WhatsApp: గుడ్ న్యూస్, ‘వాట్సాప్’లో ఇక మీరు ఆన్‌లైన్‌లో ఉన్నా లేనట్టు సెట్ చేసుకోవచ్చు, ఇదిగో ఇలా!
మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. మీరు ఆన్ లైన్ లో ఉన్నా.. లేనట్టు సెట్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా వెర్షన్ లో మాత్రమే అందుబాటులో ఉంది.
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు వినియోగదారుల కోసం సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తున్నది. అందులో భాగంగానే Meta CEO మార్క్ జుకర్ బర్గ్ గత నెలలో WhatsApp కోసం మూడు కొత్త ఫీచర్ లను ప్రకటించారు. అందులో ముఖ్యమైనది ఆన్ లైన్ స్టేటస్ కావాల్సిన వారికే కనిపించేలా సెట్ చేసుకోవడం. చాలా కాలంగా ఈ ఫీచర్ కోసం వినియోగదారులు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫీచర్ వినియోగదారుల కోసం బీటా వెర్షన్‌లో అందుబాటులోకి వచ్చింది.
తాజాగా ఈ ఫీచర్ కు సంబంధించిన పలు వివరాలను వాట్సాప్ తన బ్లాగ్ లో వెల్లడించింది. స్పేహితులు, కుటుంబ సభ్యులు వాట్సాప్ ఆన్ లైన్ లో ఉన్నప్పుడు చూడటం మూలంగా ఒకరినొకరు పలకరించుకునే అవకాశం ఉంటుంది. క్షేమ సమాచారంతో పాటు పలు విషయాలను చర్చించుకోవచ్చు. కానీ, ఒక్కోసారి ఆన్ లైన్ స్టేటస్ కనిపించడం మూలంగా అనవసర మెసేజ్ లు వచ్చే అవకాశం ఉంటుంది. వాటికి రిప్లై ఇవ్వకపోతే ఎదుటి వ్యక్తులు ఫీల్ అయ్యే సందర్భాలు సైతం ఉంటాయి. అయితే, ఆన్ లైన్ లో ఉన్నా, లేనట్లు కనిపించేలా తాజా ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వాట్సాప్ తెలిపింది. మీరు ఆన్ లైన్ లో ఉన్న విషయాన్ని ప్రైవేటుగా ఉంచాలనుకునే వారికి కోసం ఎవరు చూడాలి? ఎవరు చూడకూడదు? అనే ఆప్షన్లను రూపొందించినట్లు తెలిపింది. ప్రస్తుతం బీటా వెర్షన్ లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్ ఈ నెలలో వినియోగదారులకు అందుబాటులో ఉండనున్నట్లు తెలిపింది.
WhatsApp సంబంధిత అప్‌డేట్‌లను ట్రాక్ చేసే వెబ్‌సైట్ WaBetaIfo కూడా దీనికి సంబంధించిన పలు విషయాలను వెల్లడించింది. ఆండ్రాయిడ్ 2.22.20.9 అప్ డేట్ కోసం తాజా WhatsApp బీటాను ఇన్ స్టాల్ చేసే బీటా టెస్టర్ లకు చాట్ యాప్ ఫీచర్ ను విడుదల చేస్తోంది. మీరు ఈ ఫీచర్ ని కలిగి ఉన్నారో? లేదో? అని చూసేందుకు సెట్టింగ్ లు > అకౌంట్> ప్రైవసీలోకి వెళ్లండి. అందులో ‘చివరిగా చూసినది’, ‘ఆన్‌లైన్’ అని రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. ఇలా ఉంటే ఇప్పటికే ఈ ఫీచర్ మీకు అందుబాటులో ఉందని గుర్తుంచుకోవాలి. దీన్ని ఎనేబుల్ చేయడానికి ‘సేమ్ యాస్ లాస్ట్ సీన్’ అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి.
యాప్ కు సంబంధించిన ప్రైవసీని కాపాడేందుకు WhatsApp ఇటీవల ఎక్స్ టరా ప్రొటెక్షన్ లేయర్స్ ను యాడ్ చేసింది. చాట్ గ్రూపులను సైలెంట్ గా వెళ్లిపోయే అవకాశాన్ని కల్పిస్తోంది. అంతేకాదు.. గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయ్యే విషయాన్ని మొత్తం గ్రూపుకు తెలియకుండా కేవలం అడ్మిన్స్ కు మాత్రమే తెలియజేయబడుతుంది. మరోవైపు యాప్‌లో షేర్ చేసిన ఫోటోతో పాటు వీడియోల దుర్వినియోగాన్ని నిరోధించే వ్యూ వన్స్ ఫీచర్‌ని WhatsApp ఇప్పటికే కలిగి ఉంది. ఇప్పుడు ఈ వ్యూ వన్స్ మెసేజ్‌ల కోసం స్క్రీన్ షాట్ బ్లాకింగ్ ను కూడా ప్రవేశపెట్టింది. ఇది ఆయా మెసేజ్ లకు అదనపు రక్షణ కలిగిస్తుంది.
Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వచ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?
Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?