అన్వేషించండి

IND Vs NZ: డిస్నీప్లస్ హాట్‌స్టార్ కొత్త రికార్డు - కింగ్ క్రీజులో ఉన్నప్పుడు ఎంత మంది చూశారో తెలుసా?

భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన ప్రపంచ కప్ మ్యాచ్‌ను డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో 43 మిలియన్ల మంది చూశారు.

Disneyplus Hotstar Record: భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన ప్రపంచ కప్ 21వ మ్యాచ్‌లో టీమ్ ఇండియా నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈసారి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఐసీసీ ప్రపంచ కప్‌ను డిజిటల్‌గా ప్రసారం చేస్తోంది. ఆదివారం జరిగిన భారత్, న్యూజిలాండ్ మ్యాచ్‌లో హాట్‌స్టార్ కొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది.

ఈ మ్యాచ్ చివరి క్షణాల్లో డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో 43 మిలియన్ల మంది చూశారు. అంటే భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్‌ను అత్యధికంగా 4.3 కోట్ల మంది వీక్షించారన్న మాట. ప్రపంచ వీక్షకుల సంఖ్యలో ఇది కొత్త రికార్డు. ఆరంభంలో భారత్ వికెట్లు పడినప్పుడు టీమిండియా ఓడిపోతుందేమో అనిపించినా... క్రీజులో విరాట్ కోహ్లీ స్ట్రాంగ్‌గా ఉండడంతో మ్యాచ్‌లో ఉత్కంఠ పెరిగింది. చివర్లో మ్యాచ్‌ని చూసేందుకు చాలా మంది యాప్‌లోకి వచ్చారు. దీంతో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సరికొత్త రికార్డు సృష్టించింది.

వాస్తవానికి, ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్ లేదా లీగ్ క్రికెట్ చరిత్రలో ఏ మ్యాచ్‌లోనైనా అత్యధిక శిఖరాగ్ర వీక్షకుల సంఖ్య 3.5 కోట్లు అంటే 35 మిలియన్లు. కొద్ది రోజుల క్రితం భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఈ రికార్డును సృష్టించింది.

గతంలో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా జియో సినిమా 35 మిలియన్ల నంబర్‌తో రికార్డు సృష్టించింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 4.3 కోట్ల మంది వీక్షకులతో డిస్నీప్లస్ హాట్‌స్టార్ సరికొత్త రికార్డు సృష్టించింది.

50 మిలియన్లు దాటుతుందా?
టెక్ క్రంచ్ నివేదిక ప్రకారం డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో ప్రసారం అవుతున్న ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ 2023పై ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఈ టోర్నమెంట్‌లో 50 మిలియన్ల వీక్షకుల సంఖ్యను దాటుతుందని కంపెనీ భావిస్తోంది. అలాగే ఇది భారతదేశంలోని వార్షిక వీడియో వినియోగదారులలో 82 శాతానికి చేరుకుంటుంది. ఆదివారం మ్యాచ్ తర్వాత ఇది నిజం అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది.

మరోవైపు స్వదేశంలో జరుగుతున్న ప్రపంచకప్‌లో టీమిండియా జైత్రయాత్రకు న్యూజిలాండ్‌ కూడా బ్రేక్‌ వేయలేకపోయింది. మహా సంగ్రామంలో భారత్ వరుసగా అయిదో విజయాన్ని కూడా నమోదు చేసింది. 2019 ప్రపంచకప్ సెమీస్‌లో ఎదురైన పరాజయానికి టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది. షమీ బౌలింగ్‌లో మెరిసిన వేళ... కింగ్‌ కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్‌‌తో చెలరేగిన వేళ కివీస్‌పై భారత జట్టు విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌట్‌ అయింది. 274 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు మరో 12 బంతులు మిగిలి ఉండగానే ఆరు  వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కింగ్ విరాట్‌ కోహ్లీ 104 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, రెండు సిక్సులతో 95 పరుగులు చేసి టీమిండియాకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.

Read Also: డైనమిక్ ఐల్యాండ్‌తో లాంచ్ అయిన ఐఫోన్ 15 సిరీస్ - ధర ఎంత పెట్టారు?

Read Also: అత్యధిక బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే యాపిల్ వాచ్ ఇదే - యాపిల్ వాచ్ అల్ట్రా 2 వచ్చేసింది!

Read Also: వేళ్లు కదిపితే ఫోన్ ఎత్తేయచ్చు - మైండ్ బ్లోయింగ్‌ టెక్నాలజీతో యాపిల్ వాచ్ సిరీస్ 9 - ధర ఎంత?

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mohan Babu Bail Petition: హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
Where is Perni Nani: పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
Kishan Reddy : రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
AP Weather Report: తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి
తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ట్రాన్స్ జెండర్స్ ఆన్ డ్యూటీ, నేటి నుంచే హైదరాబాద్ రోడ్లపై..సహనం కోల్పోయిన సీపీ, తిట్టేసి క్షమాపణలు!Police Released CCTV Footage of Allu Arjun | అల్లు అర్జున్ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసిన పోలీసులు | ABP DesamNara Devaansh Chess World Record | వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటుసాధించిన దేవాన్ష్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Babu Bail Petition: హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
Where is Perni Nani: పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
Kishan Reddy : రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
AP Weather Report: తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి
తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి
Daaku Maharaaj Press Meet: 'వాల్తేరు వీరయ్య' కంటే 'డాకు మహారాజ్' బాగుంది... ఆ తమిళ సినిమాలే టార్గెట్ - 'డాకు మహారాజ్' ప్రెస్ మీట్ లో నాగ వంశీ
'వాల్తేరు వీరయ్య' కంటే 'డాకు మహారాజ్' బాగుంది... ఆ తమిళ సినిమాలే టార్గెట్ - 'డాకు మహారాజ్' ప్రెస్ మీట్ లో నాగ వంశీ
Adilabad News: ఏబీపీ దేశం కథనానికి స్పందించిన దాతలు- విద్యార్థులకు, వృద్ధులకు స్వెటర్లు, దుప్పట్లు పంపిణీ
ఏబీపీ దేశం కథనానికి స్పందించిన దాతలు- విద్యార్థులకు, వృద్ధులకు స్వెటర్లు, దుప్పట్లు పంపిణీ
Jr NTR : క్యాన్సర్ బారిన పడిన అభిమానికి భరోసా ఇచ్చి మర్చిపోయిన జూనియర్ ఎన్టీఆర్ -  అభిమాని తల్లి కీలక వ్యాఖ్యలు
క్యాన్సర్ బారిన పడిన అభిమానికి భరోసా ఇచ్చి మర్చిపోయిన జూనియర్ ఎన్టీఆర్ - అభిమాని తల్లి కీలక వ్యాఖ్యలు
Crime News: పార్శిల్‌లో ఇంటికి మృతదేహం - పోలీస్ విచారణలో షాకింగ్ విషయాలు వెల్లడి
పార్శిల్‌లో ఇంటికి మృతదేహం - పోలీస్ విచారణలో షాకింగ్ విషయాలు వెల్లడి
Embed widget