News
News
వీడియోలు ఆటలు
X

ఇకనుంచి మనమంతా జనంలోనే ఉండాలి ! – బీఆర్ఎస్ శ్రేణులకు KTR పిలుపు

బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు, ఇతర కార్యక్రమాలను సమన్వయ పరుస్తున్న ఇంచార్జిలు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులతో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

FOLLOW US: 
Share:

పార్టీ విస్తృతంగా నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాలు, ఇతర కార్యక్రమాలను సమన్వయ పరుస్తున్న ఇంచార్జిలు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులతో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రస్థానాన్ని ప్రతీ కార్యకర్తకు అర్థమయ్యేలా వివరించాలని ఈ సందర్భంగా దిశా నిర్దేశం చేశారు.

పార్టీ శ్రేణులకు కేటీఆర్‌ గైడ్ చేసిన ముఖ్యమైన అంశాలు:

 • అకాల వర్షాల సమస్యలు ఎదుర్కొంటున్న రైతులను స్థానిక వ్యవసాయ అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించాలి.
 • నష్టానికి గురైన వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లాలి.
 • ఇబ్బందికర పరిస్థితుల్లో రైతులకు భరోసా ఇచ్చేలా వారితో మమేకం కావాలి.
 • ప్రభుత్వం వేగంగా చేపడుతున్న కార్యక్రమాలను పార్టీ ఎమ్మెల్యేలు పర్యవేక్షించాలి.
 • పంచాయతీరాజ్ రోడ్ల బలోపేతం అంశంపై దృష్టి సారించాలి.
 • వర్షాకాలం లోపల రహదారి పనులు పూర్తయ్యేలా సమన్వయం చేసుకోవాలి.
 • గ్రామస్థాయిలో ఉపాధి హామీతోపాటు పంచాయతీరాజ్ శాఖ, పట్టణప్రగతి, పల్లెప్రగతి వంటి కార్యక్రమాల్లో భాగంగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల బిల్లుల చెల్లింపుపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిన నేపథ్యంలో, వీటన్నింటిని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి.
 • రాష్ట్ర ప్రభుత్వానికి ఉపాధి హామీకి సంబంధించిన 1300 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ నిధులు రాకుండా ఇంకా పెండింగులో ఉన్న నేపథ్యంలో, బిల్లుల చెల్లింపు ఆలస్యమైందని తెలపాలి.
 • వచ్చేనెల 29 నాటికి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలు పూర్తి కావాలి.
 • జిల్లా ఇన్చార్జులుగా వెళ్లిన వారి ఆధ్వర్యంలో పార్టీ కార్యక్రమాలు విస్తృత పరచాలి.
 • ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా కార్యకర్తలకు ఒక సందేశాన్ని ఇవ్వబోతున్నారు.
 • ఆ సందేశాన్ని అన్ని ఆత్మీయ సమ్మేళనాల్లో చదివి వినిపించాలి.
 • ప్రతి కార్యకర్తకు ఉద్యమ కాలం నుంచి పార్టీకి అండగా ఉంటూ రెండుసార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు దోహదం చేసిన విషయాన్ని వారికి గుర్తు చేస్తూ.. ముఖ్యమంత్రి పంపే ప్రత్యేక సందేశాన్ని ప్రతి కార్యకర్తకు చేరేలా చూడాలి.
 • ప్రతి గ్రామానికి, నాలుగైదు డివిజన్లకు కలిపి ఒక ఆత్మీయ సమ్మేళనాలని ఏర్పాటు చేసుకోవాలి.
 • ఆత్మీయ సమ్మేళనాల్లో పార్టీ కార్యకర్తల ప్రాధాన్యత వారితో ఉన్న అనుబంధాన్ని వివరించేలా కార్యక్రమన్ని ముందుకు తీసుకుపోవాలి.
 • సమావేశాల్లో పార్టీ శ్రేణుల ప్రాధాన్యత తెలంగాణ ప్రగతి ప్రస్థానం, తెలంగాణ రాకముందు ఉన్న పరిస్థితులు, వచ్చిన తర్వాత మారిన తెలంగాణ రాష్ట్ర ముఖచిత్రం వంటి అంశాలను స్పృశించుకుంటూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రస్థానాన్ని ప్రతీ కార్యకర్తకు అర్థమయ్యేలా వివరించాలి.
 • దేశంలో ప్రస్తుతం ఉన్న సామాజిక ఆర్థిక పరిస్థితుల పైన కూడా విస్తృతంగా మాట్లాడుకోవాలి.
 • మోదీ ప్రభుత్వ హయాంలో పెరిగిన పెట్రోల్ ధరలతో పాటు నిత్యవసర సరుకుల ధరలు, మోదీ ప్రభుత్వ విధానాల వైఫల్యాలు వంటి వాటిని మన కార్యకర్తలకు అర్థమయ్యేలా చర్చించి, ప్రజా బాహుళ్యంలోకివాటిని తీసుకువెళ్లేలా చూడాలి.
 • మోదీ ప్రభుత్వం దేశ ప్రజలతో పాటు, తెలంగాణ రాష్ట్రానికి చేసిన అన్యాయాలను ప్రత్యేకంగా చర్చించాలి.
 • తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నిధులు రాకుండా అడ్డుకోవడం, ఇవ్వాల్సిన ఇవ్వకుండా పెండింగులో పెట్టడం తద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రగతిని అడ్డుకుంటున్న తీరును కూడా ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మనపైనే ఉంది
 • రాష్ట్రంలో మహిళల అభివృద్ధి కోసం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను మహిళా లోకానికి చేరేలా చూడాలి.
 • ఇంకా ఎక్కడైనా ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలు ప్రారంభం కాకుంటే వెంటనే ప్రారంభం చేసుకోవాలి
 • రాష్ట్రవ్యాప్తంగా జరిగే ఆత్మీయ సమ్మేళనాలకు రాష్ట్రస్థాయి నాయకులు, పార్టీ నేతలు ప్రత్యేక అతిథులుగా హాజరవుతారు.
 • ఏప్రిల్ 20వ తేదీ నాటికి ఆత్మీయ సమ్మేళనాలు పూర్తి చేసుకుంటే ఏప్రిల్ 25వ తేదీన నియోజకవర్గస్థాయిలో పార్టీ ప్రతినిధుల సమావేశం ఉంటుంది.
 • ఒక్కో పార్టీ ప్రతినిధుల సమావేశంలో 1000 నుంచి 1500 మంది పాల్గొంటారు.
 • ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి గ్రామంలో, ప్రతివార్డులో జెండా పండుగ కార్యక్రమం నిర్వహించాలి.
 • ఏప్రిల్ 27వ తేదీన పార్టీ ప్లీనరీ జరుగుతుంది. దీనికి పార్టీ ఆహ్వానించిన ప్రతినిధులు మాత్రమే హాజరవుతారు.
Published at : 20 Mar 2023 07:42 PM (IST) Tags: KTR BRS CM KCR activity TELECONFERNCE

