Telangana Paddy Issue : అదనపు బియ్యం సేకరణ - తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ !
తెలంగాణ నుంచి అదనపు బియ్యం సేకరిస్తామని కేంద్రం ప్రకటించింది. ఆరున్నర లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఎఫ్‌సీఐ అధనంగా తీసుకోనుంది.
ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. అదనపు ధాన్యం సేకరణకు అంగీకారం తెలిపింది. తెలంగాణ నుంచి మరో 6.5 లక్షల మెట్రిక్ టన్నుల ఫోర్టిఫైడ్ పారా బాయిల్డ్ బియ్యం సేకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు బియ్యాన్ని బియ్యం భారత ఆహార సంస్థ (FCI) కు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమాచారం పంపింది.తెలంగాణలో 2020-21 రబీ సీజన్‌లో సేకరించాల్సిన గడువును రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థన మేరకు ఇటీవల మే- 2022 వరకు ఏడోసారి పొడిగించారు.
హైదరాబాద్ మినహా తెలుగు రాష్ట్రాల్లో అన్ని లోక్ సభ స్థానాలు గెలుస్తాం, అమిత్ షాతో కేఏ పాల్
తెలంగాణ - కేంద్ర ప్రభుత్వం మధ్య కొంత కాలంగా ధాన్యం సేకరణ అంశంలో తీవ్రంగా పోరాటం జరుగుతోంది. వడ్లు కొనాలని టీఆర్ఎస్ ప్రభుత్వం ఒత్తిడి చేస్తే.. బియ్యం మాత్రమే తీసుకుంటామని కేంద్రం స్పష్టం చేసింది. దీంతో తెలంగాణ ప్రభుత్వమే ధాన్యం సేకరణ నిర్వహించి మిల్లర్లకు పంపుతోంది. ఆ తర్వాత బియ్యం ఎఫ్‌సీఐకి ఇవ్వనుంది. ఇప్పటికీ ఈ ప్రక్రియ నడుస్తోంది. అయితే తెలంగాణలో ధాన్యం అధికంగా పండినందున అదనపు సేకరణ కోసం కేంద్రం అంగీకారం తెలిపింది.
ఛీ ఛీ పాల్ ను మేం టార్గెట్ చెయ్యడమేంటి ?
ఒప్పందం మేర బియ్యం ఇవ్వడం లేదని కూడా కేంద్రం తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేస్తోంది. ఈ క్రమంలో ఎఫ్‌సీఐతో విచారణ కూడా చేయించింది. ప్రాథమిక విచారణలో భారీగా అవకతవకలు జరిగినట్లుగా గుర్తించారు. దీంతో అన్ని రైస్ మిల్లుల్లోనూ విచారణ చేయాలని ఆదేశించారు. వారం రోజుల పాటు ఎఫ్‌సీఐ బృందాలు తనిఖీలు చేశాయి. ధాన్యం, బియ్యం బస్తాల నిల్వ ఎంత ఉంది? సీఎంఆర్ ఎంత ఇచ్చారో లెక్క చూసుకొని.. అంతా సరిగ్గా ఉంటే వెరిఫైడ్ అని ఆఫీసర్లు ధ్రువీకరించారు.
48 గంటల్లో క్షమాపణ చెప్పకపోతే క్రిమినల్ చర్యలు - బండి సంజయ్‌కు కేటీఆర్ లీగల్ నోటీస్!
లెక్కించలేకుండా బస్తాలు పెట్టిన మిల్లులకు సంబంధించి బియ్యం తీసుకునే ప్రసక్తే లేదని ఎఫ్‌సీఐ స్పష్టం చేసింది. బియ్యం ఎఫ్‌సీఐ తీసుకోవాలని మిల్లులు అనుకుంటే.. మళ్లీ ఫిజికల్ వెరిఫికేషన్ చేయాల్సిందేనని ధాన్యం బస్తాలు, బియ్యం బస్తాల లెక్క సరిచూసుకోవాల్సిందేనని తెలిపింది. ఇప్పుడు తనిఖీలు కూడా పూర్తయినందున అదనపు బియ్యం సేకరణకు అనుమతి ఇచ్చారు. దీంతో సమస్య చాలా వరకూ పరిష్కారం అవుతుందని భావిస్తున్నారు.