Convert Old to New TV: సాధారణ టీవీని స్మార్ట్ టీవీగా మార్చొచ్చని మీకు తెలుసా…!
మీ ఇంట్లో స్మార్ టీవీ ఉందా…పిక్చర్ ట్యూబ్ టీవీ ఉందా? ఒకవేళ పిక్చర్ ట్యూబ్ టీవీ ఉన్నా మీరు స్మార్ట్ టీవీగా మార్చెయ్యొచ్చు తెలుసా? ఎలాగో కొన్ని టిప్స్ చెబుతోంది మీ ఏబీపీ దేశం
అప్పట్లో ఊరికో టీవీ ఉండేది….ఆ తర్వాత కాలనీకో టీవీ అంటే మహాగొప్ప. కానీ ఇప్పుడు టీవీలేని ఇల్లుంటే అదో పెద్ద వింత. పెరుగుతున్న సాంకేతికతో పాటుగా టీవీల పరిణామ క్రమంలో గణనీయమైన మార్పులు వచ్చాయి. పిక్చర్‌ట్యూబ్ టీవీల నుంచి స్మార్ట్‌టీవీల వరకు టీవీల పరిణామ క్రమం ఎదిగింది. ప్రస్తుతం స్మార్ట్‌టీవీల రాకతో అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్ లాంటి ఓటీటీ ప్లాట్‌ఫాంలో వచ్చే వీడియోలను నేరుగా టీవీల్లో పెద్ద స్క్రీన్‌పై చూడొచ్చు. అయితే ఓటీటీ ప్లాట్‌ఫాం వీడియోలను కేవలం స్మార్ట్ టీవీల్లో మాత్రమే చూడగల్గుతాం అనుకుంటే మీరు పొరపడినట్లే..! మీ ఇంట్లో పాత ఎల్‌ఈడీ లేదా ఎల్‌సీడీ టీవీలను కొన్ని ప్రత్యేకమైన గాడ్జెట్లు ఉపయోగించి స్మార్ట్‌టీవీగా తయారుచేయవచ్చు. ఇందుకు ఇంట్లో వైఫై కనెక్టివిటీ అవసరం.
మీ పాత టీవీని స్మార్ట్ టీవీగా మార్చేందుకు మార్కెట్‌లో అందుబాటులో ఉన్న గాడ్జెట్స్ ఏంటంటే…
అమెజాన్ ఫైర్ స్టిక్
అమెజాన్ ఫైర్ స్టిక్‌తో మీ పాత టీవీలను స్మార్ట్ టీవీలుగా మార్చొచ్చు. అలెక్సాను ఉపయోగించి వాయిస్ కంట్రోల్ ద్వారా ఓటీటీ యాప్‌లను పొందొచ్చు. ఫైర్ స్టిక్‌ను హెచ్‌డీఎమ్‌ఐ పోర్ట్‌లో ఉంచి వైఫైకు కనెక్ట్ చేయాలి. దీని ధర రూ. 3,999.
టాటా స్కై బింజీ+
టాటా స్కై బింజీ సెటప్ బాక్స్‌తో పాత టీవీను స్మార్ట్ టీవీలుగా మార్చొచ్చు. టాటా స్కై బింజీ+ తో వినియోగదారులు తమ ల్యాప్‌టాప్, టాబ్లెట్ లేదా మొబైల్ ఫోన్‌లో ప్లే చేసే వీడియోలను టీవీలో చూడవచ్చు. టాటా స్కై బింజీ+లో క్రోమ్‌కాస్ట్ ఫీచరును ఏర్పాటు చేశారు. హెచ్‌డీఎమ్‌ఐ పోర్ట్‌తో స్మార్ట్ టీవీగా చేయవచ్చును. దీని ధర రూ. 3,999.
షావోమీ ఎమ్‌ఐ బాక్స్ 4కే
షావోమీ ఎమ్‌ఐ బాక్స్ 4కే బాక్స్‌తో గూగుల్ ప్లే స్టోర్ యాప్‌లను కూడా యాక్సెస్ చేయవచ్చును. డాల్బీ అట్మోస్‌ను సపోర్ట్ చేస్తుంది. వాయిస్ ఆదేశాలను ఉపయోగించి ఎమ్‌ఐ బాక్స్ 4కే ను నియంత్రించవచ్చు. ఈ పరికరం హెచ్‌డీఎమ్‌ఐ, యూఎస్‌బీ 2.0, బ్లూటూత్‌ను సపోర్ట్ చేస్తుంది. దీని ధర రూ. 3,499.
యాక్ట్ స్ట్రీమ్ టీవీ 4 కే బాక్స్
యాక్ట్ ఫైబర్‌నెట్‌కు చెందిన యాక్ట్ స్ట్రీమ్ టీవీ 4కే బాక్స్‌తో ఏ రకమైన ఎల్‌ఈడీ టీవీలను స్మార్ట్ టీవీగా చేయవచ్చును. ఈ గాడ్జెట్‌లో సుమారు 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను అందిస్తోంది. దీని ధర రూ. 4,499.
ఎయిర్ టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్
ఎయిర్ టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ ఆండ్రాయిడ్ 9 ఆపరేటింగ్ సిస్టమ్‌ను కల్గి ఉంది. గూగుల్ అసిస్టెంట్ ఉండడటంతో వాయిస్ కమాండ్స్‌తో కంట్రోల్ చేయవచ్చును దీని ధర రూ. 3,999.
ఇంకెందుకు ఆలస్యం.... పాత టీవీని పక్కనపడేసి కొత్త టీవీ కొనుక్కునే బదులు... పాత టీవీనే స్మార్ట్ గా మార్చేయండి....