WhatsApp update: వాట్సాప్ వినియోగదారులకు మరో గుడ్ న్యూస్.. త్వరలో అందుబాటులోకి వాయిస్ స్టేటస్ ఫీచర్!
వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్ ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురాబోతుంది. ‘వాయిస్ స్టేటస్ అప్ డేట్’ పై టెస్ట్ రన్ నిర్వహిస్తోంది. ఈ ఫీచర్ ద్వారా వాయిస్ ను స్టేటస్ గా సెట్ చేసుకునే అవకాశం ఉంటుంది.
![WhatsApp update: వాట్సాప్ వినియోగదారులకు మరో గుడ్ న్యూస్.. త్వరలో అందుబాటులోకి వాయిస్ స్టేటస్ ఫీచర్! WhatsApp latest update Meta-owned app working on voice status updates WhatsApp update: వాట్సాప్ వినియోగదారులకు మరో గుడ్ న్యూస్.. త్వరలో అందుబాటులోకి వాయిస్ స్టేటస్ ఫీచర్!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/23/155feaf3fd21667e891bc01686ef9f2a1663902449571544_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్.. ఎప్పటికప్పుడు తాజా ఫీచర్లు తీసుకొస్తూ వినియోగదారులకు మరింత సౌకర్యవంతంమైన మెసేజింగ్ అనుభూతిని కల్పిస్తోంది. ఇప్పటికే పలు నూతన ఫీచర్లపై వర్క్ చేస్తున్న వాట్సాప్.. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్ మీద పరీక్షలు జరుపుతున్నది. ఇప్పటి వరకు టెక్ట్స్, వీడియోను మాత్రమే వాట్సాప్ స్టేటస్ గా పెట్టుకునే అవకాశం ఉండగా.. ఇప్పుడు వాయిస్ ను కూడా స్టేటస్ గా సెట్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. ఈ విషయాన్ని వాట్సాప్ తాజాగా అప్ డేట్స్ అందించే వెబ్ సైట్ WABetaInfo వెల్లడించింది. ఈ అప్ డేట్ గూగుల్ ప్లే బీటా ప్రోగ్రామ్ ద్వారా విడుదల చేయబడుతుందని తెలిపింది. త్వరలోనే దీని వెర్షన్ 2.22.21.5 అందుబాటులోకి వస్తున్నట్లు ప్రకటించింది.
30 సెకెన్ల ఆడియో స్టేటస్
ఈ ‘వాయిస్ స్టేటస్ అప్‌డేట్’ ఫీచర్ వినియోగదారులు ప్రైవసీ సెట్టింగుల ఆధారంగా వారి కాంటాక్ట్స్ తో షార్ట్ వాయిస్ నోట్ లను షేర్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ ఫీచర్ ప్రస్తుతం డెవలప్ మెంట్ దశలో ఉంది. దీన్ని ఎప్పుడు విడుదల చేస్తారు? అనే విషయాన్ని మాత్రం WABetaInfo వెల్లడించలేదు అయితే ఈ ఫీచర్ కు సంబంధించిన స్క్రీన్ షాట్ ను షేర్ చేసింది. ఈ వెబ్‌సైట్ ప్రకారం, ఈ లేటెస్ట ఫీచర్ టెక్స్ట్ స్టేటస్ కంపోజర్ కి చాలా దగ్గరకి పోలికను కలిగి ఉంటుంది. స్టేటస్ అప్ డేట్‌ల కోసం వాయిస్ నోట్‌ని రికార్డ్ చేసేందుకు స్టేటస్ విభాగంలోనే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు తెలిపింది. ఈ వాయిస్ నోట్‌లు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ద్వారా ప్రొటెక్ట్ చేయబడుతాయి. ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత, వినియోగదారులు 30 సెకన్ల వరకు వాయిస్ నోట్‌ను అప్‌లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది.
బ్యాగ్రౌండ్ కలర్ ను ఎంచుకునే అవకాశం
అంతేకాదు, వినియోగదారులు వాయిస్ స్టేటస్ అప్ డేట్‌ను పోస్ట్ చేయాలనుకున్నప్పుడు.. వాయిస్ నోట్ కోసం బ్యాక్‌గ్రౌండ్ కలర్ ను కూడా ఎంచుకునే అవకాశం ఉంది. అది మెసేజ్ బబుల్ గా చూపించబడుతుంది. మీరు వాయిస్ స్టేటస్ అప్ డేట్ ఓపెన్ చేసిన ప్రతిసారీ వాయిస్ నోట్ ఆటోమేటిక్‌గా ప్లే అవుతుందని WABetaInfo తెలిపింది.
📝 WhatsApp beta for Android 2.22.21.5: what's new?
— WABetaInfo (@WABetaInfo) September 21, 2022
WhatsApp is working on voice status updates, for a future update of the app!https://t.co/quvu57cS4c pic.twitter.com/bKjjFFWd9L
టెస్టింగ్ లో ‘ఎడిట్ మెసేజ్’ ఫీచర్
మెటా యాజమాన్యంలోని ఈ ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ ద్వారా పంపిన మెసేజ్ లను ఎడిట్ చేసే లా వినియోగదారులను అనుమతించే అవకాశంపైనా వాట్సాప్ పని చేస్తున్నది. ‘ఎడిట్ మెసేజెస్’ అనే ఫీచర్ గూగుల్ ప్లే బీటా ప్రోగ్రామ్ ద్వారా విడుదల చేయబడుతున్నట్లు WABetaInfo తెలిపింది. దీని వెర్షన్ 2.22.20.12 త్వరలో అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించింది. అయితే, ఈ ఫీచర్ డెవలప్‌మెంట్ దశలో ఉన్నందున విడుదల తేదీని ప్రకటించలేదు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)