28 Days Validity: అమ్మో.. 28 రోజుల వ్యాలిడిటీ వెనుక ఇంత కథా.. రూ.వేల కోట్ల ఆదాయం!
మనం రీచార్జ్ చేసుకునే ప్రీపెయిడ్ ప్లాన్ల వ్యాలిడిటీ 28 రోజులే ఎందుకు ఉంటదో తెలుసా?
సాధారణంగా నెల అంటే ఎంత? 30 రోజులు. కానీ ప్రీపెయిడ్ రీచార్జ్‌లు చేసుకుంటే కేవలం 28 రోజుల వ్యాలిడిటీ మాత్రమే ఎందుకు లభిస్తుంది? దీని వెనక ఉన్న లాజిక్ ఏంటి? ఎప్పుడైనా ఆలోచించారా? చూడటానికి రెండు రోజుల తేడానే ఉన్నా.. దీని వెనక రూ.వేల కోట్ల దందా ఉంది.
సాధారణంగా సంవత్సరానికి 12 నెలలు(365 రోజులు) ఉంటాయి. కానీ ప్రీపెయిడ్ నెల మాత్రం 28 రోజులు మాత్రమే. దీన్ని 12 నెలలకు మారిస్తే 336 రోజులు అవుతాయి. అంటే 365 రోజుల కంటే 29 రోజులు తక్కువ అన్నమాట. ఈ 29 రోజులకు మరోసారి రీచార్జ్ చేసుకోవాలి. అంటే 12 నెలల సంవత్సరానికి 13 నెలల(ప్రీపెయిడ్ నెల ప్రకారం) రీచార్జ్ అవసరం అవుతుంది.
ఈ 13వ నెల మీద జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా వంటి ఆపరేటర్లు ఎంత ఆదాయం ఆర్జిస్తున్నాయో తెలిస్తే షాక్ తప్పదు. అందరికంటే అత్యధికంగా జియో రూ.6,168 కోట్లను, ఎయిర్ టెల్ రూ.5,415 కోట్లను, వొడాఫోన్ ఐడియా రూ.2,934 కోట్లను ఈ 13వ రీచార్జ్ ద్వారా సంపాదిస్తున్నాయి.
మూడు నెలల ప్లాన్‌కు కూడా ఇదే వర్తిస్తుంది. 90 రోజులకు బదులు 84 రోజుల వ్యాలిడిటీనే అన్ని నెట్‌వర్క్‌లు అందిస్తున్నాయి. నాలుగు సార్లు రీచార్జ్ చేసుకుంటే 336 రోజుల పాటు మాత్రమే సర్వీస్ వ్యాలిడిటీ లభించనుంది. మిగిలిన 29 రోజులకు ప్రత్యేకంగా రీచార్జ్ చేసుకోవాలి.
ఇప్పుడు తాజాగా జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలు తమ టారిఫ్‌లను పెంచడంతో వినియోగదారులపై భారాన్ని పెంచింది. 20 నుంచి 25 శాతం వరకు టారిఫ్‌లను పెంచాయి. అంటే సంవత్సరానికి రూ.500 వరకు అదనపు భారం పడనుంది. పెరిగిన కొత్త ధరలు కూడా ఇప్పటికే అమల్లోకి వచ్చాయి.
Also Read: Tecno Camon 18: ముందు, వెనక 48 మెగాపిక్సెల్ కెమెరాలు.. ధర రూ.15 వేలలోపే.. వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ ఫ్రీ!
Also Read: Honor 60: 108 మెగాపిక్సెల్ కెమెరాతో హానర్ కొత్త ఫోన్.. వ్లాగర్ల కోసం ప్రత్యేక ఫీచర్ కూడా!
Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!
Also Read: Moto G51 5G: అత్యంత చవకైన మోటో 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. మరో వారంలో లాంచ్.. ధర ఎంతంటే?
Also Read: Redmi New Phone: రెడ్‌మీ కొత్త ఫోన్ వచ్చేసింది.. 8 జీబీ ర్యామ్.. ధర ఎంతంటే?