News
News
X

Twitter Blue: ట్విట్టర్ బ్లూ ఈజ్ బ్యాక్ - ఈసారి మరిన్ని కొత్త ఫీచర్లు!

ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్‌ను కంపెనీ తిరిగి తీసుకువచ్చింది. డిసెంబర్ 12వ తేదీన ఈ సర్వీస్ తిరిగి మార్కెట్లో లాంచ్ అయింది.

FOLLOW US: 
Share:

ఎప్పట్నుంచో వార్తల్లో ఉన్న ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్‌ను కంపెనీ రీలాంచ్ చేసింది. ఐఫోన్ యూజర్లకు ఈ సబ్‌స్క్రిప్షన్ చార్జీ మరింత ఖరీదు కానుంది. అయితే ట్విట్టర్ బ్లూ చెక్ మార్క్ అప్లై చేసుకునేవారు ఫోన్ నంబర్ వెరిఫై చేసుకోవాలని కొత్త రూల్ పెట్టారు. దీని వల్ల నకిలీ ఖాతాలకు చెక్ పెట్టాలనేది ప్లాన్.

అయితే ఐడీ వెరిఫికేషన్ కూడా ఉంటుందా? అని కొంతమంది వినియోగదరులు ట్విట్టర్ ప్రొడక్ట్ మేనేజర్ ఎస్తేర్ క్రాఫోర్డ్‌ను ప్రశ్నించగా ‘ప్రస్తుతం అందించిన అప్‌డేట్‌లో ఐడీ వెరిఫికేషన్ లేదు.’ అని క్రాఫోర్డ్ రిప్లై ఇచ్చారు. ట్విట్టర్ బ్లూ వినియోగదారులకు కొత్త ఫీచర్లు కూడా లభించనున్నాయి. ట్విట్టర్ క్యారెక్టర్ లిమిట్‌ను 280 నుంచి ఏకంగా 4,000కు పెంచింది. ఈ విషయాన్ని కంపెనీ కొత్త బాస్ ఎలాన్ మస్క్ కన్ఫర్మ్ చేశారు.

ట్విట్టర్ బ్లూలో రాబోయే ఫీచర్లు ఇవే!
ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రైబర్‌ల కోసం త్వరలో కొత్త ఫీచర్లు కూడా తీసుకురానున్నారు. స్కామ్‌లు, స్పామ్‌లను ఎదుర్కోవడానికి వారి ట్వీట్‌లకు ప్రాధాన్యత ఇవ్వడం, వెరిఫై కాని వ్యక్తుల కంటే 50 శాతం తక్కువ యాడ్స్ చూడటం, ట్విట్టర్‌లో పొడవైన వీడియోలను పోస్ట్ చేసే ఆప్షన్ వంటి ఫీచర్లు త్వరలో రానున్నాయి.

ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రైబర్‌లు 'ఎడిట్ ట్వీట్' ఆప్షన్ పొందుతారని, వారి పబ్లిష్ చేసిన ట్వీట్‌లను ఎడిట్ చేసే వీలు కల్పిస్తుందని ట్విట్టర్ ప్రకటించింది. అలాగే, ట్విట్టర్ బ్లూ వినియోగదారులు 1080p వీడియో అప్‌లోడ్‌లు, రీడర్ మోడ్‌ వంటి ఫీచర్లను పొందుతారు.

ట్విట్టర్ బిజినెస్ ఆర్గనైజేషన్స్ కోసం "అధికారిక" లేబుల్‌ని గోల్డ్ చెక్ మార్క్‌ను అందించడం ప్రారంభిస్తుంది. వారం తర్వాత మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ అధికారిక ప్రభుత్వ, మల్టీలాటెరల్ అకౌంట్స్ బూడిద రంగు టిక్ మార్క్‌ను పొందనున్నాయి. ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రైబర్‌లు తమ హ్యాండిల్, డిస్‌ప్లే పేరు లేదా ప్రొఫైల్ ఫోటోను మార్చవచ్చు. అయినప్పటికీ వారు అలా చేస్తే తమ ఖాతాను మళ్లీ సమీక్షించే వరకు వారు తమ బ్లూ చెక్ మార్క్‌ను తాత్కాలికంగా కోల్పోతారు.

యాపిల్ యూజర్లకు బాదుడు ఎందుకు?
iOS వినియోగదారులకు ట్విట్టర్ బ్లూ ఎందుకు ఎక్కువ ఖర్చు అవుతుంది అని చాలామంది అడుగుతున్నారు. iOS ద్వారా ట్విట్టర్ బ్లూకు సబ్‌స్క్రయిబ్ చేసేటప్పుడు యాపిల్ 30 శాతం కమిషన్ తీసుకోవడమే దీనికి కారణమని ఒక ట్విట్టర్ వినియోగదారుడు తెలిపాడు. అందువలన iOS వినియోగదారులకు మరింత ఖర్చు కానుంది. ఎక్కువ చెల్లించకుండా ఉండటానికి iOS వినియోగదారులు వెబ్‌లో ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్ సర్వీస్‌ను కొనుగోలు చేయవచ్చు. దానిని వారి iOS డివైస్‌లో యూజ్ చేయవచ్చు.

