By: ABP Desam | Updated at : 14 Jan 2022 08:19 PM (IST)
ప్రతీకాత్మక చిత్రం
తెలంగాణలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతు ఉన్నాయి. 24 గంటలలో 68,525 మందికి కరోనా పరీక్షలు చేయగా.. 2,398 మందికి పాజిటివ్ గా తేలింది. మెుత్తం కేసుల సంఖ్య.. 7,05,199కు చేరాయి. వైరస్ కారణంగా కొత్తగా.. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మెుత్తం ఇప్పటి వరకు రాష్ట్రంలో 4,052 మంది మృతి చెందారు. 24 గంటల వ్యవధిలో కొత్తగా వైరస్ నుంచి 1,181 మంది బయటపడ్డారు. ప్రస్తుతం 21,676 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
దేశంలో కరోనా కేసులు
భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి, ఒమిక్రాన్ మరింతగా పెరుగుతోంది. వారం రోజుల కిందటి వరకు 50 వేలకు దిగువన వచ్చే కేసులు నేడు 2 లక్షలకు పైగా నమోదవుతున్నాయి. గత నాలుగైదు రోజులుగా పాజిటివ్ కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 2,64,202 మంది కరోనా బారిన పడ్డారు. అదే సమయంలో 315 మందిని కరోనా మహమ్మారి బలిగొంది. దేశంలో మొత్తం కరోనా మరణాలు 4,85,350కు చేరుకున్నాయి.
క్రితం రోజుతో పోల్చితే దేశంలో కరోనా పాజిటివ్ కేసులు 6.7 శాతం అధికంగా నమోదయ్యాయి. అదే సమయంలో నిన్న ఒక్కరోజులో 1,09,345 మంది కరోనా బారి నుంచి కోలుకున్నాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 12,72,073 (12.72 లక్షలు)కు చేరుకుంది. రోజువారీ పాజిటివిటీ రేటు 14.78 శాతానికి పెరగడం థర్డ్ వేవ్ ముప్పును సూచిస్తోంది. దేశంలో ఒమిక్రాన్ కేసులు 5,753 నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది.
కరోనా మరణాలు: 4,85,350
రోజువారీ పాజిటివిటీ రేటు: 14.78%
దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు: 12,72,073
155 కోట్ల డోసుల టీకాలు..
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ వేగంగా జరుగుతోంది. దీంతో భారత్‌లో కొవిడ్ డోసుల పంపిణీ 155.39 కోట్ల మైలురాయికి చేరుకుందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతా వద్ద మరో 15.17 కోట్ల డోసుల వరకు నిల్వ ఉన్నాయి. అనుమతి లభించడంతో 15 నుంచి 18 ఏళ్ల టీనేజర్లకు కొవిడ్ టీకాలు వేస్తున్నారు. దేశంలో కరోనా రికవరీ రేటు 95.20 శాతానికి పడిపోయింది. మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్, కేరళ, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నైట్ కర్ఫ్యూల వైపు మొగ్గు చూపుతున్నాయి. సాధ్యమైతే వీకెండ్ లాక్ డౌన్ లాంటి కోవిడ్ ఆంక్షలతో కరోనా వ్యాప్తిని నియంత్రించాలని పలు రాష్ట్ర ప్రభుత్వాలు యోచిస్తున్నాయి.
KCR Political strategy : గవర్నర్తో రాజీ - బడ్జెట్ పై సైలెన్స్ ! బీజేపీపై కేసీఆర్ దూకుడు తగ్గిందా ?
TSPSC: 'గ్రూప్-4' రాతపరీక్ష తేదీని వెల్లడించిన టీఎస్పీఎస్సీ! ఎగ్జామ్ ఎప్పుడంటే?
TSWRES Inter Admissions: తెలంగాణ గురుకుల సైనిక పాఠశాలలో ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్! పరీక్ష ఎప్పుడంటే?
TSSPDCL Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్- 1601 'కరెంటు' కొలువుల భర్తీకి నోటిఫికేషన్లు
Republic Day Celebrations 2023: రిపబ్లిక్ డే పరేడ్ లో సత్తా చాటిన ఏపీ, తెలంగాణ ఎన్సీసీ క్యాడెట్స్ - ప్రధాని మోదీ చేతుల మీదుగా బెస్ట్ క్యాడెట్ ట్రోఫీ
K Viswanath : హిందీలోనూ విశ్వనాథ్ హిట్టే, ఆయన 'స్వయంకృషి' - ఓ తీరని కోరిక
Pawan Kalyan Marriages: మూడు పెళ్లిళ్ల వివాదంపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ - చివర్లో బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్!
K.Viswanath: చిరంజీవితో విశ్వనాథ్కు ప్రత్యేక అనుబంధం - కళా తపస్విని కన్నతండ్రిలా భావించే మెగాస్టార్!
Anil Kumar On Kotamreddy : దమ్ముంటే రాజీనామా చెయ్, కోటంరెడ్డికి అనిల్ కుమార్ సవాల్