BJP State Presidents: ఏపీ, తెలంగాణ బీజేపీ అధ్యక్షుల ఎన్నికకు ముహూర్తం ఫిక్స్- అధిష్టానం ప్రకటన
Telangana BJP president | ఏపీ, తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం. మరో మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాలకు బీజేపీ అధ్యక్షులకు ఎన్నిక నిర్వహించనున్నారు.

Andhra Pradesh BJP President | హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియపై ఫోకస్ చేసింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు అధ్యక్షుల నియామకాలకు ముహూర్తం ఖరారు చేసింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి కోసం నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఆదివారం నోటిఫికేషన్ వస్తే, సోమవారం నామినేషన్లు స్వీకరిస్తారు. జులై ఒకటో తేదీన ఎన్నిక నిర్వహించనున్నట్లు పార్టీ ప్రకటనలో తెలిపింది.
ఏపీ బీజేపీ అధ్యక్షుడి ఎన్నిక
తెలంగాణతో పాటు ఏపీలోనూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికల జరగనుంది. ఈ మేరకు ఏపీ బీజేపీ అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేశారు. కేవలం 3 రోజుల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది. రాజ్యసభ ఎంపీ, పార్టీ రాష్ట్ర ఎన్నికల అధికారి పాకా సత్యనారాయణ విజయవాడలో మీడియాతో మాట్లాడారు. 30వ తేదీన నామినేషన్లు స్వీకరించడం, ఉపసంహరణ సైతం అదే రోజు ఉంటుందన్నారు. నూతన అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ జులై 1న పూర్తవుతుందని స్పష్టం చేశారు.
తెలంగాణలో కీలకమైన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ అధ్యక్షుడి మార్పు జరిగింది. బండి సంజయ్ అధ్యక్షుడిగా తెలంగాణలో బీజేపీ బాగా పుంజుకుందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఈ క్రమంలో తెలంగాణలో కాషాయ దళం పగ్గాలను బండి సంజయ్ నుంచి కిషన్ రెడ్డి చేతికి అప్పగించింది అధిష్టానం. 2018 ఎన్నికలతో పోల్చితే 2023లో బీజేపీ ఎక్కువ సీట్లు, ఓట్ల శాతంతో స్పష్టమైన మార్పు చూపించింది. ఏపీలో ప్రస్తుతం పురంధేశ్వరి బీజేపీ అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆమె రాజమహేంద్రవరం లోక్ సభ స్థానం నుంచి ఎంపీగా సైతం ఘన విజయం సాధించారు.






















