Keyboard Layout: కీబోర్డు QWERTY ఫార్మాట్‌లోనే ఎందుకు? - ABCDEF ఫార్మాట్‌లో ఉంటే ఏం అవుతుంది?
మీ కీబోర్డు QWERTY లేఅవుట్‌లోనే ఎందుకు ఉంటాయి? ABCDEF ఆర్డర్‌లో ఉంటే ఏం అవుతుంది?
Keyboard: కీబోర్డులో లెటర్స్ ABCDEF... ఇలా డైరెక్ట్ ఆర్డర్‌లో కాకుండా QWERTY క్రమంలో ఉంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఫార్మాట్ ఎందుకు అని మీరు ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా? ఇప్పుడు మీ కీబోర్డ్ లోని అక్షరాలు ABCD అనే క్రమంలో ఉంటే ఏం జరుగుతుంది అనే ప్రశ్న కూడా ఉంది? దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
QWERTY చరిత్ర
అన్నింటిలో మొదటిది, నేడు అనేక దేశాలలో ఉపయోగించే ప్రామాణిక కీబోర్డ్ లేఅవుట్ QWERTY అని గమనించడం ముఖ్యం. ఈ లేఅవుట్ వాస్తవానికి మెకానికల్ టైప్‌రైటర్‌ల కోసం రూపొందించారు. టైపింగ్ వేగాన్ని తగ్గించడం ద్వారా జామింగ్‌ను నిరోధించడానికి డిజైన్ చేశారు. Dvorak, Colemak వంటి మరింత సమర్థవంతమైన కీబోర్డ్ లేఅవుట్‌లు కూడా డిజైన్ చేశారు. అయితే QWERTY అత్యంత విస్తృతంగా ఉపయోగించే లేఅవుట్‌గా మిగిలిపోయింది.
మనం QWERTYని తీసేస్తే?
మనం QWERTYని కాకుండా బదులుగా ABCD కీలను అమర్చినట్లయితే ఏం జరుగుతుంది? దీని ద్వారా టైపింగ్ మరింత సౌకర్యవంతంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా కొత్తగా టైపింగ్ నేర్చుకునే వారికి. టైపింగ్ వేగాన్ని తగ్గించడానికి QWERTYని రూపొందించారని చరిత్ర పేజీలు చూపిస్తున్నాయి. కాబట్టి ABCD సీక్వెన్స్ టైపింగ్‌ను సులభతరం చేస్తుంది.
QWERTY కీబోర్డ్‌లో సాధారణంగా ఉపయోగించే కీలు మధ్య లైన్‌లో ఉన్నాయని గమనించడం కూడా ముఖ్యం. ఇది వేళ్లకు చాలా సౌకర్యంగా ఉంటుంది. ABCD లేఅవుట్ చేతులు, మణికట్టుపై అదనపు ఒత్తిడి లేదా అలసటను కలిగించే అవకాశం ఉంది. ఇవి చేతుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.
అయితే ఇది జరిగినప్పటికీ ఇప్పటికే QWERTYలో పనిచేస్తున్న లక్షలాది మందికి మళ్లీ శిక్షణ ఇవ్వడంలో నష్టం వాటిల్లుతుంది. అటువంటి పరిస్థితిలో వారు మళ్లీ శిక్షణ పొందవలసి ఉంటుంది. దీంతో పాటు కొత్త లేఅవుట్‌కు అనుగుణంగా కీబోర్డ్ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌లను రీడిజైన్ చేయాల్సి ఉంటుంది. దీనికి పెట్టుబడి అవసరం అవుతుంది. ఉదాహరణకు అనేక కంప్యూటర్ ప్రోగ్రామ్‌లు QWERTY కీబోర్డులతో పని చేయడానికి రూపొందించబడ్డాయి. కాబట్టి లేఅవుట్‌ను మార్చడానికి ఆ ప్రోగ్రామ్‌లకు కూడా మార్పులు అవసరం కావచ్చు.
మరో వైపు నోకియా సీ22 స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. ఈ మొబైల్ గ్లోబల్‌గా ఇప్పటికే లాంచ్ అయింది. రెండు స్టోరేజ్ వేరియంట్లు, మూడు కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఐపీ52 రేటింగ్, 2.5డీ డిస్‌ప్లే గ్లాస్, బలమైన మెటల్ ఛాసిస్‌తో ఈ ఫోన్ లాంచ్ అయింది.
ఈ ఫోన్ రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. వీటిలో 2 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.7,999గా నిర్ణయించారు. ఇక 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.8,499గా నిర్ణయించారు. చార్‌కోల్, పర్పుల్, శాండ్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.5 అంగుళాల ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది. ఆక్టాకోర్ యూనిసోక్ ఎస్సీ9863ఏ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. 4 జీబీ వరకు ర్యామ్, 64 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా పెంచుకోవచ్చు.