అన్వేషించండి

Playstation 5: గేమింగ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. హాట్ గేమింగ్ కన్సోల్ మళ్లీ వచ్చేస్తుంది.. సేల్ ఎప్పుడంటే?

ప్లేస్టేషన్ 5 స్టాక్ మనదేశంలో మళ్లీ అందుబాటులోకి రానుంది. డిసెంబర్ 6వ తేదీ నుంచి దీనికి సంబంధించిన సేల్ జరగనుంది.

మనదేశంలో ప్లేస్టేషన్ 5 స్టాక్ మళ్లీ అందుబాటులోకి రానుంది. దీంతో సేల్ మళ్లీ జరుగుతుందన్న మాట. డిసెంబర్ 6వ తేదీన మధ్యాహ్నం 12 గంటల నుంచి దీనికి సంబంధించిన సేల్ జరుగుతుందని సోనీ పేర్కొంది. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఇవి మనదేశంలో లాంచ్ అయ్యాయి. ఇవి మొదటి సారి ప్రీ-ఆర్డర్లకు వచ్చినప్పుడు కేవలం ఐదు నిమిషాల్లోనే పూర్తిగా అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయాయి. తర్వాత ఎన్నిసార్లు సేల్‌కి వచ్చినా వెంటనే స్టాక్ అయిపోయేది. వినియోగదారులకు వీటిలో ఉన్న క్రేజ్ అలాంటిది మరి. ఇప్పుడు వీటిని మళ్లీ సేల్‌కు తీసుకువస్తున్నారు.

అమెజాన్, క్రోమా, ఫ్లిప్‌కార్ట్, ప్రీపెయిడ్ గేమర్ కార్డ్, రిలయన్స్ డిజిటల్, విజయ్ సేల్స్‌లో ఈ గేమింగ్ కన్సోల్ లభించనుంది. వీటికి సంబంధించిన సేల్ చివరిసారి అక్టోబర్ 25వ తేదీన జరిగింది. సేల్‌కు వచ్చిన నిమిషాల్లోనే స్టాక్ మొత్తం స్వాహా చేసేశారు వినియోగదారులు. ఆసక్తి గల వినియోగదారులకు ఇప్పుడు మళ్లీ వీటిని కొనుగోలు చేసేందుకు అవకాశం లభించింది.

సోనీ అధికారిక ఆన్‌లైన్ స్టోర్ Shopatsc.com వెబ్‌సైట్లో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇచ్చారు. డిసెంబర్ 6వ తేదీన వీటికి సంబంధించిన ప్రీ-ఆర్డర్లు ప్రారంభం కానున్నాయి. ఇందులో అందించిన బ్యానర్ బట్టి డెలివరీలు డిసెంబర్ 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.

ప్లేస్టేషన్ 5 ధర మనదేశంలో రూ.49,990గా ఉంది. ప్లేస్టేషన్ 5 డిజిటల్ ఎడిషన్ ధరను రూ.39,990గా నిర్ణయించారు. అమెరికాలో పీఎస్5 ధర 499.99 డాలర్లుగానూ(సుమారు రూ.36,700), పీఎస్5 డిజిటల్ ఎడిషన్ ధరను 399.99 డాలర్లుగానూ(సుమారు రూ.29,400) ఉంది. యాపిల్ తరహాలోనే పీఎస్5 ధర కూడా అమెరికా కంటే మనదేశంలోనే ఎక్కువగా ఉంది.

వీటికి సంబంధించిన డ్యూయల్ సెన్స్ కంట్రోలర్ ధరను రూ.5,990గానూ, హెచ్‌డీ కెమెరా ధరను రూ.5,190గానూ, పల్స్ 3డీ వైర్‌లెస్ హెడ్‌సెట్ ధరను రూ.2,590గానూ నిర్ణయించారు. దీని ద్వారా గేమ్‌ను లైవ్ స్ట్రీమింగ్ చేయవచ్చు. ఇక డ్యూయల్ సెన్స్ చార్జింగ్ స్టేషన్ ధర రూ.2,590గా ఉంది. అయితే కన్సోల్ కొన్న వారికి డ్యూయల్ సెన్స్ కంట్రోలర్ కూడా బాక్స్‌లో లభిస్తుంది.

