News
News
X

Talasani Brothers ED : ఈడీ ఎదుటకు తలసాని సోదరులు - ఆ కేసులో ఇరుక్కుపోయారా ?

మంత్రి తలసాని శ్రీనివాస్ సోదరులు ఈడీ ఎదుట హాజరయ్యారు. క్యాసినో, మనీలాండరింగ్ కేసుల్లో విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది.

FOLLOW US: 

Talasani Brothers ED :   తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరులను ఈడీ ప్రశ్నిస్తోంది. వారికి కొద్ది రోజుల కిందట ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ నోటీసులు జారీ చేసింది. తలసాని సోదరులు మహేష్, ధర్మేందర్ యాదవ్ పలు రకాల వ్యాపారాలు చేస్తున్నారు. ఈ వ్యాపారాల్లో హవాలా, మనీలాండరింగ్ వంటి వాటికి పాల్పడినట్లుగా ఈడీ అధికారులు అనుమనిస్తున్నారు. వారు క్యాసినో నిర్వహణలోనూ పాలు పంచుకున్నట్లుగా ఈడీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. అంతే కాకుండా నాలుగైదు రోజుల పాటు ప్రశ్నించింది. ఈ క్రమంలో చీకోటి ప్రవీణ్‌తో లావాదేవీలు నిర్వహించిన వారి వివరాలు ఈడీకి లభించాయని వాటిలో తలసాని సోదరుల లావాదేవీలు కూడా ఉన్నట్లుగా చెబుతున్నారు. దీనిపైనే విచారణకు వారిని పిలిచారని చెబుతున్నారు. 

క్యాసినో ,  మనీలాండరింగ్‌లో ఈడీకి ఆధారాలు చిక్కాయా ? 

తలసాని మహేష్, ధర్మేందర్ యాదవ్‌లకు ఈడీ నోటీసులు వచ్చినట్లుగా ఇప్పటి వరకూ బయటకు తెలియదు. వారు విచారణకు  హాజరైన తర్వాతనే తెలిపింది. మొత్తంగా వారి వ్యాపారాలకు సంబంధించిన నాలుగేళ్ల ఆర్థిక లావాదేవీలను తీసుకుని రావాలని ఈడీ ఆదేశించినట్లుగా తెలుస్తోంది. అయితే వీరి వ్యాపారాల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు భాగస్వామ్యం ఉందో లేదో స్పష్టత లేదు. మంత్రికి మాత్రం ఈడీ నోటీసులు జారీ కాకపోవడంతో.. ఆయన సోదరుల వ్యవహారంలోనే ఈడీ ప్రశ్నిస్తున్నట్లుగా అంచనా వేస్తున్నారు. ఈ అంశంపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఎలాంటి ప్రకటనా చేయలేదు. 

బీజేపీ టార్గెట్ చేస్తుందని హెచ్చరించిన కేసీఆర్ 

News Reels

తెలంగాణ రాష్ట్ర సమితి నేతలపై ఈడీ అధికారులు దాడులు చేసే అవకాశం ఉందని.. ముఖ్యమంత్రిగా ఎమ్మెల్యేలు.. కీలక నేతలను టార్గెట్ చేస్తారని కేసీఆర్ పార్టీ కార్యవర్గ సమావేశంలో అలర్ట్ చేశారు. ఎవరూ భయపడవద్దని.. ఎదురు తిరగాలని సూచించారు. ఆయన ఈ వ్యాఖ్యలు చేసిన రెండో రోజే తలసాని సోదరులు ఈడీ ఎదుటకు హాజరు కావాల్సి వచ్చింది. ఈ అంశంపై టీఆర్ఎస్ వైపు నుంచి ఎవరూ మాట్లాడటం లేదు. తలసాని సోదరులు తప్పు చేసి ఉంటే.. ఈడీ చూసుకుంటుందని.. వారు టీఆర్ఎస్ కార్యక్రమాల్లో ఎప్పుడూ పాల్గొనలేదని గుర్తు చేస్తున్నారు. అయితే తలసాని  కుటుంబం మొత్తం వ్యాపారాలు కలిసే చేస్తుందని.. ఆయననే ఈడీ టార్గెట్ చేసి ఉండవచ్చని టీఆర్ఎస్ వర్గాలు అనుమానిస్తున్నాయి. 

