By: ABP Desam | Updated at : 04 Jan 2022 05:21 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
వివో వై21టీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది.
మనదేశంలో వివో తన కొత్త ఫోన్ లాంచ్ చేసింది. అదే వివో వై21టీ. ఇందులో 50 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 128 జీబీ స్టోరేజ్‌ను వివో ఇందులో అందించింది. ఈ ఫోన్ ఇటీవలే ఇండోనేషియాలో కూడా లాంచ్ చేసింది.
వివో వై21టీ ధర
మనదేశంలో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే లాంచ్ అయింది. 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధర రూ.16,490గా నిర్ణయించారు. మిడ్ నైట్ బ్లూ, పెరల్ వైట్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతానికి ఈ ఫోన్ ఆఫ్‌లైన్‌లో మాత్రమే అందుబాటులో ఉంది.
వివో వై21టీ స్పెసిఫికేషన్లు
ఇందులో 6.58 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. ఆక్టాకోర్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. 4జీ ఎల్టీఈ, బ్లూటూత్ వీ5, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఎఫ్ఎం రేడియో, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.
ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 12 ఆపరేటింగ్ సిస్టంపై వివో వై21టీ పనిచేయనుంది. 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. ర్యామ్‌ను వర్చువల్‌గా మరో 1 జీబీ పెంచుకునే అవకాశం ఉంది. ఈ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 18W ఫాస్ట్ చార్జింగ్‌ను కూడా ఈ స్మార్ట్ ఫోన్ సపోర్ట్ చేయనుంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది.
యాక్సెలరో మీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, మ్యాగ్నెటోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్‌లను కూడా ఇందులో అందించారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ మందం 0.8 సెంటీమీటర్లు కాగా, బరువు 182 గ్రాములుగా ఉంది.
Also Read: Samsung Offers: గుడ్‌న్యూస్.. ఈ శాంసంగ్ ఫోన్ ధర తగ్గింపు.. ఇప్పుడు రూ.13 వేలలోపే!
Also Read: Cheapest 5G Phone: వేడెక్కుతున్న 5జీ మార్కెట్.. రూ.20 వేలలోపే మరో 5జీ ఫోన్!
Also Read: Tecno Camon 18: ముందు, వెనక 48 మెగాపిక్సెల్ కెమెరాలు.. ధర రూ.15 వేలలోపే.. వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ ఫ్రీ!
Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!
Vivo Y75: వివో కొత్త ఫోన్ వచ్చేసింది - అదిరిపోయే ఫీచర్లు - ధర ఎంతంటే?
OnePlus Nord 2T: వన్‌ప్లస్ నార్డ్ 2టీ వచ్చేసింది - సూపర్ కెమెరాలు, వేగవంతమైన ప్రాసెసర్ - ఎలా ఉందో చూశారా?
Moto G71s 5G: రూ.20 వేలలోపే మోటొరోలా కొత్త 5జీ ఫోన్ - సూపర్ ఫీచర్లు కూడా - ఎలా ఉందో చూశారా?
Whatsapp Premium: త్వరలో వాట్సాప్ ప్రీమియం - డబ్బులు కట్టాల్సిందేనా?
Apple Event 2022: యాపిల్ ఈవెంట్ డేట్ లీక్ - ఐఫోన్లతో పాటు లాంచ్ అయ్యేవి ఇవే - ధరలు కూడా!
NTR31: క్రేజీ రూమర్ - ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాలో కమల్ హాసన్?
Kanika Kapoor Second Marriage: 'పుష్ప' సింగర్ రెండో పెళ్లి చేసుకుంది - ఫొటోలు చూశారా?
Begumbazar Honour Killing : బేగంబజార్ పరువు హత్య కేసు, కర్ణాటకలో నలుగురు నిందితులు అరెస్టు
Pooja Hegde: ‘కేన్స్’లో పూజా హెగ్డేకు చేదు అనుభవం, ఆమె కోసం వారు నిద్రాహారాలు మానేశారట!