News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

ED Raids In Medical Colleges : మల్లారెడ్డి మెడికల్ కాలేజీపై ఈడీ కేసు, భారీగా నగదు స్వాధీనం - సోదాలపై ప్రకటన విడుదల చేసిన ఈడీ !

మెడికల్ కాలేజీల్లో సోదాలపై ఈడీ ప్రకటన విడుదల చేసింది. మల్లారెడ్డి కాలేజీలో భారీగా నగదు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపింది.

FOLLOW US: 
Share:

ED Raids In Medical Colleges : తెలంగాణ రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో రెండు రోజుల పాటు నిర్వహించిన సోదాలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ ప్రకటన విడుదల చేసింది.  12 వైద్య కళాశాలలు, సంబంధిత వ్యక్తుల కార్యాలయాల్లో..  16చోట్ల ఈడీ అధికారుల తనిఖీలు చేశారని తెలిపింది.  హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్ నగర్ తో పాటు పలు చోట్లు తనిఖీలు జరిరగాయి.  పీజీ మెడికల్ సీట్లను బ్లాక్ చేసినట్లుగా ఫిర్యాదులు రావడంతో సోదాలు చేశామన్నారు. మనీ లాండరింగ్‌కు సంబధించి స్పష్టమైన ఆధారాలు లభించడంతో కేసు నమోదు చేసినట్లుగా తెలింది.  పలు కీలక డాక్యుమెంట్లు, పెన్ డ్రైవ్ లు, హార్డు డిస్కులు స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ ప్రకటించింది. మంత్రి మల్లారెడ్డికి చెందిన వైద్య కాలేజీలోనే ఎక్కువ మొత్తం నగదు లభించింది.    మల్లారెడ్డి వైద్య కళాశాలలో 1.4కోట్ల నగదు, బ్యాంకు ఖాతాలో ఉన్న 2.89కోట్లు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపింది. 

తెలంగాణ రాష్ట్రంలోని  రాష్ట్రంలోని పలు మెడికల్‌ కాలేజీల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) బుధవారం, గురువారాల్లో  ఏకకాలంలో సోదాలు చేపట్టింది. ఆయా కళాశాలల యాజమానుల ఇండ్లు, కార్పొరేట్‌ కార్యాలయాల్లోనూ సోదాలు నిర్వహించింది. మల్లారెడ్డి మెడికల్‌ కాలేజీతోపాటు ఎల్బీనగర్‌లోని కామినేని మెడికల్‌ కాలేజీ, ఎస్వీఎస్‌, ప్రతిమ, డెక్కన్‌, మహేందర్‌రెడ్డి మెడికల్‌ కాలేజీ, ఎంఎన్‌ఆర్‌ మెడికల్‌ కాలేజీ, మెడిసిటీ మెడికల్‌ కాలేజీల్లో ఒకేసారి రైడ్స్‌ నిర్వహించారు.                 

పీజీ మెడికల్‌ సీట్ల గోల్‌మాల్‌ నేపథ్యంలో ఈ సోదాలు చేపట్టింది.  సోదాల్లో భాగంగా ఈడీ అధికారులు బృందాలుగా విడిపోయి ఆయా కళాశాలలకు చెందిన రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా పలు కాలేజీలకు చెం దిన కీలక పత్రాలను, కంప్యూటర్‌ హార్డ్‌డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు.  ఈడీ సోదాల నేపథ్యంలో ఆయా వైద్యకళాశాలలు, వాటి  ఆస్పత్రుల వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అత్యవసర రోగులను తప్ప మరెవరినీ లోపలికి అనుమతించలేదు.               

సోదాల్లో ఇద్దరు మంత్రుల కాలేజీలు ఉన్నాయి. మల్లారెడ్డికి చెందిన మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ తో పాటు ఖమ్మంలో పువ్వాడ అజయ్ కు చెందిన మమతా  మెడికల్ కాలేజీ ఉంది. అయితే ఒక్క మల్లారెడ్డి కాలేజీలోనే నగదు స్వాధీనం చేసుకున్నట్లుగా ఈడీ చెప్పడం ఆసక్తికరంగా మారింది. అక్రమ నగదు స్వాధీనం చేసుకున్నందున మల్లారెడ్డి కాలేజీ యాజమాన్యంపైనే ఈడీ కేసు నమోదు చేశారు.             

Published at : 22 Jun 2023 08:04 PM (IST) Tags: Telangana News ED Searches Mallareddy College Mallareddy Medical College

ఇవి కూడా చూడండి

Sonia Gandhi: మీకు నిజాయతీ పాలనను అందించడానికి మేం సిద్ధం - సోనియా గాంధీ వీడియో విడుదల

Sonia Gandhi: మీకు నిజాయతీ పాలనను అందించడానికి మేం సిద్ధం - సోనియా గాంధీ వీడియో విడుదల

Telangana Elections 2023 Live News Updates: కాంగ్రెస్‌ను గెలిపించండి- తెలంగాణ ప్రజలకు సోనియా సందేశం

Telangana Elections 2023 Live  News Updates: కాంగ్రెస్‌ను గెలిపించండి- తెలంగాణ ప్రజలకు సోనియా సందేశం

Rythu Bandhu News: రైతుబంధు ఎవరివల్ల నిలిచింది? పోలింగ్ రోజు రైతన్న దెబ్బ బీఆర్ఎస్‌కా? కాంగ్రెస్‌కా?

Rythu Bandhu News: రైతుబంధు ఎవరివల్ల నిలిచింది? పోలింగ్ రోజు రైతన్న దెబ్బ బీఆర్ఎస్‌కా? కాంగ్రెస్‌కా?

TS Elections: తెలంగాణ ఎన్నికలు, విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవులు, ఉత్తర్వులు జారీ

TS Elections: తెలంగాణ ఎన్నికలు, విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవులు, ఉత్తర్వులు జారీ

Top Headlines Today: అనంతపురంలో బీజేపీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ ! రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ కవిత సవాల్

Top Headlines Today: అనంతపురంలో బీజేపీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ ! రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ కవిత సవాల్

టాప్ స్టోరీస్

Andhra News : అనంతపురంలో బీజేపీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ ! టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటుపై వివాదం

Andhra News : అనంతపురంలో బీజేపీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ ! టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటుపై వివాదం

KCR Election Campaign: హైదరాబాద్‌ మినహా 97 నియోజకవర్గాల్లో కేసీఆర్‌ ప్రచారం- నేడు గజ్వేల్‌లో ఫైనల్‌ మీటింగ్

KCR Election Campaign: హైదరాబాద్‌ మినహా 97 నియోజకవర్గాల్లో కేసీఆర్‌ ప్రచారం- నేడు గజ్వేల్‌లో ఫైనల్‌ మీటింగ్

Kriti Sanon : బన్నీతో కలిసి పనిచేసే క్షణాల కోసం ఎదురుచూస్తున్నా: కృతిసనన్

Kriti Sanon : బన్నీతో కలిసి పనిచేసే క్షణాల కోసం ఎదురుచూస్తున్నా: కృతిసనన్

Kangana Ranaut: మాజీ ప్రధాని ఇందిరా గాంధీని కలిసిన కంగనా, అదెలా సాధ్యమని షాక్ అవుతున్నారా?

Kangana Ranaut: మాజీ ప్రధాని ఇందిరా గాంధీని కలిసిన కంగనా, అదెలా సాధ్యమని షాక్ అవుతున్నారా?