Youtube: యూట్యూబ్‌లో వాచ్ హిస్టరీని డిలీట్ చేయడం ఎలా - ఈ టిప్స్ పాటిస్తే మూడు క్లిక్స్ చాలు!
యూట్యూబ్ సెర్చ్, వాచ్ హిస్టరీని డిలీట్ చేయడం ఎలా?
యూట్యూబ్‌లో మనం అనేక రకాల వీడియోలు చూస్తూ ఉంటాం. అయితే యూట్యూబ్ హిస్టరీ ప్రైవసీ గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీరు వేరొకరికి మీ గూగుల్ యాక్సెస్‌ను షేర్ చేసినట్లయితే, మీ యూట్యూబ్ హిస్టరీ, సెర్చ్ హిస్టరీ కూడా వారికి తెలుస్తుంది. కానీ కొన్ని ట్రిక్స్ ఫాలో అయితే దాన్ని రిమూవ్ చేయవచ్చు లేదా అస్సలు స్టోర్ అవ్వకుండా చేయవచ్చు.
యూట్యూబ్ హిస్టరీని ఇలా డిలీట్ చేయండి
1. మీ స్మార్ట్‌ఫోన్ లేదా ఇతర డివైస్‌లో YouTube యాప్‌ను తెరవండి
2. ఓపెన్ చేశాక డివైస్ స్క్రీన్ పై భాగంలో ఎడమ మూలలో ఉన్న ప్రొఫైల్ సింబల్‌పై క్లిక్ చేయండి.
3. యూట్యూబ్ ఆప్షన్‌లో మీ డేటాకు వెళ్లండి,
4. కిందకి స్క్రోల్ చేసి 'Manage your YouTube Watch History'పై క్లిక్ చేయండి.
5. ఇక్కడ మీకు 'Delete' ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ఓపెన్ చేయండి.
7. దీనిపై క్లిక్ చేస్తే మీకు 'Delete', 'Delete Custom Range' and 'Delete All Time' ఆప్షన్లు కనిపిస్తాయి.
8. మీరు ఇప్పుడు వాటిలో మీకు కావాల్సిన దాన్ని ఎంచుకుని యూట్యూబ్ హిస్టరీ డిలీట్ చేసుకోవచ్చు.
వెబ్‌సైట్ నుంచి ఎలా తొలగించాలి
1. ముందుగా కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్‌లో యూట్యూబ్ తెరవండి
2. ఇప్పుడు హోమ్‌పేజీ మీ ముందు కనిపిస్తుంది. దాని ఎడమ మూలలో మూడు లైన్ల ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
3. అక్కడ మీకు హిస్టరీ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై నొక్కండి.
4. అప్పుడు 'Clear all watch history' ఎంపికపై క్లిక్ చేయండి.
5. అప్పుడు మీ వ్యూయింగ్ హిస్టరీ యూట్యూబ్ నుంచి మాయం అవుతుంది.
యూట్యూబ్ హిస్టరీ ఆటోమేటిక్‌గా డిలీట్ అవ్వాలంటే ఎలా?
1. ఇందుకోసం మొబైల్‌లో యూట్యూబ్‌ని ఓపెన్ చేయాలి
2. కుడి వైపు కార్నర్‌లో ఉన్న ప్రొఫైల్ చిహ్నంపై క్లిక్ చేయండి.
3. తర్వాత యూట్యూబ్‌లో మీ డేటా ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
4. ఆపై క్రిందికి స్క్రోల్ చేసి ‘Manage Your YouTube Watch History’ని ఎంచుకోండి.
5. ఇక్కడ ఆటో-డిలీట్ ఆప్షన్ కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి.
6. టైమ్ డ్యురేషన్‌ను ఎంపిక చేసి ‘Next’ బటన్‌ను నొక్కండి.
7. ఇలా చేయడం ద్వారా ఆటో డిలీట్ ఫీచర్ యాక్టివేట్ అవుతుంది.
8. హిస్టరీ నిర్దేశిత సమయంలో ఆటోమేటిక్‌గా డిలీట్ అవుతుంది.
యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్లకు చక్కటి వార్తను చెప్పింది. యూట్యూబ్ పార్టనర్ ప్రోగ్రామ్‌కు సంబంధించినలను గననీయంగా సరళీకరించింది. ఇప్పటి వరకు మానిటైజేషన్‌కు కావాల్సిన సబ్ స్క్రైబర్ల సంఖ్యను సగానికి తగ్గించింది. చిన్న కంటెట్ క్రియేటర్లు సైతం మానిటైజేషన్ ను పొందేందుకు అనుకూలంగా నిబంధనలను సరళీకరించింది. ఈ నిర్ణయంతో తక్కువ సబ్ స్క్రైబర్ల ఉన్న క్రియేటర్లు సైతం యూట్యూబ్ ద్వారా ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది.
గత రెండు, మూడు సంవత్సరాలుగా చాలా మంది ఔత్సాహిక యువతీ యువకులు లక్షల సంఖ్యలో సొంతంగా యూట్యూబ్ చానెల్స్ పెట్టుకుంటున్నారు. అద్భుతమైన కంటెంట్ తో అందరినీ ఆకట్టుకుంటున్నారు. చక్కటి వీడియోలతో మంచి వ్యూస్ సాధిస్తున్నారు. అయితే, కొంత మంది మాత్రమే యూట్యూబ్ మానటైజేషన్ పొందుతున్నారు. వారు మాత్రమే ఆదాయాన్ని అర్జిస్తున్నారు. కానీ, చాలా మంది మానిటైజేషన్ రాక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటి వరకు మానిటైజేషన్ సాధించాలంటే తక్కువలో తక్కువగా 1000 మంది సబ్ స్క్రైబర్లు ఉండాలి. అంతేకాదు, ఏడాది కాలంలో కనీసం 4 వేల గంటల వ్యూస్ ఉండాలి. అదీ కాదంటే, చివరి మూడు నెలల్లో కనీసం 10 మిలియన్ షార్ట్స్ వీడియో వ్యూస్ ను కలిగి ఉండాలి. ఈ నిబంధనలతో చాలా మంది చిన్న కంటెంట్ క్రియేటర్లు మానటైజేషన్ రాక ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే యూట్యూబ్ మానటైజేషన్ నిబంధనలు సరళతరం చేసింది.
యూట్యూబ్ తాజాగా తీసుకొచ్చిన నూతన మానిటైజేషన్ నిబంధనల ప్రకారం, ఇకపై 500 మంది సబ్ స్క్రైబర్లు ఉంటే మానిటైజేషన్ కు అర్హత పొందే అవకాశం ఉంటుంది. చివరి మూడు నెలల వ్యవధిలో తక్కువలో తక్కువగా మూడు వీడియోలను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. దీనితో పాటు ఏడాది కాలంలో 3 వేల గంటల వ్యూస్ లేదంటే, చివరి మూడు నెలల్లో 3 మిలియన్ల షార్ట్ వీడియోస్ వ్యూస్ పొంది ఉండాలి. ఈ నిబంధనలతో చిన్న కంటెట్ క్రియేటర్లు కూడా మానిటైజేషన్ పొందే అవకాశం ఉంటుంది.
Read Also: షావోమీ నుంచి కొత్త టాబ్లెట్ విడుదల, బడ్జెట్ ధరలో హైఎండ్ ఫీచర్స్