Vivo V23 5G: వివో వీ23 ఫోన్లు వచ్చేశాయ్... 108 మెగాపిక్సెల్ కెమెరాతో.. మిగతా ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో తన కొత్త స్మార్ట్ ఫోన్ సిరీస్‌ను మనదేశంలో లాంచ్ చేసింది. అవే వివో వీ23 5జీ సిరీస్.
వివో వీ23 5జీ, వివో వీ23 ప్రో 5జీ ఫోన్లు మనదేశంలో లాంచ్ అయ్యాయి. ఈ రెండు స్మార్ట్ ఫోన్లలోనూ వెనకవైపు ఫ్లోరైట్ ఏజీ గ్లాస్‌ను అందించారు. సూర్యకాంతిలో అల్ట్రా వయొలెట్ కిరణాలు ఈ ఫోన్ బ్యాక్ ప్యానెల్‌పై పడినప్పుడు వెనకవైపు రంగులు మారతాయి. 12 జీబీ వరకు ర్యామ్ ఇందులో ఉంది.
వివో వీ23 5జీ ధర
ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.29,990గా నిర్ణయించారు. ఇక 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.34,990గా ఉంది. స్టార్ డస్ట్ బ్లాక్, సన్ షైన్ రంగుల్లో ఈ ఫోన్ లాంచ్ అయింది.
వివో వీ23 ప్రో 5జీ ధర
ఇందులో కూడా రెండు వేరియంట్లే లాంచ్ అయ్యాయి. వీటిలో 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.38,990గా ఉంది. హైఎండ్ వేరియంట్ అయిన 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.43,990గా నిర్ణయించారు. వీటికి సంబంధించిన ప్రీ-ఆర్డర్లు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. జనవరి 13వ తేదీ నుంచి వీటి సేల్ జరగనుంది.
వివో వీ23 5జీ, వివో వీ23 ప్రో 5జీ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్లు పనిచేయనున్నాయి. వివో వీ23లో 6.44 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. మీడియాటెక్ డైమెన్సిటీ 920 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. 12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉంది. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ కూడా ఉన్నాయి. సెల్పీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 50 మెగాపిక్సెల్, 8 మెగాపిక్సెల్ కెమెరాలు అందించారు.
ఇక వివో వీ23 ప్రోలో 6.56 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. మీడియాటెక్ డైమెన్సిటీ 1200 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో అందించారు. ఫోన్ వెనకవైపు 108 మెగాపిక్సెల్ కెమెరాను ప్రధాన కెమెరాగా అందించారు. మిగతా కెమెరాలన్నీ వీ23 5జీ తరహాలోనే ఉన్నాయి.
వివో వీ23లో 4200 ఎంఏహెచ్, వివో వీ23 ప్రోలో 4300 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. ఇవి రెండూ 44W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇవి సపోర్ట్ చేయనుంది. వివో వీ23 బరువు 179 గ్రాములుగానూ, వీ23 ప్రో బరువు 171 గ్రాములుగానూ ఉంది.
Also Read: Samsung Offers: గుడ్‌న్యూస్.. ఈ శాంసంగ్ ఫోన్ ధర తగ్గింపు.. ఇప్పుడు రూ.13 వేలలోపే!
Also Read: Cheapest 5G Phone: వేడెక్కుతున్న 5జీ మార్కెట్.. రూ.20 వేలలోపే మరో 5జీ ఫోన్!
Also Read: Tecno Camon 18: ముందు, వెనక 48 మెగాపిక్సెల్ కెమెరాలు.. ధర రూ.15 వేలలోపే.. వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ ఫ్రీ!
Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!