అన్వేషించండి

Whatsapp New Feature: వాట్సాప్ నుంచి అదిరిపోయే ఫీచర్, ఇకపై ఓకే ఫోన్ లో రెండు అకౌంట్స్!

వాట్సాప్ నుంచి మరో చక్కటి ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటి వరకు ఒకే ఫోన్ లో ఒకే వాట్సాప్ అకౌంట్ ఉండగా, ఇకపై రెండు అకౌంట్స్ మెయింటెయిన్ చేసుకోవచ్చు.

తమ వినియోగదారులకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకురావడంలో ముందుంటుంది వాట్సాప్. వినియోగదారుల ఛాటింగ్ అనుభవాన్ని మరింత సులభతరం చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉంటుంది. అందులో భాగంగానే కొత్త ఫీచర్లను పరిచయం చేస్తుంది. తాజాగా మరో అదిరిపోయే ఫీచర్ ను వినియోగదారుల ముందుకు తీసుకొచ్చింది. ఇప్పటి వరకు ఒకే ఫోన్ లో ఒకే వాట్సాప్ అకౌంట్ ఓపెన్ చేసుకునే వెసులు బాటు ఉండేది. కానీ, తాజాగా తీసుకొచ్చిన ఫీచర్ లో ఇకపై ఒకే ఫోన్ లో రెండు అకౌంట్స్ ను మెయింటెయిన్ చేసే అవకాశం ఉంటుంది.  కొత్తగా తీసుకొచ్చిన ఈ ఫీచర్ వల్ల రెండు ఫోన్ నెంబర్లతో రెండు వాట్సప్ అకౌంట్స్, ఒకే ఫోన్లో వినియోగించుకోవచ్చునని మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ వెల్లడించారు.

ఇకపై ఒకే ఫోన్ లో రెండు వాట్సాప్ అకౌంట్స్

ప్రస్తుతం అందుబాటులోకి వస్తున్న చాలా స్మార్ట్ ఫోన్లు రెండు సిమ్స్ తో వస్తున్నాయి. ప్రతి ఒక్కరు కూడా రెండు ఫోన్ నెంబర్లు వాడుకుంటున్నారు. అందులో ఒకటి అఫీషియల్ కాగా, మరొకటి పర్సనల్. ఈ నేపథ్యంలో ఆండ్రాయిడ్ యూజర్లకు వాట్సాప్ కొత్త ఫీచర్ ను పరిచయం చేసింది. ఒక్క ఫోన్ నెంబర్ తోనే ఇప్పటి వరకు వాట్సాప్ సేవలు వినియోగించుకునేందుకు అవకాశం ఉండేది. రెండో నెంబర్ మీద ఉన్న వాట్సాప్ వాడాలంటే మొదటి నెంబర్ వాట్సాప్ నుంచి లాగ్ అవుట్ కావాల్సి ఉండేది. కానీ, కొత్తగా వాట్సాప్ తెస్తున్న ఫీచర్ తో రెండు ఫోన్ నెంబర్లతో రెండు వాట్సప్ ఖాతాలను ఒకే ఫోనులో వాడుకోవచ్చు. త్వరలో ఈ ఫీచర్ వాట్సాప్ యూజర్లకు అందుబాటులోకి రానున్నట్లు మెటా సంస్థ ప్రకటించింది.  ఇక వాట్సాప్ కొత్తగా తీసుకొస్తున్న ఫీచర్ ను ఎలాంటి క్లోనింగ్ యాప్స్ వాడకుండానే రెండు అకౌంట్స్ ను మెయింటెయిన్ చేసుకోవచ్చు. కుటుంబ అవసరాలకు ఒక వాట్సాప్,  ఉద్యోగానికి సంబంధించి అవసరాలకు మరో వాట్సప్ వాడుకోవచ్చు. లేదంటే రెండింటినీ తమకు నచ్చినట్లుగా వినియోగించుకోవచ్చు.   

ఒకే ఫోన్లో రెండు  వాట్సాప్ ను ఎలా ఓపెన్ చేయాలంటే?

1. మీ ఫోన్ లో వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత కుడివైపు పైభాగంలో మూడు చుక్కలను క్లిక్ చేయాలి..

2. ఈ మూడు చుక్కలను క్లిక్ చేసిన తర్వాత సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి. 

3. ఆ తర్వాత అకౌంట్ అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి. 

4. అనంతరం యాడ్ అకౌంట్ పై క్లిక్ చేయాలి. 

5. రెండో వాట్సాప్ అకౌంట్ ఓపెన్ అవుతుంది.  

6. కుడివైపున పై భాగంలోని  మూడు చుక్కలను క్లిక్ చేసి కావాల్సినప్పుడల్లా రెండు ఖాతాలను స్విచ్ఛాన్, స్విచ్ఛాఫ్ చేసుకోవచ్చు.