సంబంధిత కథనాలు

TS PGECET Results: తెలంగాణ పీజీఈసెట్‌ - 2023 ఫలితాలు వెల్లడి, డైరెక్ట్ లింక్ ఇదే!

TS PGECET Results: తెలంగాణ పీజీఈసెట్‌ - 2023 ఫలితాలు వెల్లడి, డైరెక్ట్ లింక్ ఇదే!

KTR: యువత స్కిల్ సంపాదించాలి, ఉద్యోగం దానికదే వస్తుంది - కేటీఆర్

KTR: యువత స్కిల్ సంపాదించాలి, ఉద్యోగం దానికదే వస్తుంది - కేటీఆర్

Hyderabad: ఉన్నట్టుండి ఉరేసుకున్న ఇంటర్ విద్యార్థిని, ఇంటి ఎదురుగా క్షుద్ర పూజలు!

Hyderabad: ఉన్నట్టుండి ఉరేసుకున్న ఇంటర్ విద్యార్థిని, ఇంటి ఎదురుగా క్షుద్ర పూజలు!

Ponguleti : కాంగ్రెస్‌లోకే పొంగులేటి, జూపల్లి - రేపో, మాపో అధికారిక ప్రకటన

Ponguleti : కాంగ్రెస్‌లోకే పొంగులేటి, జూపల్లి - రేపో, మాపో అధికారిక ప్రకటన

అప్పు పేరుతో తప్పుడు పనులు- హైదరాబాద్‌లో కాల్‌మనీ తరహా ఘటన- షీ టీం ఎంట్రీతో నిందితులు ఎస్కేప్

అప్పు పేరుతో తప్పుడు పనులు- హైదరాబాద్‌లో కాల్‌మనీ తరహా ఘటన- షీ టీం ఎంట్రీతో నిందితులు ఎస్కేప్

టాప్ స్టోరీస్

Steve Smith: టెస్టు ఛాంపియన్ ఫైనల్లో స్మిత్ సెంచరీ - మాథ్యూ హేడెన్ రికార్డు బద్దలు!

Steve Smith: టెస్టు ఛాంపియన్ ఫైనల్లో స్మిత్ సెంచరీ - మాథ్యూ హేడెన్ రికార్డు బద్దలు!

YSRCP News : రిలాక్స్ అయింది చాలు - పార్టీ అనుబంధ సంఘాలకు విజయసాయిరెడ్డి క్లాస్ !

YSRCP News : రిలాక్స్ అయింది చాలు - పార్టీ అనుబంధ సంఘాలకు విజయసాయిరెడ్డి క్లాస్ !

Janasena News : జనసేనలోకి ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు - చీరాలపై గురి పెట్టారా ?

Janasena News : జనసేనలోకి ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు - చీరాలపై గురి పెట్టారా ?

Jr NTR - McDonald's AD : చికెన్ కోసం రాత్రిని పగలు చేసిన ఎన్టీఆర్ - కొత్త యాడ్ చూశారా?

Jr NTR - McDonald's AD : చికెన్ కోసం రాత్రిని పగలు చేసిన ఎన్టీఆర్ - కొత్త యాడ్ చూశారా?