Xiaomi 14 Ultra Sale: షావోమీ 14 అల్ట్రా సేల్ ప్రారంభం - ధర తెలిస్తే షాక్ అవ్వడం గ్యారంటీ!
Xiaomi 14 Ultra: షావోమీ 14 అల్ట్రా స్మార్ట్ ఫోన్ సేల్ మనదేశంలో ప్రారంభం అయింది. ఫ్లిప్‌కార్ట్, కంపెనీ అధికారిక వెబ్ సైట్లలో ఈ స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.
Xiaomi 14 Ultra Flipkart Sale: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షావోమీ ఇటీవలే మనదేశంలో తన ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ను లాంచ్ చేసింది. అదే షావోమీ 14 అల్ట్రా. లాంచ్ అయిన నెలకు ఈ స్మార్ట్ ఫోన్ సేల్ మనదేశంలో ప్రారంభం అయింది. షావోమీ 14 అల్ట్రాలో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌ను అందించారు. కంపెనీ ఇటీవలే అందుబాటులోకి తీసుకువచ్చిన హైపర్ఓఎస్‌పై ఈ స్మార్ట్ ఫోన్ రన్ కానుంది.
షావోమీ 14 అల్ట్రా ధర, ఆఫర్లు (Xiaomi 14 Ultra Price)
ఈ స్మార్ట్ ఫోన్ ధరను రూ.99,999గా నిర్ణయించారు. ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. ఈ వేరియంట్లో 16 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ఉన్నాయి. బ్లాక్, వైట్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ కొనుగోలుపై షావోమీ మూడు నెలల పాటు యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా అందించనుంది. ఐసీఐసీఐ బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.5,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభించనుంది. దీంతోపాటు రూ.5,000 వరకు ఎక్స్‌ఛేంజ్ బోనస్ కూడా కంపెనీ అందించనుంది.
The #Xiaomi14Ultra SALE is live!
— Xiaomi India (@XiaomiIndia) April 11, 2024
Get your hands on the camera powerhouse for an unmatched photography experience.
Buy now: https://t.co/ZSAMHWYOLS#SeeItInNewLight pic.twitter.com/evaPc7Q4rt
Read Also: మామా నీ ‘టైమ్’ ఎంత? చంద్రుడికి టైమ్ జోన్ సెట్ చేస్తున్న నాసా, వైట్ హౌస్ కీలక ఆదేశాలు
షావోమీ 14 అల్ట్రా స్పెసిఫికేషన్లు (Xiaomi 14 Ultra Features)
ఆండ్రాయిడ్ 14 ఆధారిత హైపర్ఓఎస్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. షావోమీ 14 అల్ట్రాలో 6.73 అంగుళాల ఎల్టీపీవో అమోఎల్ఈడీ మైక్రో కర్వ్‌డ్ డిస్‌ప్లే అందుబాటులో ఉంది. ఈ ఫోన్ స్క్రీన్ రిజల్యూషన్ 3,200 x 1,440 పిక్సెల్స్ కాగా, డిస్‌ప్లే రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది.
16 జీబీ ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 1 టీబీ యూఎఫ్ఎస్ 4.0 ఇన్‌బిల్ట్ స్టోరేజ్ ఈ ఫోన్‌లో ఉంది. ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌పై షావోమీ 14 అల్ట్రా రన్ కానుంది. షావోమీ 14 అల్ట్రాలో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఈ ఫోన్ 90W వైర్డ్, 80W వైర్‌లెస్, 10W వైర్‌లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే... షావోమీ 14 అల్ట్రా వెనకవైపు నాలుగు కెమెరాలు ఉన్నాయి. ఈ సెటప్‌లో ప్రధాన కెమెరాగా 50 మెగాపిక్సెల్ సోనీ ఎల్‌వైటీ900 సెన్సార్‌ను షావోమీ అందించింది. దీంతోపాటు 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, మరో రెండు 50 మెగాపిక్సెల్ సెన్సార్లు కూడా ఉన్నాయి. అంటే మొత్తంగా నాలుగు 50 మెగాపిక్సెల్ కెమెరాలను షావోమీ 14 అల్ట్రాలో వెనకవైపు అందించారన్న మాట. ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉండటం విశేషం.
ఐపీ68 డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్ ఫీచర్లు కూడా షావోమీ 14 అల్ట్రాలో అందించారు. ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, గ్లోనాస్, గెలీలియో, బైదు, నావిక్, 5జీ, వైఫై, బ్లూటూత్ 5.4, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఈ ఫోన్‌లో అందుబాటులో ఉన్నాయి.
Read Also: 'వ్లాగర్' పేరుతో గూగుల్ సృష్టిస్తున్న AI సంచలనం, ఒక్క ఫోటోతో సినిమా తీసేస్తోంది