News
News
వీడియోలు ఆటలు
X

Telangana News : హైదరాబాద్ నడిబొడ్డున అంబేడ్కర్ భారీ విగ్రహం - ప్రత్యేకతలు ఇవే

అంబేద్కర్ విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శుక్రవారం కేసీఆర్ ఆవిష్కరించనున్నారు.

FOLLOW US: 
Share:

Telangana News :  తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ 125 అడుగుల విగ్రహావిష్కరణ ఏర్పాట్లు పూర్తయ్యాయి.  దేశంలోనే అతిపెద్ద విగ్రహాన్ని హుస్సేన్‌సాగర్‌ తీరంలో తెలంగాణ సర్కార్‌ నిర్మించింది. శుక్రవారం  ముఖ్యమంత్రి కేసీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. విగ్రహావిష్కరణ అనంతరం భారీ బహిరంగ సభ నిర్వహించనుంది తెలంగాణ ప్రభుత్వం. దీంతో ఈ ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. అంబేద్కర్‌ విగ్రహం దిగువన ప్రాంగణంలో తుదిదశ పనులు కొనసాగుతున్నాయి. తుది పనులు పూర్తి చేసి ఆ తర్వాత అలంకరణ పనులు చేపట్టనున్నారు. పక్కనే బహిరంగ సభకు కూడా ఏర్పాట్లు చేశారు. 

అంబేద్కర్‌ జయంతి సందర్భంగా రాజధాని నగరంలో విగ్రహావిష్కరణతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అధికారిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. బహిరంగ సభ నిర్వహిస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. 14న మధ్యాహ్నం మూడు గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరు కావాలంటూ హైదరాబాద్‌లో విధులు నిర్వర్తిస్తున్న అఖిల భారత సర్వీస్‌ అధికారులందరినీ తెలంగాణ సర్కార్‌ ఆదేశించింది.  దేశంలోనే ఎత్తయిన అంబేద్కర్‌ విగ్రహం నిర్మాణం పూర్తయ్యింది. భారతావనికే తలమానికంగా నిలిచే ఈ నిర్మాణానికి ప్రత్యేకత సంతరించుకుంది. 

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహం 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్‌ టాంక్‌బండ్‌ సమీపంలో 125 అడుగుల ఎత్తయిన విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నట్లు- సీఎం 2016లో ప్రకటించారు. దానికి అనుగుణంగా 2016 ఏప్రిల్‌ 14న ఎన్టీఆర్‌ పార్కు పక్కన 11.4 ఎకరాల విస్తీర్ణంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి భూమి పూజ కూడా చేశారు.   2017లో అప్పటి డిప్యూటీ- సీఎం కడియం శ్రీహరి నేతృత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేల బృందం చైనాలో పర్యటించింది.  పార్లమెంటు ఆకృతిలో నిర్మిస్తున్న బేస్‌మెంట్‌కు ఆగ్రా, నోయిడా, జైపూర్‌ తదితర ప్రాంతాల నుంచి తెప్పించిన ఎరుపు, గోధుమ రంగుల రాళ్లను ఉపయోగించారు.                                                          

విగ్రహంలోని బూట్లు  కాళ్లు, చేతులు, భారత రాజ్యాంగం పుస్తకం, భుజాలు, ముందుకు చూపుతున్నట్లు  ఉండే కుడిచేయి, తల తదితరాలన్నిం టినీ విడివిడి భాగాలుగా నోయిడాలో కంచుతో తయారుచేసి లారీల ద్వారా తరలించారు. విగ్రహం పటిష్టంగా ఉండేందుకు లోపలివైపు స్టీల్‌ స్ట్రక్చర్‌ను ఉపయోగించారు.  విడివిడి భాగాల మొత్తం అమరిక పూర్తయిన తర్వాత పాలీ యూరేథీన్‌ కెమికల్స్‌తో  పాలిషింగ్‌ చేశారు.  టాంక్‌బండ్‌ నీటి కాలుష్యంతో పాటు గాలిలోని రసాయనాల, వాతావరణ మార్పులతో విగ్రహం షైనింగ్‌ తగ్గకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. అతి భారీ తుపానులను కూడా తట్టుకునేలా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.                                                          

Published at : 13 Apr 2023 05:09 PM (IST) Tags: Ambedkar Statue Telangana News Ambedkar statue unveiling

సంబంధిత కథనాలు

మార్గదర్శి కేసులో ప్రభుత్వం దూకుడు- ఆస్తులు అటాచ్‌ చేసేందుకు సీఐడీకీ అనుమతి

మార్గదర్శి కేసులో ప్రభుత్వం దూకుడు- ఆస్తులు అటాచ్‌ చేసేందుకు సీఐడీకీ అనుమతి

Raghunandan Rao: బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావుకు లీగల్ నోటీసులు, రూ.1000 కోట్ల పరువునష్టం దావా

Raghunandan Rao: బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావుకు లీగల్ నోటీసులు, రూ.1000 కోట్ల పరువునష్టం దావా

Telangana CM KCR: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలపై అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు

Telangana CM KCR: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలపై అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు

గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

TSPSC Paper Leak: పేపర్ లీక్ కేసులో సంచలనం, ఎగ్జామ్ లో బ్లూటూత్ వాడిన ముగ్గురు అభ్యర్థుల అరెస్ట్

TSPSC Paper Leak: పేపర్ లీక్ కేసులో సంచలనం, ఎగ్జామ్ లో బ్లూటూత్ వాడిన ముగ్గురు అభ్యర్థుల అరెస్ట్

టాప్ స్టోరీస్

Andhra Politics : వైఎస్ఆర్‌సీపీని విమర్శించి అంతకు మించి ఉచిత హామీలు - చంద్రబాబు నిధులెక్కడి నుంచి తెస్తారు ?

Andhra Politics :  వైఎస్ఆర్‌సీపీని విమర్శించి అంతకు మించి ఉచిత హామీలు - చంద్రబాబు నిధులెక్కడి నుంచి తెస్తారు ?

CSK Vs GT: ధోనికి కప్పు గిఫ్టిచ్చిన జడేజా - లాస్ట్ బాల్ థ్రిల్లర్‌లో జీటీపై చెన్నై విక్టరీ!

CSK Vs GT: ధోనికి కప్పు గిఫ్టిచ్చిన జడేజా - లాస్ట్ బాల్ థ్రిల్లర్‌లో జీటీపై చెన్నై విక్టరీ!

MS Dhoni: ఆ విషయంలో తను, నేను సేమ్ టు సేమ్ - రాయుడు గురించి ధోని ఏమన్నాడంటే?

MS Dhoni: ఆ విషయంలో తను, నేను సేమ్ టు సేమ్ - రాయుడు గురించి ధోని ఏమన్నాడంటే?

4 Years Of YSRCP: వైఎస్ జగన్ పాలనకు నాలుగేళ్లు పూర్తి- భారీగా బైక్ ర్యాలీలు, కార్యక్రమాలకు నేతలు శ్రీకారం

4 Years Of YSRCP: వైఎస్ జగన్ పాలనకు నాలుగేళ్లు పూర్తి- భారీగా బైక్ ర్యాలీలు, కార్యక్రమాలకు నేతలు శ్రీకారం