Tecno POP 5 LTE Sale: రూ.6 వేలలోనే అదిరిపోయే స్మార్ట్ ఫోన్.. సేల్ ప్రారంభం.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
టెక్నో ఇటీవలే మనదేశంలో టెక్నో పాప్ 5 ఎల్టీఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. దీని సేల్ మనదేశంలో ప్రారంభం అయింది.

టెక్నో పాప్ 5 ఎల్టీఈ స్మార్ట్ ఫోన్ సేల్ మనదేశంలో ప్రారంభం అయింది. అమెజాన్‌లో ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఇందులో 5000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీని అందించారు. టెక్నో పాప్ 5 ఎల్టీఈ 14 ప్రాంతీయ భాషలను సపోర్ట్ చేస్తుందని కంపెనీ తెలిపింది. యువత లక్ష్యంగా ఈ ఫోన్‌ను రూపొందించినట్లు టెక్నో తెలిపింది.
టెక్నో పాప్ 5 ఎల్టీఈ ధర
ఈ స్మార్ట్ ఫోన్ ధరను రూ.6,299గా నిర్ణయించారు. అమెజాన్‌లో ఈ ఫోన్‌ను అందుబాటులో ఉంది. నేటి నుంచి (జనవరి 16వ తేదీ) దీని సేల్ ప్రారంభం అయింది. డీప్ సీ క్లస్టర్, ఐస్ బ్లూ, టర్కోయిస్ సియాన్ రంగుల్లో టెక్నో పాప్ 5 ఎల్టీఈని కొనుగోలు చేయవచ్చు.
టెక్నో పాప్ 5 ఎల్టీఈ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 11 (గో ఎడిషన్) ఆధారిత హైఓఎస్ 7.6 ఆపరేటింగ్ సిస్టంపై టెక్నో పాప్ 5 ఎల్టీఈ పనిచేయనుంది. ఇందులో 6.52 అంగుళాల హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డాట్ నాచ్ డిస్‌ప్లేను అందించారు. వాల్ట్ 2.0, స్మార్ట్ ప్యానెల్ 2.0, సోషల్, టర్బో, డార్క్ థీమ్స్, పేరెంటల్ కంట్రోల్, డిజిటల్ వెల్‌బీయింగ్, జెస్చర్ కాల్ పికర్ వంటి ఫీచర్లు కూడా ఈ స్మార్ట్ ఫోన్‌లో టెక్నో అందించింది. ఇందులో 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్‌ను అందించారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 256 జీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది.
ఈ స్మార్ట్ ఫోన్‌లో వెనకవైపు రెండు కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 8 మెగాపిక్సెల్ కాగా.. దీంతోపాటు మరో 2 మెగాపిక్సెల్ సెన్సార్ కూడా అందించారు. ఫోన్ వెనకవైపు డ్యూయల్ ఫ్లాష్ లైట్ కూడా అందుబాటులో ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫోన్ ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.
ఫోన్ వెనకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఫేస్ అన్‌లాక్ ఫీచర్ కూడా ఇందులో అందించారు. తెలుగు, హిందీ, బెంగాలీ, ఉర్దూ సహా మొత్తం 14 భారతీయ భాషలను ఇది సపోర్ట్ చేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. ఐపీఎక్స్2 వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. వైఫై, జీపీఆర్ఎస్, 4జీ ఎల్టీఈ, బ్లూటూత్ వీ4.2, జీపీఎస్, ఎఫ్ఎం రేడియో, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ వంటి ఫీచర్లను అందించారు.
Also Read: Vivo Y01 Price Leaked: వివో కొత్త ఫోన్ ధర, ఫీచర్లు లీక్.. రూ.10 వేలలోపే!
Also Read: Samsung Offers: గుడ్‌న్యూస్.. ఈ శాంసంగ్ ఫోన్ ధర తగ్గింపు.. ఇప్పుడు రూ.13 వేలలోపే!
Also Read: Cheapest 5G Phone: వేడెక్కుతున్న 5జీ మార్కెట్.. రూ.20 వేలలోపే మరో 5జీ ఫోన్!
Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