Read Also: వేళ్లు కదిపితే ఫోన్ ఎత్తేయచ్చు - మైండ్ బ్లోయింగ్‌ టెక్నాలజీతో యాపిల్ వాచ్ సిరీస్ 9 - ధర ఎంత?

Read Also: డిస్నీప్లస్ హాట్‌స్టార్ కొత్త రికార్డు - కింగ్ క్రీజులో ఉన్నప్పుడు ఎంత మంది చూశారో తెలుసా?

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Xiaomi Diwali Sale 2026: దీపావళి బంపర్ ఆఫర్.. షామీ స్మార్ట్‌‌ఫోన్‌లపై 50% వరకు భారీ తగ్గింపు!
దీపావళి బంపర్ ఆఫర్.. షామీ స్మార్ట్‌‌ఫోన్‌లపై 50% వరకు భారీ తగ్గింపు!
Best Phones Under 30000: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పండగ సేల్స్.. రూ.30,000 లోపు టాప్ 5 స్మార్ట్‌ఫోన్‌లు
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పండగ సేల్స్.. రూ.30,000 లోపు టాప్ 5 స్మార్ట్‌ఫోన్‌లు
Type A vs Type C Cables: ఫాస్ట్ ఛార్జింగ్‌కు ఏ కేబుల్ బెస్ట్.. టైప్-ఎ, టైప్-సి మధ్య తేడాలు ఇవే!
ఫాస్ట్ ఛార్జింగ్‌కు ఏ కేబుల్ బెస్ట్.. టైప్-ఎ, టైప్-సి మధ్య తేడాలు ఇవే!
Android Phone Running Slow : మీ ఆండ్రాయిడ్ ఫోన్ స్లోగా ఉందా? ఈ 3 సెట్టింగ్స్‌ను 0.5xకి మార్చి చూడండి
మీ ఆండ్రాయిడ్ ఫోన్ స్లోగా ఉందా? ఈ 3 సెట్టింగ్స్‌ను 0.5xకి మార్చి చూడండి

వీడియోలు

India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: వివేకా హత్య కేసులో లబ్ధిదారులెవరో తేలింది.. సుపారీపై జగన్ సమాధానం చెప్పాలి: చంద్రబాబు
వివేకా హత్య కేసులో లబ్ధిదారులెవరో తేలింది.. సుపారీపై జగన్ సమాధానం చెప్పాలి: చంద్రబాబు
Medicine Nobel Prize: మెడిసిన్ విభాగంలో ముగ్గురికి నోబెల్ బహుమతి.. ఒక్కో విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే 
మెడిసిన్ విభాగంలో ముగ్గురికి నోబెల్ బహుమతి.. ఒక్కో విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే 
Supreme Court Notices To Gyanesh Kumar: సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
Kiran Abbavaram Reality : కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' - డైరెక్టర్‌గా ఫస్ట్ మూవీ... బాలయ్య, నాగ్ మూవీస్‌తో పాటే...
కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' - డైరెక్టర్‌గా ఫస్ట్ మూవీ... బాలయ్య, నాగ్ మూవీస్‌తో పాటే...
Telangana Finances: బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
Toyota Cheapest Car: టయోటా అతి తక్కువ ధర కారు ఇదే! రూ.6.73 లక్షలే.. ఫీచర్లు మాత్రం అదుర్స్!
6 ఎయిర్‌బ్యాగ్స్, 360 డిగ్రీ కెమెరా ఉన్నా కూడా ధర తక్కువే!.. టయోటా చీపెస్ట్ కార్ ఇదే!
Sivakarthikeyan : నేను పీపుల్ మేడ్ స్టార్... ఫ్యాన్ మీట్‌లో శివకార్తికేయన్ - పాలిటిక్స్‌లోకి తమిళ హీరో ఎంట్రీ కన్ఫర్మేనా?
నేను పీపుల్ మేడ్ స్టార్... ఫ్యాన్ మీట్‌లో శివకార్తికేయన్ - పాలిటిక్స్‌లోకి తమిళ హీరో ఎంట్రీ కన్ఫర్మేనా?
Indiramma Towers: ఇందిరమ్మ టవర్స్ లబ్ధిదారులకు అలర్ట్.. అక్టోబర్ 9 లోగా డిపాజిట్ చెల్లించకపోతే ఇల్లు రద్దు!
ఇందిరమ్మ టవర్స్ లబ్ధిదారులకు అలర్ట్.. అక్టోబర్ 9 లోగా డిపాజిట్ చెల్లించకపోతే ఇల్లు రద్దు!
Embed widget