అన్వేషించండి

Bhatti Vikramarka: టీఎస్పీఎస్సీలోనే కాదు సింగరేణిలోనూ పేపర్ లీకేజీలు! - భట్టి విక్రమార్క సంచలన ఆరోపణలు

Bhatti Vikramarka: ఉమ్మడి అదిలాబాద్ జిల్లా తెలంగాణకు తలమానికం అని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. జిల్లా ప్రజల్లో ప్రేమించే గుణం తనకు చాలా బాగా నచ్చిందన్నారు. 

Bhatti Vikramarka: పాదయాత్ర చేస్తున్న సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మంచిర్యాల జిల్లా నస్పూర్ చేరుకున్నారు. సీఎం కేసీఆర్ పై, టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీలపై సంచలన ఆరోపనలు చేశారు. కేవలం టీఎస్ పీఎస్సీలోనే కాదు సింగరేణి ఉద్యోగాల్లోనూ పేపర్ లీకేజీలు జరిగాయని సంచలన ఆరోపణలు చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తెలంగాణ రాష్ట్రానికే తవమానికం అన్నారు. జల, అటవీ, బొగ్గు గనులు కలగలిపి సహజ వనరులు ఉన్న జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అని వివరించారు. జిల్లా సస్యశ్యామలం కాకుండా పదివేల కోట్లు ఖర్చు చేసిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు అడ్డుపడ్డ అతి పెద్ద ద్రోహి సీఎం కేసీఆర్ అని ఫైర్ అయ్యారు. జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో కట్టిన 8 మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టుల కాలువలకు మరమ్మత్తులు చేయకుండా ముఖ్యమంత్రి అడ్డుకున్నారన్నారు. ఇక్కడ ఉన్న సింగరేణి గనులను ప్రవేట్ పరం చేస్తూ ఉద్యోగావకాశాలు లేకుండా చేస్తుంది కూడా కేసీఆర్ యే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఉద్యోగాలు పెంచాల్సింది పోయి.. ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు పరం చేయడం ఏంటని అన్నారు.

కాళేశ్వరం అవినీతి మీద సమగ్ర విచారణ జరిపిస్తాం..!

సింగరేణితో మొదలు పెట్టి జైపూర్ పవర్ ప్రాజెక్ట్ కూడా ప్రవేట్ వ్యక్తులకే అప్పజెప్పాడంటూ భట్టి విక్రమార్క ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వం చేతిలో ఉంటేనే అందరికీ రూల్ ఆఫ్ ఆర్డర్ ప్రకారం రిజర్వేషన్లు ఉంటాయన్నారు. తాము వచ్చాక సింగరేణి ఆస్తులు కాపాడుతామన్నారు. ఉద్యోగాలు అన్ని ప్రభుత్వ సంస్థ పరిధిలో భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. కాళేశ్వరం మునక ప్రాంతాన్ని కాపాడుతూ... కాళేశ్వరంలో జరిగిన అవినీతి మీద సమగ్ర విచారణ చేపిస్తామని చెప్పుకొచ్చారు. ఇక్కడ ఉన్న ఆస్తులు అమ్ముతూ.. విశాఖ ఉక్కు కొంటాం అనడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో హౌసింగ్ కార్పొరేషన్ భూములు అమ్ముతున్నాడని ఆరోపించారు. దిల్ దక్కన్ సంబధించిన భూములు సైతం సీఎం కేసీఆర్ అమ్మకానికి పెట్టారన్నారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇచ్చిన అసైన్డ్, మాన్యం భూములు లాక్కొని వాటిని కూడా ప్లాట్లు చేసి అమ్ముతున్నారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ ని ఇలాగే వదిలేస్తే.. అన్నిటినీ అమ్మేసినట్లే రాష్ట్రాన్నే అమ్మెస్తాడని ఎద్దేవా చేశారు. ఈ అమ్మకానికి చరమగీతం పాడాలని... అమ్మకాలను ఆపాలని అన్నారు. ఈ ప్రభుత్వానికి పాలించడానికి మాత్రమే ప్రజలు ఓట్లు వేశారని.. ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకుంది ఆస్తులు అమ్మడానికి కాదని చెప్పుకొచ్చారు. 

