Tecno Pop 5 Pro: కొత్త బడ్జెట్ ఫోన్‌తో వస్తున్న టెక్నో.. రూ.7 వేలలోపే భారీ బ్యాటరీ!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ టెక్నో తన పాప్ 5 ప్రో స్మార్ట్ ఫోన్‌ను టీజ్ చేసింది. ఇందులో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుంది.
టెక్నో పాప్ 5 ప్రో స్మార్ట్ ఫోన్‌ను కంపెనీ టీజ్ చేసింది. ఈ ఫోన్ మనదేశంలో త్వరలో లాంచ్ కానుంది. ఇందులో 6.52 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉండనుంది. మీడియాటెక్ హీలియో ఏ22 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనున్నట్లు తెలుస్తోంది. 6000 ఎంఏహెచ్ బ్యాటరీని కూడా ఇందులో అందించనున్నారు. టెక్నో పాప్ 5 ప్రో స్మార్ట్ ఫోన్ అధికారిక లాంచ్ తేదీని ఇంకా ప్రకటించలేదు.
టెక్నో షేర్ చేసిన టీజర్‌లో ఈ ఫోన్ వాటర్ డ్రాప్ నాచ్‌తో కనిపించింది. టెక్నో పాప్ 5 ప్రో బ్యాటరీ పెర్ఫార్మెన్స్‌పై కంపెనీ దృష్టి పెట్టింది. అందుకే ఇందులో 6000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీని అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ ప్రాసెసర్, ర్యామ్, స్టోరేజ్ వంటి కీలక వివరాలను కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.
అంతేకాకుండా ఈ ఫోన్ కెమెరా వివరాలు కూడా తెలియరాలేదు. టెక్నో పాప్ సిరీస్‌లో మనదేశంలో కంపెనీ లాంచ్ చేయనున్న రెండో ఫోన్ ఇదే. ఇందులో మీడియాటెక్ హీలియో ఏ22 ప్రాసెసర్‌ను అందించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ కూడా ఇందులో ఉండనున్నాయని తెలుస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు చూస్తే ధర రూ.7 వేలలోపే ఉండే అవకాశం ఉంది.
ఇందులో 6.52 అంగుళాల డిస్‌ప్లేను అందించనున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. గతవారం టెక్నో పాప్ 5 ఎల్టీఈ కూడా మనదేశంలో లాంచ్ అయింది. ఆండ్రాయిడ్ 11 (గో ఎడిషన్) ఆధారిత హైఓఎస్ 7.6 ఆపరేటింగ్ సిస్టంను ఇందులో అందించారు. ఇందులో కూడా 6.52 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేనే అందించారు.
ఇందులో వెనకవైపు 8 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్ సెన్సార్లను అందించారు. ఫోన్ వెనకవైపు డ్యూయల్ ఫ్లాష్ లైట్ కూడా ఉంది. ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ఫోన్ వెనకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉండగా, ఫేస్ అన్‌లాక్ ఫీచర్ కూడా ఇందులో అందించారు. మొత్తం 14 భారతీయ భాషలను ఇది సపోర్ట్ చేయనుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు.
Also Read: Vivo Y01 Price Leaked: వివో కొత్త ఫోన్ ధర, ఫీచర్లు లీక్.. రూ.10 వేలలోపే!
Also Read: Samsung Offers: గుడ్‌న్యూస్.. ఈ శాంసంగ్ ఫోన్ ధర తగ్గింపు.. ఇప్పుడు రూ.13 వేలలోపే!
Also Read: Cheapest 5G Phone: వేడెక్కుతున్న 5జీ మార్కెట్.. రూ.20 వేలలోపే మరో 5జీ ఫోన్!
Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!