నవంబర్‌లో ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్ సర్వీసును ప్రారంభించిన తర్వాత, మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్‌లో నకిలీ ఖాతాల సంఖ్య అనేక రెట్లు పెరిగింది. దీని ఫలితంగా కొంత కాలం పాటు ఈ సర్వీసులను నిలిపివేశారు. ట్విట్టర్ బ్లూని నవంబర్ 29న పునఃప్రారంభించవలసి ఉంది, కానీ లాంచ్ ఆలస్యం అయింది.

Also Read: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?

Published at : 12 Dec 2022 09:32 PM (IST) Tags: Twitter Twitter Blue Elon Musk Twitter Blue Subscription Twitter blue features Twitter Blue Relaunch

సంబంధిత కథనాలు

Samsung Galaxy Unpacked 2023: 200 మెగాపిక్సెల్ కెమెరాతో శాంసంగ్ ఫోన్ - అదిరిపోయే స్మార్ట్ ఫోన్ సిరీస్!

Samsung Galaxy Unpacked 2023: 200 మెగాపిక్సెల్ కెమెరాతో శాంసంగ్ ఫోన్ - అదిరిపోయే స్మార్ట్ ఫోన్ సిరీస్!

WhatsApp New Features: సూపర్ ఆప్షన్స్‌తో టెక్స్ట్ ఎడిటర్, త్వరలో వాట్సాప్ నుంచి సరికొత్త ఫీచర్!

WhatsApp New Features: సూపర్ ఆప్షన్స్‌తో టెక్స్ట్ ఎడిటర్,  త్వరలో వాట్సాప్ నుంచి సరికొత్త ఫీచర్!

Netflix: పాస్‌వర్డ్ షేరింగ్‌ను నిలిపివేయనున్న నెట్‌ఫ్లిక్స్ - ఎలా కనిపెడతారో చెప్పేసిన స్ట్రీమింగ్ కంపెనీ!

Netflix: పాస్‌వర్డ్ షేరింగ్‌ను నిలిపివేయనున్న నెట్‌ఫ్లిక్స్ - ఎలా కనిపెడతారో చెప్పేసిన స్ట్రీమింగ్ కంపెనీ!

Budget 2023: స్మార్ట్ ఫోన్లు, కెమెరా లెన్స్‌లు కొనాలనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్ - మరింత చవకగా!

Budget 2023: స్మార్ట్ ఫోన్లు, కెమెరా లెన్స్‌లు కొనాలనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్ - మరింత చవకగా!

WhatsApp: మీరు ఈ స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారా? అయితే, ఈ రోజు నుంచి ఇందులో వాట్సాప్ పని చేయదు!

WhatsApp: మీరు ఈ స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారా? అయితే,  ఈ రోజు నుంచి ఇందులో వాట్సాప్ పని చేయదు!

టాప్ స్టోరీస్

Lokesh Padayatra Tension : లోకేశ్ పాదయాత్రలో మరోసారి ఉద్రిక్తత, బహిరంగ సభకు అనుమతి లేదని ప్రచార వాహనం సీజ్

Lokesh Padayatra Tension : లోకేశ్ పాదయాత్రలో మరోసారి ఉద్రిక్తత, బహిరంగ సభకు అనుమతి లేదని ప్రచార వాహనం సీజ్

Thalapathy67: కత్తులు, చాక్లెట్లు, విజయ్, విలన్స్ - ప్రోమోతోనే సిక్సర్ కొట్టిన లోకేష్ కనగరాజ్ - టైటిల్ ఏంటో తెలుసా?

Thalapathy67: కత్తులు, చాక్లెట్లు, విజయ్, విలన్స్ - ప్రోమోతోనే సిక్సర్ కొట్టిన లోకేష్ కనగరాజ్ - టైటిల్ ఏంటో తెలుసా?

Amigos Trailer : ముగ్గురిలో ఒకడు రాక్షసుడు అయితే - కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ట్రైలర్ వచ్చేసిందోచ్

Amigos Trailer : ముగ్గురిలో ఒకడు రాక్షసుడు అయితే - కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ట్రైలర్ వచ్చేసిందోచ్

K Viswanath Songs: పాటంటే కేవలం పాట కాదు, అందులోనూ కథ చెప్పడం విశ్వనాథ్ స్టైల్ - అందుకే అవి క్లాసిక్స్‌

K Viswanath Songs: పాటంటే కేవలం పాట కాదు, అందులోనూ కథ చెప్పడం విశ్వనాథ్ స్టైల్ - అందుకే అవి క్లాసిక్స్‌