(Source: ECI/ABP News/ABP Majha)
Twitter Blue: నెల రోజుల్లోగా అందుబాటులోకి ట్విట్టర్ ‘బ్లూ’ సబ్ స్క్రిప్షన్ సర్వీస్, ఎలన్ మస్క్ వెల్లడి!
ట్విట్టర్ బర్డ్ ను కొనుగోలు చేసిన ఎలన్ మస్క్.. కీలక మార్పులకు శ్రీకారం చుడుతున్నాడు. నెల రోజుల్లోగా భారత్ లో బ్లూ సబ్ స్క్రిప్షన్ సర్వీన్ అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తాజాగా వెల్లడించారు.
మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ను చేజిక్కించుకున్న ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్.. ముఖ్యమైన మార్పులు, చేర్పులు చేస్తున్నారు. సరికొత్త ఫీచర్లు అందుబాటులోకి తీసుకువస్తున్నారు. తాజాగా(నవంబర్ 5న) ట్విట్టర్ బ్లూ ప్రీమియం సబ్ స్క్రిప్షన్ సేవను మస్క్ ప్రారంభించారు. వినియోగదారులు $7.99 (INR 655) నెలవారీ ఫీజుతో వెరిఫైడ్ టిక్ ను కొనుగోలు చేసే అవకాశం ఉన్నట్లు మస్క్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో భారత్ లో ఈ సేవ ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందో చెప్పాలని పలువురు మస్క్ ను అడుగుతున్నారు. ట్విట్టర్ వేదికగా ఆయన పలువురు ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ట్విట్టర్ బ్లూ సర్వీస్ భారతదేశంలో త్వరలో అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. నెల రోజుల వ్యవధిలో ఈ సేవను ప్రారంభించబోతున్నట్లు ఆయన తెలిపారు.
.@elonmusk When can we expect to have the Twitter Blue roll out in India? #TwitterBlue
— Prabhu (@Cricprabhu) November 5, 2022
భారతదేశంలోని iOS వినియోగదారులు యాప్‌ను కొత్త వెర్షన్‌కి అప్‌డేట్ చేయడం ద్వారా.. Twitter బ్లూ సబ్ స్క్రిప్షన్ సర్వీస్ కు సంబంధించిన కొన్ని ఫీచర్లను పొందవచ్చు. అయితే, ఈ సర్వీస్ ధర జిఎస్‌టి తో కలుపబడిందా? లేదా? ఇప్పటికే జిఎస్‌టిని చేర్చినట్లయితే ధర $10కి పెరుగుతుందా? అని ట్విట్టర్ యూజర్ మస్క్ ను ప్రశ్నించాడు.
Super, that’s fast! Looking forward and guessing it could be INR 649 or so. Will be interesting to see if it’s incl GST or if it will take it to close to 10$.
— Prabhu (@Cricprabhu) November 5, 2022
ఇకపై లాంగ్ ట్వీట్ కు అవకాశం!
సబ్‌స్క్రిప్షన్ సేవను ప్రారంభించిన తర్వాత మస్క్ కీలక ప్రకటన చేశాడు. త్వరలో ట్వీట్‌లకు లాంగ్ ఫారమ్ టెక్స్ట్‌ను రాసుకునే అవకాశం ఉందని తెలిపారు.
Twitter will soon add ability to attach long-form text to tweets, ending absurdity of notepad screenshots
— Elon Musk (@elonmusk) November 5, 2022
క్రియేటర్ మానిటైజేషన్ పరిచయం చేస్తాం!
అన్ని రకాల కంటెంట్‌లకు క్రియేటర్ మానిటైజేషన్ ఉంటుందని మస్క్ తెలిపారు. అదే పేరుతో యూట్యూబ్ ఛానెల్‌ని నడుపుతున్న 'ఎవ్రీడే ఆస్ట్రోనాట్' అనే పేరు గల ట్విట్టర్ యూజర్.. ట్విట్టర్‌లో కంటెంట్ క్రియేటర్స్ కోసం డబ్బు ఆర్జించే ఐడియాపై సంతోషం మస్క్ సంతోషం వ్యక్తం చేశారు. యూట్యూబ్ మాదిరిగానే ట్విట్టర్ మానిటైజేషన్ సిస్టమ్‌ను అందించగలిగితే, మైక్రో బ్లాగింగ్ ప్లాట్ ఫారమ్ లో కూడా తన పూర్తి వీడియోలను అప్ లోడ్ చేయడాన్ని పరిశీలిస్తానని తెలిపాడు. యూట్యూబ్ కంటే ఎక్కువ మొత్తం ఇవ్వనున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. ప్రస్తుతం 42 నిమిషాల వీడియోలను షేర్ చేసే అవకాశం ఉంటుందని చెప్పారు. తర్వాత అపరిమిత నిడివిగల వీడియోలను అప్ లోడ్ చేసుకోవచ్చు అని తెలిపారు.
