్ పే వంటి యాప్స్ ద్వారా సాధ్యపడవు. వినియోగదారులు డిస్కంల వెబ్ సైట్ లేదా మొబైల్ యాప్‌లోనే బిల్లులు చెల్లించాలి.

Electricity Bills Cant Paid Through Third Party Apps: విద్యుత్ వినియోగదారులకు నిజంగా ఇది బిగ్ అలర్ట్. ఇకపై ఫోన్ పే, పేటీఎం, అమెజాన్ పే వంటి థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా విద్యుత్ బిల్లుల చెల్లింపులు కుదరవు. జులై నుంచి ఈ యాప్స్ ద్వారా విద్యుత్ బిల్లుల చెల్లింపులు సాధ్యపడవు. క్రెడిట్ కార్డు బిల్లుల చెల్లింపుల తరహాలోనే ఆయా యాప్స్ ఈ సేవలనూ నిలిపేశాయి. ఆర్బీఐ మార్గదర్శకాలను అనుసరించి జులై 1 (సోమవారం) నుంచి ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఈ క్రమంలో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (TGSPDCL) తమ వెబ్ సైట్ లేదా మొబైల్ యాప్‌లోనే బిల్లుల చెల్లింపులు చేయాలని వినియోగదారులకు సూచించింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా స్పష్టం చేసింది.

తెలుగు రాష్ట్రాల్లోని డిస్కంలూ..

అటు, తెలుగు రాష్ట్రాల్లోని TGNPDCL, APSPDCL, APEPDCL, APCPDCL డిస్కంలదీ ఇదే పరిస్థితి. వీటి పరిధిలో బిల్లులు చెల్లించాలని ప్రయత్నిస్తే అవి భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్‌కు రిజిస్టర్ కాలేదని చూపిస్తోంది. దీంతో థర్ట్ పార్టీ యాప్స్‌లో బిల్లుల చెల్లింపులు జరగక వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. చెల్లింపులపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ క్రమంలో ఆయా విద్యుత్ పంపిణీ సంస్థల పరిధిలోని వినియోగదారులు డిస్కమ్ వెబ్ సైట్ లేదా మొబైల్ యాప్‌లోనే బిల్లులు చెల్లించాలి.

ఆర్బీఐ కీలక నిర్ణయం

కాగా, బిల్లుల చెల్లింపుల్లో సమర్థత, భద్రతకు పెద్దపీట వేసేందుకు ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని బిల్లుల చెల్లింపులు కూడా భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (BBPS) ద్వారానే జరగాలని ఆదేశించింది. ఇందులో భాగంగా జులై 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది. ఈ క్రమంలో బిల్లర్లు ఈ బిల్ పేమెంట్ సిస్టమ్‌ను ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంది. ప్రైవేట్ బ్యాంకులైన హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, యాక్సిస్ వంటి ప్రధాన బ్యాంకులు ఈ పేమెంట్ సిస్టమ్ యాక్టివ్ చేసుకోలేదు. దీంతో ఫోన్ పే, క్రెడ్ వంటి కంపెనీలు వినియోగదారుల క్రెడిట్ కార్డుల బిల్లులను ప్రాసెస్ చేయలేవు. ఇప్పుడు విద్యుత్ బిల్లుల చెల్లింపులు సైతం వీలు పడవు.

Also Read: IPS Transfers: తెలంగాణలో మరో 8 మంది ఐపీఎస్‌లు బదిలీ, సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

