Attack On News Channel: టీవీ చానల్ ఆఫీసులో బీఆర్ఎస్ కార్యకర్తల విధ్వంసం - స్టూడియోలో ఉన్న హీరో సుహాస్‌పైనా...
Attack: హైదరాబాద్‌లో మహా న్యూస్ చానల్ పై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. ఆ సమయంలో హీరో సుహాస్ కూడా ఉండటంతో ఆందోళనచెందారు.

BRS activists attack Maha News Channel: హైదరాబాద్ జూబ్లిహిల్స్ లో ఉన్న మహా న్యూస్ టీవీ చానల్‌పై భారత రాష్ట్ర సమితికి చెందిన కార్యకర్తలు దాడి చేశారు. కేటీఆర్ కు వ్యతిరేకంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో అభ్యంతరకర వార్తలు ప్రసారం చేస్తున్నారని బీఆర్ఎస్ కార్యకర్తలు ఆరోపించారు. ఆఫీసు ఎదురుగా ఉన్న కార్లతో పాటు .. కార్యాలయం లోపలుకు చొచ్చుకు వెళ్లి దాడి చేశారు. రిసెప్షన్ తో పాటు స్టూడియోను కూడా ధ్వంసం చేశారు.
బీఆర్ఎస్ కార్యకర్తలు హఠాత్తుగా దాడితో ఉద్యోగులంతా భయాందోళనకు గురయ్యారు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో కేటీఆర్ పై మహాన్యూస్ లో అభ్యంతరకర విషయాలు వస్తున్నాయని..తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని ఈ దాడి చేసినట్లుగా ప్రకటించుకున్నారు.
దాడి సమయంలో మహా న్యూస్ స్టూడియోలో హీరో సూహాస్ ఉన్నారు తన కొత్త సినిమా ఉప్పుకప్పురంబు సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఇంటర్యూ ఇచ్చేందుకు వచ్చారు. దాడులతో ఆయన ఆందోళనకు గురయ్యారు. స్టూడియో ఎదురుగా ఉన్న ఆయన కారును కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు ధ్వంసం చేసినట్లుగా తెలుస్తోంది. దాడి తర్వాత ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు.
దాడి చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ పై మండిపడ్డారు.
ఫోన్ ట్యాపింగ్ పై వాస్తవాలు వెలుగులోకి తెచ్చిన మహా న్యూస్ అఫిస్ పై దాడి చేసిన బీఆర్ఎస్ ఆకు రౌడీలు..
— Kattar Congress (@kattarcongresii) June 28, 2025
కేటిఆర్ నీచపు బుద్ధిని బయటపెట్టిన మహా న్యూస్..
Mr. @KTRBRS నీ గుండాలని పంపించి ఒక మీడియా సంస్థపై దాడి చేపించినవ్..
మరి పొద్దునే లేస్తే ప్రభుత్వం పై తెలుగు స్క్రైబ్ & టెక్ సెల్… pic.twitter.com/qvleScbkwU
అంతకు ముందు ట్యాపింగ్ వ్యవహారంలో తనతోపాటు పార్టీ నేతలపై దుష్ప్రచారం చేస్తున్న వారికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హెచ్చరికలు జారీ చేశారు.
అబద్ధాలు అసత్యాలు దురుద్దేశపూర్వక ప్రచారాలు చేస్తే చట్టపరంగా చర్యలు తప్పవన్నారు. కొంతమంది వ్యక్తులు మీడియా ముసుగులో కావాలనే ఇలాంటి నీచమైన దుష్ప్రచారం చేస్తున్నారు. కావాలని కొన్ని మీడియా సంస్థలు మరియు కొంతమందితో జట్టు కట్టి ఒక ముఠాగా మారి చేస్తున్న దుష్ప్రచారంపై చట్టపరంగా తగిన సమాధానం చెబుతాము. గత కొన్ని నెలలుగా కొంతమంది విలేకరుల వేషం వేసుకున్న కొంతమంది మీడియా సంస్థల యజమానులు నా పైన వ్యక్తిగతంగా, మా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంపై విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. పదేపదే వీరు చేస్తున్న వ్యక్తిత్వ హననం వలన మా కుటుంబ సభ్యుల పైన తీవ్రమైన దుష్ప్రభావం చూపిస్తున్నాయన్నారు. మీడియా రూపంలో వీరు చేస్తున్న దాడులు నా శ్రేయోభిలాషులు, పార్టీ నాయకులను, పార్టీ శ్రేణులను బాధ కలిగిస్తున్నాయన్నారు. కేటీఆర్ ఇలాహెచ్చరికలు జారీ చేసిన కాసేపటికే మహా న్యూస్ పై కార్యకర్తలు దాడులు చేశారు.





















