అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Telangana : ఐజీఎస్టీ స్కామ్‌లో ఈడీ కేసు నమోదు - మాజీ సీఎస్‌ సోమేష్‌కు మరిన్ని చిక్కులు

ED Case : తెలంగాణ జీఎస్టీ స్కాంలో ఈడీ కూడా కేసు నమోదు చేసింది. సీసీఎస్ పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ కూడా కేసు పెట్టింది.

ED has also registered a case in Telangana IGST scam : తెలంగాణలో వెలుగు చూసిన ఐజీఎస్టీ స్కాంలో ఈడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఏ1గా వాణ్యిజ్య పన్నుల అదనపు కమిషనర్ కాశీ విశ్వేశ్వరరావు, ఏ2గా ఉప కమిషనర్ శివరామ్ ప్రసాద్, ఏ3గా హైదరాబాద్ ఐఐటీ ప్రొఫెసర్ శోభన్ బాబు, ఏ4గా ప్లియంటో టెక్నాలజీస్,  ఏ 5గా మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ ను సీసీఎస్ పోలీససుులు నమోదు చేశారు. ఇందులో అక్రమ నగదు చెలామణి జరిగినట్లుగా తేల్చడంతో ఈడీ కేసు పెట్టింది. 

ప్రభుత్వం మారిన తరవాత వెలుగులోకి వచ్చిన జీఎస్టీ స్కాం                   

ఇంటిగ్రేటెడ్‌ జీఎస్టీ కి సంబంధించి రూ.1400 కోట్ల మేర ఐటీసీని క్లెయిమ్‌ చేసినట్లు, దీని వల్ల ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లినట్లు సీసీఎస్‌ పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.  బోగస్‌ ఇన్వాయిస్‌లను సృష్టించి, పెద్ద ఎత్తున ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ ను క్లెయిమ్‌ చేసినట్లు వాణిజ్య పన్నుల శాఖ గత ఏడాది చివర్లో నిర్వహించిన ఆడిట్‌లో గుర్తించింది. ఈ కేసులో  వస్తువులు సరఫరా చేయకపోయినా బోగస్ ఇన్వాయిస్ లను సృష్టించారని అధికారులు గుర్తించారు.   ఇది వందల కోట్ల వ్యవహారం కాదని, మొత్తం స్కామ్‌ రూ.వేల కోట్లలో ఉంటుందని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చి సమగ్ర దర్యాప్తు కోసం సీఐడీకి అప్పగించింది. 

సోమేష్ కుమారే స్కాంలో కీలకంగా వ్యవహరించారని సీఐడీ అనుమానం                       

సోమేశ్‌కుమార్‌ ఆదేశాలతోనే తాము సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేసేందుకు అంగీకరించామని నిందితులుగా ఉన్న కాశీవిశ్వేశ్వరరావు, శివరామప్రసాద్‌ అంగీకరించినట్లు సీసీఎస్‌ పోలీసులు గతంలో తెలిపారు.  ఈ ఇద్దరు అధికారులతో పాటు సోమేశ్‌కుమార్‌ ‘స్పెషల్‌ ఇనిషియేటివ్స్‌’ పేరిట ఒక వాట్సాప్‌ గ్రూపును ఏర్పాటు చేసుకుని  సమాచారాన్ని ఒకరికొకరు చేరవేసుకునేవారని  సీసీఎస్ పోలీసులు దర్యాప్తులో తేల్చారు. సోమేష్ సహకారంతో 75 సంస్థలకు సంబంధించిన ఐటీ రిటర్నుల సమాచారం తెలియకుండా చేసేందుకు సాఫ్ట్ వేర్ ను మార్చారు.  తద్వారా ఐటీసీ క్లెయిమ్‌లకు వీలు కల్పించి రూ.1400 కోట్ల వరకు ఐటీసీ సొమ్మును అడ్డదారుల్లో క్లెయిమ్‌ చేసుకునేందుకు అవకాశంకల్పించారు.           