If twitter could handle the full length feature videos that I produce and can offer a similar monetization system like YouTube does, I would consider uploading my full videos here too for sure. https://t.co/JsYw9DI9oO
— Everyday Astronaut (@Erdayastronaut) November 5, 2022
YouTube gives creators 55% of ad revenue, FWIW.
— Quinn Nelson (@SnazzyQ) November 5, 2022
ట్విట్టర్, సబ్ స్టాక్ మధ్య పోలికలు
కొంతమంది వ్యక్తులు ట్విట్టర్, సబ్స్టాక్ మధ్య పోలికలను గుర్తు చేస్తున్నారు. సబ్‌స్టాక్ మాదిరిగానే ట్విట్టర్‌లో వ్రాసే ముక్కలకు ఎవరైనా సభ్యత్వాన్ని పొందగలరా? అని మస్క్‌ని అడిగారు. సబ్‌స్టాక్ అనేది జర్నలిస్టులు, రచయితల కోసం ఒక ఇమెయిల్ వార్తాలేఖ వేదిక. ట్విట్టర్‌లో "బేక్ చేయాలి" అని ఓ వినియోగదారు చెప్పారు. కచ్చితంగా చేస్తామని మస్క్ సమాధానం ఇచ్చారు.
బ్లూ సబ్స్క్రిప్షన్ లేని ధృవీకరించబడిన ఖాతాల పరిస్థితి ఏంటి?
ట్విట్టర్‌లో ఇప్పటికే బ్లూ కలర్ టిక్ ఉన్న వ్యక్తులు వెంటనే వారి ధృవీకరణ స్థితిని కోల్పోతారా? ఆరోన్ కోన్ ప్రశ్నించారు. ట్విట్టర్ బ్లూకు సభ్యత్వం పొందని బ్లూ కలర్ టిక్‌లు ఉన్న వ్యక్తులు రెండు నెలల్లో వారి ధృవీకరణ స్థితిని కోల్పోతారు అని చెప్పారు.
Will we lose our verification status right away ? What is the timeline for the changes to be implemented ?
— Aaron Cohn (@aaroncohn30) November 5, 2022
మస్క్, అలెగ్జాండ్రియా మధ్య వివాదం
గత కొన్ని రోజులుగా, ట్విట్టర్‌లో యునైటెడ్ స్టేట్స్ ప్రతినిధి అలెగ్జాండ్రియా ఒకాసియో-కోర్టెజ్, మస్క్ మధ్య వాగ్వాదం జరుగుతోంది. ట్విట్టర్‌లో బ్లూటిక్ ను పొందేందుకు చెల్లింపు సేవను ప్రారంభించాలనే మస్క్ నిర్ణయాన్ని ఆమె తప్పుబట్టారు. బ్లూటిక్ వెరిఫికేషన్ కు సంబంధించి తనకు ఎలాంటి నోటిఫికేషన్‌లు రాలేదని స్క్రీన్ షాట్ షేర్ చేసింది. అమెరికన్ నటుడు మార్క్ రుఫలో ఓకాసియో-కోర్టెజ్ ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ మస్క్ తన విశ్వసనీయతను నాశనం చేస్తున్నాడని , అది మంచిది కాదని వెల్లడించారు. రుఫలో ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ.. అలెగ్జాండ్రియా ఒకాసియో-కోర్టెజ్ చెప్పేవన్నీ వాస్తవాలు కాదని మస్క్ వెల్లడించారు.
Hot take: not everything AOC says is 💯 accurate
— Elon Musk (@elonmusk) November 5, 2022