ఈనెలవ తేదీ 14వ తేదీన జై భారత్ సత్యాగ్రహ సభ ఏర్పాటు

సీఎం కేసీఆర్ మయాలో పడి ఎవరైనా ప్రభుత్వ ఆస్తులు కొంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకా.. ఆ ఆస్తులన్నీ వెనక్కు తీసుకుంటామని భట్టి విక్రమార్క చెప్పుకొచ్చారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని అధికరంలోకి వచ్చి.. ఉన్న ఆస్తులు అమ్మేస్తున్న ప్రధాని మోడీ.. విభజన హామీల మీద ఎటువంటి ప్రకటన లేకుండా హైద్రాబాద్ వచ్చి రాజకీయ ప్రసంగం చేసి వెళ్లాడని చెప్పుకొచ్చారు. సీఎం కేసీఆర్ కుటుంబం అవినీతిలో మునిగింది అని చెప్పే ప్రధాని ఎందుకు విచారణకు ఆదేశించలేదని ప్రశ్నించారు. కేసీఆర్, మోడీ ఇద్దరూ కలిసి ఆడుతున్న డ్రామా ఇదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ మీద అన్యాయంగా అనర్హత వేటు వేశారని.. భారత రాజ్యాంగం అందించిన అంబేద్కర్ పుట్టిన రోజున రాహుల్ గాంధీకి మద్దతుగా మంచిర్యాలలో సభ నిర్వహిస్తామన్నారు. ఈనెల 14వ తేదీన ప్రజాస్వామ్యం కాపాడుకోడానికి  జై భారత్ సత్యాగ్రహ సభ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ భారీ బహిరంగ సభకు ఏఐసీసీ అధ్యక్షులు శ్రీ మల్లిఖార్జున్ ఖర్గే, ఏఐసీసీ ప్రతినిధులు రాష్ట్ర నాయకులు పాల్గొంటారని భట్టి విక్రమార్క చెప్పుకొచ్చారు. 

అడవిపై ఆదివాసులకే పూర్తి హక్కు

పాదయాత్ర చేసిన ప్రతీ గ్రామంలో  పోడు భూముల సమస్యను, సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటీకరణ చేయడంతో ప్రజలు పడుతున్న బాధలను చూశానన్నారు. పథకం ప్రకారం అడివి బిడ్డలను.. అడివి నుంచి దూరం చేయడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కుట్ర చేస్తున్నారని అన్నారు. అడవిని కాపాడుతున్న ఆదివాసులపై.. భూములు ధ్వంసం చేస్తున్నారని ముద్ర వేయడం దారుణం అన్నారు. అడవి పైన అడవి బిడ్డలదే పూర్తి హక్కు అని.. బీజేపీ, బీఆర్ఎస్ పాలకులు ఇద్దరూ కలిసే కావాలని సింగరేణి ఆస్తులను ప్రవేట్ పరం చేస్తున్నారన్నారు. నాడు పార్లమెంటులో ప్రైవేటీకరణ బిల్లుకు అనుకూలంగా ఓట్లు వేసింది బీఆర్ఎస్ ఎంపీలు అని గుర్తు చేశారు. నాడు బొగ్గు గనులను ఇందిరా గాంధీ జాతీయకరణ చేస్తే వీళ్లు ప్రవేట్ పరం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బొగ్గు గనులను దేశ సంపదగా గుర్తిస్తామన్నారు. ప్రైవేట్ వ్యక్తుల నుంచి బొగ్గు గనులను తిరిగి తీసుకొని ప్రజలకు అప్పగిస్తామని చెప్పుకొచ్చారు. బయ్యారం ప్లాంటుపై చిత్తశుద్ధి లేని కేసీఆర్ విశాఖ స్టీల్ ప్లాంట్ కొనడానికి వెళ్లడం విడ్డూరంగా ఉందన్నారు. టీఎస్పీఎస్సీలో మాత్రమే లీకేజీలు కాలేదని.. సింగరేణి రిక్రూట్ చేసిన క్లరికల్ పోస్టుల్లో కూడా పేపర్ లీకేజీలు చేసి వారికి అనుకూలంగా ఉన్నవారికే ఉద్యోగాలు ఇచ్చారని భట్టి విక్రమార్క చెప్పుకొచ్చారు.

