News
News
X

BRS News : జాతీయ స్థాయిలో ఉండేలా పార్లమెంట్‌లో పోరాటం - ఎంపీలకు 29న దిశానిర్దేశం చేయనున్న కేసీఆర్ !

బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం 29వ తేదీన జరగనుంది. పార్లమెంట్‌లో కేంద్రంపై పోరాట కార్యచరణను కేసీఆర్ ఖరారు చేయనున్నారు.

FOLLOW US: 
Share:

BRS News :   బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఈ నెల 29న జరుగనుంది. ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రభగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన సమావేశం జరుగనుంది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో పార్టీ ఎంపీలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిశానిర్దేశం చేయనున్నారు. ఉభయసభల్లో చర్చించబోయే అంశాలు, పార్టీ తరఫున అనుసరించ వలసిన వ్యూహంపై చర్చించనున్నారు.

సుదీర్ఘంగా రెండు విడతలుగా 66 రోజుల పాటు పార్లమెంట్ సమావేశాలు

పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ఈ నెల 31 నుంచి ప్రారంభంకానున్నాయి. రెండు విడతల్లో ఏప్రిల్‌ 6వ తేదీ వరకు సాగుతాయి. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. తొలి రోజు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగిస్తారు. ఆ వెంటనే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆర్థిక సర్వేను పార్లమెంటు ముందుంచుతారు. రెండో రోజైన ఫిబ్రవరి 1న 2023 కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి సమర్పిస్తారు. రెండు విడతలుగా అరవై ఆరు రోజుల పాటు పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయి. 

ఇటీవలి కాలంలో  పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రంపై విరుచుకుపడుతున్న బీఆర్ఎస్ ఎంపీలు

గత రెండు, మూడు పార్లమెంట్ సెషన్స్‌లో టీఆర్ఎస్ కేంద్ర ప్రభుత్వపై విరుచుకుపడింది. పార్లమెంట్ సమావేశాలను అడ్డుకునేలా నినాదాలు చేసేవారు. ఈ సారి కేంద్రంపై ఎలా పోరాడాలన్నదానిపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. వీటితో పాటు కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ నిధులు ఇతర సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ అనుసరించాల్సిన వ్యూహాన్ని కూడా ఈ సమావేశంలో ఖరారు చేసే అవకాశం ఉంది. 

గనర్నర్ వ్యవహారశైలిపై ఢిల్లీలో  దేశం మొత్తం తెలిసేలా పార్లమెంట్‌లో నిరసన ? 

కొంతకాలంగా గవర్నర్, సీఎంకు మధ్య పడటం లేదు. గణతంత్ర దినోత్సవంలో గవర్నర్ తమిళిసై రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఘాటు విమర్శలు చేశారు. గవర్నర్ పై రాష్ట్ర మంత్రులు ఎదురుదాడి చేస్తున్నారు. తమిళిసై పై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని అంటున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కేసీఆర్ ఎంపీలకు ఎలాంటి సూచనలు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.  

భారత్ రాష్ట్ర సమితిగా మారిన తర్వాత తొలి సారి పార్లమెంట్ సమావేశాలు 

ఇప్పటి వరకూ పార్లమెంట్ రికార్డుల్లో  తెలంగాణ రాష్ట్ర సమితి అని ఉంటుంది. ఇటీవలే బీఆర్ఎస్ ఎంపీల విజ్ఞప్తి మేరకు  బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీగా గుర్తించారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ .. బీఆర్ఎస్‌గా మారిన తొలి సమావేశాలుగా వీటిని భావించవచ్చు. జాతీయ పార్టీగా మారినందున.. కేంద్రంపై పోరాటంలో తమదైన మార్క్ చూపించాలని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. 

