అన్వేషించండి

Chada Venkat Reddy: ఈ స్థానాల నుంచి మేం పోటీకి రెడీ - చాడ వెంకట్ రెడ్డి

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని అనబెరి, సింగిరెడ్డి అమరుల భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చాడ వెంకటరెడ్డి మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్రంలో సీపీఐకి గట్టిపట్టున్న ఐదు స్థానాలతో పాటు హుస్నాబాద్ నియోజకవర్గంలోనూ పోటీకి సిద్ధం అవుతున్నామని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట రెడ్డి తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని అనబెరి, సింగిరెడ్డి అమరుల భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చాడ వెంకటరెడ్డి మాట్లాడారు. పొత్తుల కోసం ఎవరితోనూ సంప్రదించాల్సిన అవసరం తమకు లేదని, ఒకవేళ ఎవరైనా అడిగితే ఆలోచిస్తామని అన్నారు. 

ఇంతకుముందు లాగానే పొత్తులు అంటూనే ఎలాంటి సంప్రదింపులు జరపకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించడం చాలా విడ్డూరంగా ఉందని అన్నారు. ఏది ఏమైనా తమకు బలం ఉన్న ప్రతి చోట అభ్యర్థులను నిలబెడతామని అన్నారు. మతోన్మాద బీజేపీని ఓడించడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు వెళ్తామని పునరుద్ఘాటించారు. కమ్యూనిస్టు పార్టీలను సంప్రదించకుండానే సీఎం కేసీఆర్ ఏకంగా 115 మంది బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించారని అన్నారు. 

మునుగోడు ఉప ఎన్నికల్లో పెట్టుకున్న పొత్తు అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొనసాగుతుందని వామపక్షాలు భావించిన సంగతి తెలిసిందే. వామపక్షాల పార్టీలతో ఎలాంటి సంప్రదింపులు జరపకుండానే కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించేశారు. దీంతో వారికి భంగపాటు ఎదురైంది. ఈ ప్రవర్తనపై సీపీఐ, సీపీఎం నేతలు మండిపడ్డారు. అనంతరం వారు సమావేశమై తమకు బలంగా ఉన్న స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

ఈరోజు దరఖాస్తు చేసిన వారు వీరే

ఈ రోజు దరఖాస్తు చేసుకున్న వారిలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పద్మావతి రెడ్డి,  ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి, సీతక్క, ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ, సీడబ్యుసీ సభ్యులు దామోదర రాజా నర్సింహ, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, సర్వే సత్యనారాయణ, బలమూరి వెంకట్ తదితరులు దరఖాస్తు చేసుకున్నారు.

ఈ రోజుతో దరఖాస్తు గడువు ముగుస్తుంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అందరూ వారి వారి నియోజక వర్గాలలో దరఖాస్తు చేసుకున్నారు. జానారెడ్డి మాత్రం ఇంతవరకూ ఎక్కడా దరఖాస్తు చేయలేదు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Elections 2024: ఏపీలో 12,438 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు: ముఖేష్ కుమార్ మీనా
ఏపీలో 12,438 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు: ముఖేష్ కుమార్ మీనా
IPL 2024 KKR vs MI: వర్షం వల్ల ఓవర్లు కుదింపు, టాస్ నెగ్గి బౌలింగ్ తీసుకున్న ముంబై ఇండియన్స్
వర్షం వల్ల ఓవర్లు కుదింపు, టాస్ నెగ్గి బౌలింగ్ తీసుకున్న ముంబై ఇండియన్స్
Aavesham: హిందీ ప్రేక్షకులను హర్ట్ చేసిన ‘ఆవేశం’ - కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్న డైలాగ్
హిందీ ప్రేక్షకులను హర్ట్ చేసిన ‘ఆవేశం’ - కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్న డైలాగ్
Telangana Elections 2024: లోక్‌సభ ఎన్నికల కోసం భారీ బందోబస్తు, 48 గంటలపాటు 144 సెక్షన్: డీజీపీ రవిగుప్తా
లోక్‌సభ ఎన్నికల కోసం భారీ బందోబస్తు, 48 గంటలపాటు 144 సెక్షన్: డీజీపీ రవిగుప్తా
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Voters Going to Home For Votes | AP Elections  | ఓట్ల పండుగ.. పల్లె బాట పట్టిన పట్నం | ABPSilence Period Before Polling | AP Elections 2024 | ప్రచారం బంద్.. ఇలా చేస్తే ఇక అంతే | ABP DesamOld City Power Bills Politics | పాతబస్తీలో కరెంట్ బిల్లుల వివాదంపై గ్రౌండ్ టాక్ | ABP DesamAmalapuram Public Talk | Elections 2024 | అమలాపురం ఓటర్లు ఏమంటున్నారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Elections 2024: ఏపీలో 12,438 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు: ముఖేష్ కుమార్ మీనా
ఏపీలో 12,438 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు: ముఖేష్ కుమార్ మీనా
IPL 2024 KKR vs MI: వర్షం వల్ల ఓవర్లు కుదింపు, టాస్ నెగ్గి బౌలింగ్ తీసుకున్న ముంబై ఇండియన్స్
వర్షం వల్ల ఓవర్లు కుదింపు, టాస్ నెగ్గి బౌలింగ్ తీసుకున్న ముంబై ఇండియన్స్
Aavesham: హిందీ ప్రేక్షకులను హర్ట్ చేసిన ‘ఆవేశం’ - కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్న డైలాగ్
హిందీ ప్రేక్షకులను హర్ట్ చేసిన ‘ఆవేశం’ - కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్న డైలాగ్
Telangana Elections 2024: లోక్‌సభ ఎన్నికల కోసం భారీ బందోబస్తు, 48 గంటలపాటు 144 సెక్షన్: డీజీపీ రవిగుప్తా
లోక్‌సభ ఎన్నికల కోసం భారీ బందోబస్తు, 48 గంటలపాటు 144 సెక్షన్: డీజీపీ రవిగుప్తా
Vijayamma Supports YS Sharmila: ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం- షర్మిలకు మద్దతు ప్రకటించిన విజయమ్మ
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం- షర్మిలకు మద్దతు ప్రకటించిన విజయమ్మ
Scooters Under 1 Lakh in India: రూ.లక్షలోపు బెస్ట్ స్కూటీలు ఇవే - ఎలక్ట్రిక్ మోడల్స్ కూడా!
రూ.లక్షలోపు బెస్ట్ స్కూటీలు ఇవే - ఎలక్ట్రిక్ మోడల్స్ కూడా!
Andhra Pradesh New: ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్‌- రాబందుల్లా మారిపోయి పీక్కుతింటున్న వైనం 
ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్‌- రాబందుల్లా మారిపోయి పీక్కుతింటున్న వైనం 
కాంగ్రెస్ అభ్యర్థులు గెలిస్తేనే ప్రాజెక్టులకు జాతీయ హోదా, రాష్ట్రానికి నిధులు - చివరిరోజు ప్రచారంలో రేవంత్
కాంగ్రెస్ అభ్యర్థులు గెలిస్తేనే ప్రాజెక్టులకు జాతీయ హోదా, రాష్ట్రానికి నిధులు - చివరిరోజు ప్రచారంలో రేవంత్
Embed widget