ఈడీ కేసుతో సోమేష్‌కు మరిన్ని చిక్కులు                  

ఒక్క తెలంగాణ బేవరెజెస్‌ కార్పొరేషన్‌కు సంబంధించినదే రూ.1000 కోట్ల వరకు ఐటీసీని క్లెయిమ్‌ చేసినట్లు గుర్తించారు. మరో 11 సంస్థలకు సంబంధించి రూ.400 కోట్ల ఐటీసీ సొమ్మును క్లెయిమ్‌ చేసినట్లు తేలిననట్లగా తెలుస్తోంది.  కుంభకోణం మొత్తం సోమేశ్‌కుమార్‌ కనుసన్నల్లోనే నడిచినట్లు దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి.  సోమేశ్ కుమార్ తో పాటు మరో ముగ్గురు అధికారులకు సీఐడీ అధికారులు ఇప్పటికే  నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు ఈడీ కూడా కేసు నమోదు చేసింది.           

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
Road Accident: అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురి మృతితో తీవ్ర విషాదం
అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురి మృతితో తీవ్ర విషాదం
Jayamangala Venkataramana : వైసీపీకి మరో షాక్ - పార్టీకి, పదవికి ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా !
వైసీపీకి మరో షాక్ - పార్టీకి, పదవికి ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?కుప్పకూలిన ఆసిస్ అదరగొట్టిన భారత బౌలర్లు!ఎలక్ట్రిక్ వెహికిల్స్ పేలిపోకూడదంటే.. జాగ్రత్తలు ఇవే!Memers Celebrating Team India Bowlers | Aus vs Ind First Test లో బౌలర్ల దెబ్బ అదుర్స్ కదూ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
Road Accident: అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురి మృతితో తీవ్ర విషాదం
అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురి మృతితో తీవ్ర విషాదం
Jayamangala Venkataramana : వైసీపీకి మరో షాక్ - పార్టీకి, పదవికి ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా !
వైసీపీకి మరో షాక్ - పార్టీకి, పదవికి ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా !
Pamkuntla Sai Reddy: 'సీఎం రేవంత్ బ్రదర్స్ వల్లే చనిపోతున్నా' - ముఖ్యమంత్రి సొంతూరిలో మాజీ సర్పంచ్ ఆత్మహత్య, సూసైడ్ నోట్‌లో..
'సీఎం రేవంత్ బ్రదర్స్ వల్లే చనిపోతున్నా' - ముఖ్యమంత్రి సొంతూరిలో మాజీ సర్పంచ్ ఆత్మహత్య, సూసైడ్ నోట్‌లో..
CM Chandrababu: 'ఏపీలో 2029లోనే ఎన్నికలు' - జమిలి ఎన్నికలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
'ఏపీలో 2029లోనే ఎన్నికలు' - జమిలి ఎన్నికలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Kalvakuntla Kavitha: తెలంగాణ జాగృతితో మళ్లీ రాజకీయ పోరాటం - ఈ సారి బీసీ నినాదం - కవిత ఇక అన్‌స్టాపబుల్ ?
తెలంగాణ జాగృతితో మళ్లీ రాజకీయ పోరాటం - ఈ సారి బీసీ నినాదం - కవిత ఇక అన్‌స్టాపబుల్ ?
Game Changer: ఇండియన్ హిస్టరీలో ఫస్ట్ టైమ్ ఇటువంటి ప్రీ రిలీజ్ వేడుక... రిలీజ్‌కు ముందు 'గేమ్ ఛేంజర్' ఖాతాలో అరుదైన రికార్డు
ఇండియన్ హిస్టరీలో ఫస్ట్ టైమ్ ఇటువంటి ప్రీ రిలీజ్ వేడుక... రిలీజ్‌కు ముందు 'గేమ్ ఛేంజర్' ఖాతాలో అరుదైన రికార్డు
Embed widget