అన్వేషించండి

WhatsApp New Feature: వాట్సాప్‌ మెసేజ్‌‌ను తప్పుగా కొట్టారా? ఇకపై ఆందోళన అక్కర్లేదు, ఎందుకంటే..

వాట్సాప్ సరికొత్త ఫీచర్ ను వినియోగదారుల ముందుకు తీసుకురాబోతుంది. పొరపాటున ఏదైనా మెసేజ్ తప్పుగా పంపిస్తే.. దాన్ని వెంటనే ఎడిట్ చేసేలా ఓ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురాబోతుంది.

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ ప్లాట్‌ ఫామ్ వాట్సాప్. ఎప్పటికప్పుడు తన వినియోగదారుల ముందుకు సరికొత్త ఫీచర్లను తీసుకొస్తుంది. మెసేజింగ్ లో మరింత సులువైన విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే నిరంతరం ప్రయత్నిస్తోంది. ఇక సోషల్ మీడియాలో ఎడిట్ ఫీచర్ గురించి జోరుగా చర్చ నడుస్తున్న ఈ సమయంలో వాట్సాప్ కు సంబంధించిన కీలక విషయం వెల్లడైంది. వాట్సాప్ త్వరలో మెసేజ్ ఎడిట్ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఎడిట్ మెసేజ్ ఫీచర్ కు సంబంధించి బీటా వెర్షన్ లో టెస్ట్ రన్ నడుస్తోంది. త్వరలోనే ఈ పరీక్షలు పూర్తి చేసుకుని వినియోగదారుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

సాధారణంగా వాట్సాప్ లో ఏదైనా మెసేజ్ పంపితే.. దాన్ని ఎడిట్ చేసే అవకాశం లేదు. ఏదైనా మెసేజ్‌ను పొరపాటుగా పంపిస్తే కచ్చితంగా డిలీట్ చేయాల్సి ఉంటుంది. కానీ, వాట్సాప్ ఇకపై ఆ ఇబ్బంది నుంచి విముక్తి కలిగించబోతుంది. వాట్సాప్ మెసేజ్ ఎడిట్ ఫీచర్ అందుబాటులోకి వస్తే.. మెసేజ్ పంపిన తర్వాత కూడా దాన్ని ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈనేపథ్యంలో ఎప్పుడైనా హడావిడిగా పంపిన మెసేజ్ లలో చిన్న చిన్న పొరపాట్లు జరిగితే వాటిని ఆ తర్వాత సరిచేసుకునే వెసులుబాటు ఉంటుంది. వాట్సాప్ మెసేజ్ ఎడిట్ ఫీచర్ కు సంబంధించిన విషయాలను తాజాగా వెబ్ బీటా ఇన్ఫో వెల్లడించింది.

వాస్తవానికి వాట్సాప్ లో ఎడిట్ మెసేజ్ ఫీచర్ పై చాలా రోజులుగా పరిశోధన జరుగుతున్నట్లు తెలుస్తున్నది. గతంలో ఓసారి ఈ విషయం గురించి వాట్సాప్ ప్రస్తావించింది. ఆ తర్వాత ఎలాంటి అప్ డేట్ లేదు. వాట్సాప్ యూజర్స్ కూడా మెసేజ్ ఎడిట్ ఫీచర్ గురించి ఎదురుచూస్తున్నారు. తాజాగా వెబ్ బీటా ఇన్ఫో ఈ విషయానికి సంబంధించి కీలక విషయాన్ని వెల్లడించింది. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉన్నట్లు తెలిపింది. వాట్సాప్ వర్షెన్ 2.22.20.12లో ఈ ఫీచర్ ను టెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించింది.

ఈ ఫీచర్ త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఎప్పుడు అనే విషయాన్ని మాత్రం కచ్చితంగా ప్రస్తావించలేదు.  అటు వాట్సాప్ లో ఎడిట్ మెసేజ్ ఫీచర్ ఎలా పని చేస్తుంది? అనే విషయాన్ని కూడా వివరించలేదు. అయితే, తొలుత పంపిన వాట్సాప్ మెసేజ్ ను ఎడిట్ చేస్తే.. ఆ మెసేజ్ పక్కనే ఎడిటెడ్ అని చూపించే అవకాశం ఉందంటున్నారు టెక్ నిపుణులు. అంతేకాదు.. మెసేజ్ పంపిన కొద్ది సేపటి వరకే ఎడిట్ చేసుకునే వెసులుబాటు ఉంటుందని చెప్తున్నారు. వాట్సాప్ కు భారత్ లో దాదాపు 50 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు.