తెలంగాణలో పలువురు టీఆర్ఎస్ నేతలపై ఐటీ, ఈడీ దాడులు 

తెలంగాణలో ఐటీ, ఈడీ దాడులు కలకలం రేపుతున్నాయి. పది రోజుల కిందట టీఆర్ఎస్ నేతలకు చెందిన గ్రానైట్ పరిశ్రమపై పెద్ద ఎత్తున ఈడీ అధికారులు దాడులు  చేశారు. అనేక అవకతవలను గుర్తించామని ప్రకటించారు. మనీలాండరింగ్‌కు ఆధారాలు దొరికాయన్నారు. ఈ క్రమంలో.. తలసాని సోదరులను ఈడీ ప్రశ్నించడం ఆసక్తి రేపుతోంది. టీఆర్ఎస్ అధినేత హెచ్చరించినట్లుగా వరుసగా .. ఆ పార్టీ నేతలను కేంద్ర దర్యాప్తు సంస్థలు టార్గెట్ చేశాయన్న దాన్ని ఎక్కువ మంది నమ్ముతున్నారు. 

Published at : 16 Nov 2022 02:40 PM (IST) Tags: BJP VS TRS Minister Talasani Srinivas Yadav ED Inquiry Talasani brothers ED inquiry

సంబంధిత కథనాలు

Delhi Liquor Scam Kavita Name :  ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో వెలుగులోకి కవిత పేరు - అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించిన ఈడీ !

Delhi Liquor Scam Kavita Name : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో వెలుగులోకి కవిత పేరు - అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించిన ఈడీ !

Breaking News Live Telugu Updates: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ ఈడీ రిమాండ్ రిపోర్ట్ లో కల్వకుంట్ల కవిత పేరు

Breaking News Live Telugu Updates: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ ఈడీ రిమాండ్ రిపోర్ట్ లో కల్వకుంట్ల కవిత పేరు

ACB Raids: ఇంటి పర్మిషన్ కోసం లంచం, ఏసీబీకి అడ్డంగా దొరికిన పంచాయతీ కార్యదర్శి

ACB Raids: ఇంటి పర్మిషన్ కోసం లంచం, ఏసీబీకి అడ్డంగా దొరికిన పంచాయతీ కార్యదర్శి

TRS Fire On Sharimila : భారీ కుట్రతోనే షర్మిల పాదయాత్ర - జగన్ వల్లే నర్సంపేటకు గోదావరి నీళ్లు రాలేదన్న ఎమ్మెల్యే !

TRS Fire On Sharimila :  భారీ కుట్రతోనే షర్మిల పాదయాత్ర - జగన్ వల్లే నర్సంపేటకు గోదావరి నీళ్లు రాలేదన్న ఎమ్మెల్యే !

Nara Bramhani Bike Rider : లెహ్ నుంచి లద్దాఖ్ వరకూ నారా బ్రహ్మణి బైక్ జర్నీ - ఎందుకు ? ఏమిటి ? ఎలా?

Nara Bramhani Bike Rider : లెహ్ నుంచి లద్దాఖ్ వరకూ నారా బ్రహ్మణి బైక్ జర్నీ  -  ఎందుకు ? ఏమిటి ? ఎలా?

టాప్ స్టోరీస్

30 నెలల్లో బందరు పోర్ట్ సిద్ధం చేస్తాం: మాజీ మంత్రి పేర్ని నాని

30 నెలల్లో బందరు పోర్ట్ సిద్ధం చేస్తాం: మాజీ మంత్రి పేర్ని నాని

Tirumala Update: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు ఇవే

Tirumala Update: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు ఇవే

Jai Bhim Sequel: త్వరలో ‘జై భీమ్’కు సీక్వెల్? మరో కొత్త కేసుతో రానున్నారా?

Jai Bhim Sequel: త్వరలో ‘జై భీమ్’కు సీక్వెల్? మరో కొత్త కేసుతో రానున్నారా?

అదిరిపోయే సాంగ్‌తో మురిపిస్తున్న ‘బ్రహ్మాస్త్ర’ బ్యూటీ మౌని రాయ్

అదిరిపోయే సాంగ్‌తో మురిపిస్తున్న ‘బ్రహ్మాస్త్ర’ బ్యూటీ మౌని రాయ్