APPSC Group-2 Postponed: ఏపీ గ్రూప్-2 అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఎగ్జామ్ వాయిదా వేసిన ఏపీపీఎస్సీ
ఏపీ గ్రూప్-2 అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఎగ్జామ్ వాయిదా వేసిన ఏపీపీఎస్సీ
Hemant Soren: మళ్లీ ఝార్ఖండ్‌ సీఎంగా హేమంత్ సోరెన్‌, రాజీనామా చేయనున్న చంపై సోరెన్
మళ్లీ ఝార్ఖండ్‌ సీఎంగా హేమంత్ సోరెన్‌, రాజీనామా చేయనున్న చంపై సోరెన్
White Paper on Amaravati :  ఇన్వెస్టర్లలో నమ్మకం పెంచుతాం - వెంటనే అమరావతి పనులు - శ్వేతపత్రం ప్రకటించిన చంద్రబాబు
ఇన్వెస్టర్లలో నమ్మకం పెంచుతాం - వెంటనే అమరావతి పనులు - శ్వేతపత్రం ప్రకటించిన చంద్రబాబు
Paruchuri Gopala Krishna: డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌పై పరుచూరి గోపాల కృష్ణ ఆసక్తికర కామెంట్స్‌ - తనవి సినిమా డైలాగ్స్‌ కాదని నిరూపించారు..
డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌పై పరుచూరి గోపాల కృష్ణ ఆసక్తికర కామెంట్స్‌ - తనవి సినిమా డైలాగ్స్‌ కాదని నిరూపించారు..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rahul Drvaid Recalls Rohit Sharma Phone Call in November | ద్రావిడ్ కు ఫోన్ చేసి రోహిత్ ఏం చెప్పారు?T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP DesamSurya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
APPSC Group-2 Postponed: ఏపీ గ్రూప్-2 అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఎగ్జామ్ వాయిదా వేసిన ఏపీపీఎస్సీ
ఏపీ గ్రూప్-2 అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఎగ్జామ్ వాయిదా వేసిన ఏపీపీఎస్సీ
Hemant Soren: మళ్లీ ఝార్ఖండ్‌ సీఎంగా హేమంత్ సోరెన్‌, రాజీనామా చేయనున్న చంపై సోరెన్
మళ్లీ ఝార్ఖండ్‌ సీఎంగా హేమంత్ సోరెన్‌, రాజీనామా చేయనున్న చంపై సోరెన్
White Paper on Amaravati :  ఇన్వెస్టర్లలో నమ్మకం పెంచుతాం - వెంటనే అమరావతి పనులు - శ్వేతపత్రం ప్రకటించిన చంద్రబాబు
ఇన్వెస్టర్లలో నమ్మకం పెంచుతాం - వెంటనే అమరావతి పనులు - శ్వేతపత్రం ప్రకటించిన చంద్రబాబు
Paruchuri Gopala Krishna: డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌పై పరుచూరి గోపాల కృష్ణ ఆసక్తికర కామెంట్స్‌ - తనవి సినిమా డైలాగ్స్‌ కాదని నిరూపించారు..
డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌పై పరుచూరి గోపాల కృష్ణ ఆసక్తికర కామెంట్స్‌ - తనవి సినిమా డైలాగ్స్‌ కాదని నిరూపించారు..
Kothagudem News: చిన్నారి తలలో దిగబడ్డ పెన్ను, రెండు రోజులకు పాప మృతి
చిన్నారి తలలో దిగబడ్డ పెన్ను, రెండు రోజులకు పాప మృతి
YS Sharmila :  వైఎస్ జయంతి వేదికగా కాంగ్రెస్ బలోపేతానికి వ్యూహం - వైసీపీ కీలక నేతలు పార్టీలో చేరనున్నారా ?
వైఎస్ జయంతి వేదికగా కాంగ్రెస్ బలోపేతానికి వ్యూహం - వైసీపీ కీలక నేతలు పార్టీలో చేరనున్నారా ?
Bigg Boss 8 Telugu: ‘బిగ్ బాస్’ సీజన్ 8లో ఆ లేడీ కంటెస్టెంట్స్ - ఇక రచ్చ మామూలుగా ఉండదు!
‘బిగ్ బాస్’ సీజన్ 8లో ఆ లేడీ కంటెస్టెంట్స్ - ఇక రచ్చ మామూలుగా ఉండదు!
Nani - Rana: నాని, రానా మల్టీస్టారర్ - మంచి సైకో కిల్లర్ కథతో సిద్ధమయిన యంగ్ డైరెక్టర్
నాని, రానా మల్టీస్టారర్ - మంచి సైకో కిల్లర్ కథతో సిద్ధమయిన యంగ్ డైరెక్టర్
Embed widget