Also Read: ఈ ఫోన్లకు వాట్సాప్ ఇక పనిచేయదు - అధికారికంగా తెలిపిన మెటా - మీ మొబైల్స్ ఉన్నాయేమో చూసుకోండి!

టాప్ హెడ్ లైన్స్

ఇక Google Gemini ప్రీమియం ఫీచర్ అందరికీ ఉచితం.. మీ పనులు మరింత సులభంగా
ఇక Google Gemini ప్రీమియం ఫీచర్ అందరికీ ఉచితం.. మీ పనులు మరింత సులభంగా
Apple iPhone 17 Pro Offer: ఐఫోన్ 17 ప్రోపై భారీ ఆఫర్.. రూ. 69,990కే మీ సొంతం!
ఐఫోన్ 17 ప్రోపై భారీ ఆఫర్.. రూ. 69,990కే మీ సొంతం!
1980s Retro Photos Trend: 1980 రెట్రో ఫొటో ట్రెండ్‌‌తో నిలువునా ముంచేస్తారు జాగ్రత్త.. సైబర్ బ్యూరో వార్నింగ్
1980 రెట్రో ఫొటో ట్రెండ్‌‌తో నిలువునా ముంచేస్తారు జాగ్రత్త.. సైబర్ బ్యూరో వార్నింగ్
AI Danger: మూడేళ్లలో ఏఐ మానవులను అంతం చేస్తుందా? నిపుణులు ఏం చెబుతున్నారు?
మూడేళ్లలో ఏఐ మానవులను అంతం చేస్తుందా? నిపుణులు ఏం చెబుతున్నారు?

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vinayaka Chavithi At Chandrababu Home: ఏపీ సీఎం చంద్రబాబు నివాసంలో వినాయక చవితి వేడుకలు
ఏపీ సీఎం చంద్రబాబు నివాసంలో వినాయక చవితి వేడుకలు Photos చూశారా
Hyderabad Crime News: అల్వాల్‌లో ఇంటర్ విద్యార్థినిపై 8 మంది అత్యాచారం.. మత్తు ఇచ్చి దారుణాలు- POCSO కేసు నమోదు
అల్వాల్‌లో ఇంటర్ విద్యార్థినిపై 8 మంది అత్యాచారం.. మత్తు ఇచ్చి దారుణాలు- POCSO కేసు నమోదు
Andhra Pradesh Rains: ఏపీలో 12 జిల్లాల్లో విస్తారంగా వర్షాలు.. పిడుగులు పడతాయని, అప్రమత్తంగా ఉండాలని వార్నింగ్!
ఏపీలో 12 జిల్లాల్లో విస్తారంగా వర్షాలు.. పిడుగులు పడతాయని, అప్రమత్తంగా ఉండాలని వార్నింగ్!
Rashmika Mandanna : బేబీ బంప్‌తో రష్మిక లుక్... భర్త విజయ్‌కు హగ్ - రణబాలి సెట్‌లో క్యూట్ మూమెంట్
బేబీ బంప్‌తో రష్మిక లుక్... భర్త విజయ్‌కు హగ్ - రణబాలి సెట్‌లో క్యూట్ మూమెంట్
Konda Surekha: పదవి నుంచి తొలగించినందుకు బాధగా లేదు, మళ్లీ మంత్రిని అవుతాను: కొండా సురేఖ ధీమా
పదవి నుంచి తొలగించినందుకు బాధగా లేదు, మళ్లీ మంత్రిని అవుతాను: కొండా సురేఖ ధీమా
Kagaznagar Crime News: ఐదేళ్ల చిన్నారిపై మేనమామ అత్యాచారం, కాగజ్‌నగర్‌లో ఉద్రిక్తత- నిందితుడి అరెస్ట్
ఐదేళ్ల చిన్నారిపై మేనమామ అత్యాచారం, కాగజ్‌నగర్‌లో ఉద్రిక్తత- నిందితుడి అరెస్ట్
Buses To Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేష్, బాలాపూర్‌ గణేష్ దర్శనానికి RTC ప్రత్యేక బస్సులు
ఖైరతాబాద్ గణేష్, బాలాపూర్‌ గణేష్ దర్శనానికి RTC ప్రత్యేక బస్సులు
AP TET Results: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. స్కోర్ కార్డ్ ఇలా డౌన్ లోడ్ చేసుకోండి
ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. స్కోర్ కార్డ్ ఇలా డౌన్ లోడ్ చేసుకోండి
Embed widget