WhatsApp New Feature: వాట్సాప్‌లో భారీ మార్పు చేయనున్న మెటా - గ్యాలరీ ఎంతలా మారిపోనుందంటే?
WhatsApp Best Features: వాట్సాప్ త్వరలో తన వినియోగదారుల కోసం మరో ఫీచర్‌ను తీసుకురానుందని వార్తలు వస్తున్నాయి. గ్యాలరీ ఇంటర్‌ఫేస్‌ను పూర్తిగా మార్చేసే ఫీచర్‌పై వాట్సాప్ వర్క్ చేస్తుందని తెలుస్తోంది.
WhatsApp Gallery Interface Feature: యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను మరింత మెరుగుపరచడానికి వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్‌లను పరిచయం చేస్తూనే ఉంది. ఇప్పుడు కంపెనీ ఫోటోలు, వీడియోలను పంపడానికి కొత్త గ్యాలరీ ఇంటర్‌ఫేస్‌ను కూడా విడుదల చేయనుంది. ఇది ఫోటోలు, వీడియోలను షేర్ చేయడాన్ని చాలా సులభం చేయనుంది. ఈ ఫీచర్ మీ సమయాన్ని కూడా ఆదా చేస్తుంది. ఈ ఇంటర్‌ఫేస్ స్నాప్‌చాట్‌లో కనిపించే గ్యాలరీ ఇంటర్‌ఫేస్ లాగా పనిచేస్తుంది.
కొత్త ఇంటర్‌ఫేస్ ఎలా పని చేస్తుందో తెలుసా?
కొత్త గ్యాలరీ ఇంటర్‌ఫేస్‌తో మీరు చాట్‌లో కెమెరా ఐకాన్‌పై క్లిక్ చేసినప్పుడు, ఫోటో గ్యాలరీ నేరుగా ఓపెన్ అవుతుంది. మీరు మీ అవసరానికి అనుగుణంగా ఏదైనా ఫోటో లేదా వీడియోని సెలక్ట్ చేసుకోవచ్చు. దానికి క్యాప్షన్ కూడా వ్రాయవచ్చు. దీంతో పాటు, ఇంటర్‌ఫేస్‌లో హై క్వాలిటీ ఫోటోలను పంపడానికి 'హెచ్‌డీ' ఫీచర్‌ను ఎంచుకునే ఆప్షన్ కూడా ఉంది. కంపెనీ ఇప్పుడు ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం దీన్ని పరిచయం చేస్తోంది.
Also Read: ఒక్క రూపాయి తేడాతో 28 జీబీ డేటా, 22 ఓటీటీ యాప్స్ - ఈ జియో, ఎయిర్‌టెల్ ప్లాన్లలో ఏది బెస్ట్?
మరో ఫీచర్ కూడా...
ఇది మాత్రమే కాకుండా ఆండ్రాయిడ్, ఐవోఎస్ తర్వాత వాట్సాప్ ఇప్పుడు వెబ్ వినియోగదారుల కోసం కూడా ఒక గొప్ప ఫీచర్‌ను రెడీ చేస్తుంది. కంపెనీ ఇప్పుడు వినియోగదారుల కోసం కస్టమ్ ఛాట్ ఫిల్టర్ ఫీచర్‌ను తీసుకువస్తోంది. ఈ ఫీచర్‌ను ఉపయోగించి వినియోగదారులు తమ ఛాట్‌లను సులభంగా ఫిల్టర్ చేయగలరు. దీని కోసం '3 డాట్ మెనూ'కి వెళ్లి, '+ New List'పై క్లిక్ చేయండి. లిస్ట్ పేరును రిజిస్టర్ చేసి దానికి కాంటాక్ట్స్‌ను యాడ్ చేయవచ్చు. ఇది ఎక్కువ ఛాట్‌లను కలిగి ఉన్న వినియోగదారులకు అవసరమైన ఛాట్‌లను కనుగొనడం సులభం చేస్తుంది.
'స్టేటస్ రిమైండర్' ఫీచర్ కూడా...
వాట్సాప్ తాజాగా 'స్టేటస్ రిమైండర్' ఫీచర్‌ను కూడా లాంచ్ చేసింది. అంటే మీరు చూడని స్టేటస్ అప్‌డేట్స్ కోసం ఇది రిమైండర్‌లను పంపుతుంది. చాలా కాంటాక్ట్‌లు ఉన్న వారికి ఈ ఫీచర్ ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది.
వాట్సాప్ తమ వినియోగదారుల కోసం మరో అద్భుతమైన ఫీచర్‌ను కూడా ఇటీవలే అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ సాయంతో తక్కువ కాంతిలో అంటే మసక వెలుతురు మాత్రమే ఉన్న పరిస్థితుల్లో కూడా యూజర్లు మెరుగైన క్వాలిటీతో వీడియో కాలింగ్‌ను ఆస్వాదించవచ్చు. తక్కువ వెలుతురు ఉన్న గదిలోనూ వీడియో కాల్స్‌ను సులభంగా చేసుకుని ఇష్టమైన వారితో కావాల్సినంత సేపు మాట్లాడుకోవచ్చు. యాప్ ఉపయోగించే వారు తక్కువ లైటింగ్ సమయంలోనూ మెరుగైన వీడియో కాల్స్ చేసేందుకు ఈ ఫీచర్‌ను రూపొందించారు. వీడియో కాలింగ్ సమయంలో కొత్త ఫిల్టర్లు, బ్యాక్ గ్రౌండ్ ఫీచర్లను కూడా ఉపయోగించుకోవచ్చు. వాట్సాప్ తన యూజర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకువస్తూనే ఉంటుంది. ఇప్పుడు కూడా మరెన్నో వినూత్నమైన ఫీచర్లపై వాట్సాప్ పని చేస్తుంది.
Also Read: రూ.10 వేలలోపు 128 జీబీ ఫోన్ - వివో వై18టీ వచ్చేసింది - ఫీచర్లు ఎలా ఉన్నాయి?