రాష్ట్ర ప్రభుత్వానికి విద్యార్థుల పట్ల చిత్తశుద్ధి ఉంటే టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేయాలని భారత రాష్ట్రపతికి సిఫారసు చేసి ఉండేవారన్నారు. ప్రజల ఆస్తులను, సంపదను లూటీ చేయడానికి బీజేపీ, బీఆర్ఎస్ పాలకులు దొంగ నాటకాలు ఆడుతూ ప్రజలను దారి మల్లిస్తున్నారన్నారు. దేశంలోని అన్ని పార్లమెంటు స్థానాలకు అయ్యే ఎన్నికలకు ఖర్చు పెడతానని చెప్పిన కేసీఆర్ కు ఈ డబ్బు ఎక్కడిదని ప్రశ్నించారు. తెలంగాణ సంపదను దోపిడీ చేసిన డబ్బు కాదా అని అడిగారు. పాదయాత్ర చేసిన ప్రతీ గ్రామంలో మిషన్ భగీరథ నీళ్లు కనిపించలేదన్నారు. తెలంగాణలో మిషన్ భగీరథకు వెచ్చించిన 42 వేల కోట్ల రూపాయలు అతిపెద్ద స్కాం అని భట్టి విక్రమార్క చెప్పుకొచ్చారు. సొంత ఆస్తులను దేశానికి అంకితం చేసి, తాతా, నానమ్మ, తండ్రి ప్రధానులైన సొంత ఇల్లు లేనటువంటి రాహుల్ గాంధీ కుటుంబం ఈ దేశానికి కావాలాగా వ్యవహరిస్తున్నారన్నారు. సంపదను దోపిడీ చేస్తున్న మోడీ, కేసీఆర్ లాంటి వాళ్లు కావాలో ప్రజలే ఆలోచించుకోవాలన్నారు. మీడియా సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ అజ్మతుల్లా, కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు అన్వేష్ రెడ్డి, స్పోక్స్ పర్సన్స్ లోకేష్ యాదవ్, విజయ్, పీసీసీ కార్యదర్శి శివకుమార్ తదితరులు ఉన్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Dilawarpur Latest News: ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
Dilawarpur Latest News: ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
Vizag News: విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి, 14 మందికి అస్వస్థత 
Vizag News: విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి, 14 మందికి అస్వస్థత 
TG High Court: మాగనూర్ కల్తీ ఆహార ఘటనపై హైకోర్టు ఆగ్రహం - ప్రభుత్వానికి సీరియస్‌నెస్‌ లేదని ఆక్షేపణ 
మాగనూర్ కల్తీ ఆహార ఘటనపై హైకోర్టు ఆగ్రహం - ప్రభుత్వానికి సీరియస్‌నెస్‌ లేదని ఆక్షేపణ 
Revanth Reddy: తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dilawarpur Latest News: ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
Dilawarpur Latest News: ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
Vizag News: విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి, 14 మందికి అస్వస్థత 
Vizag News: విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి, 14 మందికి అస్వస్థత 
TG High Court: మాగనూర్ కల్తీ ఆహార ఘటనపై హైకోర్టు ఆగ్రహం - ప్రభుత్వానికి సీరియస్‌నెస్‌ లేదని ఆక్షేపణ 
మాగనూర్ కల్తీ ఆహార ఘటనపై హైకోర్టు ఆగ్రహం - ప్రభుత్వానికి సీరియస్‌నెస్‌ లేదని ఆక్షేపణ 
Revanth Reddy: తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
Andhra Adani Issue: జగన్‌తో పాటు షర్మిలదీ అదే సవాల్ - చంద్రబాబు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు ?
జగన్‌తో పాటు షర్మిలదీ అదే సవాల్ - చంద్రబాబు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు ?
Pawan Kalyan Met With Modi:  ప్రధానమంత్రి మోదీతో పవన్ కల్యాణ్ సమావేశం- చర్చించిన అంశాలు ఇవే
ప్రధానమంత్రి మోదీతో పవన్ కల్యాణ్ సమావేశం- చర్చించిన అంశాలు ఇవే
Brahmamudi Maanas Nagulapalli: కొడుక్కి రామ్ చరణ్ మూవీ పేరు పెట్టిన 'బ్రహ్మముడి' మానస్.. ఫొటోస్ చూశారా!
కొడుక్కి రామ్ చరణ్ మూవీ పేరు పెట్టిన 'బ్రహ్మముడి' మానస్.. ఫొటోస్ చూశారా!
Narayanpet News Today: నారాయణపేట జిల్లా మాగనూర్‌లో 144 సెక్షన్- ప్రతిపక్ష నేతలు, విద్యార్థి సంఘాల ముందస్తు అరెస్టు
నారాయణపేట జిల్లా మాగనూర్‌లో 144 సెక్షన్- ప్రతిపక్ష నేతలు, విద్యార్థి సంఘాల ముందస్తు అరెస్టు
Embed widget