ఏ ఊర్లో డబుల్ బెడ్రూం ఇవ్వలేదో అక్కడ ఓట్లు అడగొద్దు, కేటీఆర్ సవాల్ కు సిద్ధమా? - రేవంత్ రెడ్డి

Published at : 27 Jan 2023 04:00 PM (IST) Tags: BRS KCR BRS Parliamentary Party

సంబంధిత కథనాలు

Hyderabad Metro Charges : హైదరాబాద్ వాసులకు మెట్రో షాక్, రద్దీ సమయాల్లో రాయితీ ఎత్తివేత!

Hyderabad Metro Charges : హైదరాబాద్ వాసులకు మెట్రో షాక్, రద్దీ సమయాల్లో రాయితీ ఎత్తివేత!

Breaking News Live Telugu Updates: బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌పై ఎటాక్ - మందడంలో తీవ్ర ఉద్రిక్తత !

Breaking News Live Telugu Updates: బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌పై ఎటాక్ - మందడంలో తీవ్ర ఉద్రిక్తత !

Karimnagar Accident : హెల్మెట్ ధరించినా దక్కని ప్రాణం, రోడ్డు ప్రమాదంలో మహిళా టీచర్ మృతి

Karimnagar Accident : హెల్మెట్ ధరించినా దక్కని ప్రాణం, రోడ్డు ప్రమాదంలో మహిళా టీచర్ మృతి

TSPSC పేపర్ లీకేజీలో మొత్తం హవాలా మార్గమేనా?  నిందితులు ఆర్థిక లావాదేవీలు ఎలా జరిపారు?

TSPSC పేపర్ లీకేజీలో మొత్తం హవాలా మార్గమేనా?  నిందితులు ఆర్థిక లావాదేవీలు ఎలా జరిపారు?

Adilabad News: హనుమాన్ దీక్షలో వచ్చాడని బడిలోకి రానివ్వని ప్రిన్సిపాల్ - దీక్షాపరుల ఆందోళన

Adilabad News: హనుమాన్ దీక్షలో వచ్చాడని బడిలోకి రానివ్వని ప్రిన్సిపాల్ - దీక్షాపరుల ఆందోళన

టాప్ స్టోరీస్

Tenali Council Fight : తెనాలి మున్సిపల్ కౌన్సిల్ లో రసాభాస, చొక్కాలు చిరిగేలా కొట్టుకున్న టీడీపీ, వైసీపీ కౌన్సిలర్లు

Tenali Council Fight : తెనాలి మున్సిపల్ కౌన్సిల్ లో రసాభాస, చొక్కాలు చిరిగేలా కొట్టుకున్న టీడీపీ, వైసీపీ కౌన్సిలర్లు

Naga Chaitanya : చైతూను కావాలని టార్గెట్ చేశారా? డివోర్స్, డేటింగ్ రూమర్స్ - ప్లాన్ ప్రకారమే ప్రతిదీ తెరపైకి?

Naga Chaitanya : చైతూను కావాలని టార్గెట్ చేశారా? డివోర్స్, డేటింగ్ రూమర్స్ - ప్లాన్ ప్రకారమే ప్రతిదీ తెరపైకి?

PM Modi Degree Certificate: మోదీ ఎడ్యుకేషన్‌ గురించి అడిగిన కేజ్రీవాల్‌కు జరిమానా- ఆరాలు అనవసరమన్న గుజరాత్ హైకోర్టు

PM Modi Degree Certificate: మోదీ ఎడ్యుకేషన్‌ గురించి అడిగిన కేజ్రీవాల్‌కు జరిమానా-  ఆరాలు అనవసరమన్న గుజరాత్ హైకోర్టు

Shaakuntalam: ‘శాకుంతలం’ నుంచి ‘మల్లిక’ వీడియో సాంగ్ రిలీజ్ - అందంతో కట్టిపడేస్తోన్న సమంత

Shaakuntalam: ‘శాకుంతలం’ నుంచి ‘మల్లిక’ వీడియో సాంగ్ రిలీజ్ - అందంతో కట్టిపడేస్తోన్న సమంత