సోనీ ప్లేస్టేషన్‌కు పోటీగా మైక్రోసాఫ్ట్ కూడా ఎక్స్‌బాక్స్ సిరీస్‌లో కొన్ని గేమింగ్ కన్సోల్స్‌ను మార్కెట్లో అందుబాటులోకి తీసుకువచ్చింది. వీటిలో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌బాక్స్ సిరీస్ ఎస్ ధర రూ.34,990గానూ, ఎక్స్‌బాక్స్ సిరీస్ ఎక్స్ రూ.49,990గానూ ఉంది.

ఈ సంవత్సరం జులై 18వ తేదీ నాటికి 10 మిలియన్ల పీఎస్5 కన్సోల్స్ అమ్ముడుపోయాయని సోనీ రివీల్ చేసింది. అత్యధికంగా అమ్ముడుపోయిన గేమింగ్ కన్సోల్ ఇదేనని సోనీ ఈ సందర్భంగా తెలిపింది.  2021 చివరికి 1.8 కోట్ల పీఎస్5 యూనిట్లు అమ్ముడుపోవచ్చని సోనీ అంచనా వేస్తుంది.

Also Read: Moto G51 5G: అత్యంత చవకైన మోటో 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. మరో వారంలో లాంచ్.. ధర ఎంతంటే?

Also Read: Redmi New Phone: రెడ్‌మీ కొత్త ఫోన్ వచ్చేసింది.. 8 జీబీ ర్యామ్.. ధర ఎంతంటే?

Also Read: OnePlus RT: వన్‌ప్లస్ ఆర్‌టీ ధర లీక్.. 9 సిరీస్ కంటే తక్కువే.. ఎంతంటే?

Also Read: Lava AGNI 5G: స్వదేశీ 5జీ ఫోన్ వచ్చేసింది.. ఇలా కొంటే రూ.2,000 తగ్గింపు!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Governor: బుధవారం తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించనున్న రాధాకృష్ణన్
Telangana Governor: బుధవారం తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించనున్న రాధాకృష్ణన్
Jagan Tour : ఇడుపుల పాయ నుంచి  ఇచ్చాపురం బస్సు యాత్ర - జగన్ ప్రచారం ఖరారు !
ఇడుపుల పాయ నుంచి ఇచ్చాపురం బస్సు యాత్ర - జగన్ ప్రచారం ఖరారు !
BCCI: జాక్‌పాట్‌ కొట్టిన సర్ఫరాజ్‌, జురెల్‌
జాక్‌పాట్‌ కొట్టిన సర్ఫరాజ్‌, జురెల్‌
Hyderabad News: హైదరాబాద్‌లో ఐటీ సోదాల కలకలం-   చట్నీస్‌ హోటల్స్‌ ఓనర్‌పై ఫోకస్
హైదరాబాద్‌లో ఐటీ సోదాల కలకలం- చట్నీస్‌ హోటల్స్‌ ఓనర్‌పై ఫోకస్
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Chilukur Balaji Temple | ముస్లిం రైతుకు పశువును బహుమతిగా ఇచ్చిన అర్చకులు రంగరాజన్ | ABP DesamMachu Lakshmi Adiparvam Trailer Launch | కాళ్లపై పడిపోయే ఫ్యాన్స్ మంచు లక్ష్మీకి ఉన్నారోచ్ | ABPMS Dhoni IPL 2024 Retirement | మహేంద్ర సింగ్ ధోనికి ఇదే లాస్ట్ ఐపీఎల్ సీజనా.? | ABP DesamSRH Captain Pat Cummins IPL 2024 | కమిన్స్ రాకతోనైనా ఆరెంజ్ ఆర్మీ ఆకట్టుకుంటుందా.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Governor: బుధవారం తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించనున్న రాధాకృష్ణన్
Telangana Governor: బుధవారం తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించనున్న రాధాకృష్ణన్
Jagan Tour : ఇడుపుల పాయ నుంచి  ఇచ్చాపురం బస్సు యాత్ర - జగన్ ప్రచారం ఖరారు !
ఇడుపుల పాయ నుంచి ఇచ్చాపురం బస్సు యాత్ర - జగన్ ప్రచారం ఖరారు !
BCCI: జాక్‌పాట్‌ కొట్టిన సర్ఫరాజ్‌, జురెల్‌
జాక్‌పాట్‌ కొట్టిన సర్ఫరాజ్‌, జురెల్‌
Hyderabad News: హైదరాబాద్‌లో ఐటీ సోదాల కలకలం-   చట్నీస్‌ హోటల్స్‌ ఓనర్‌పై ఫోకస్
హైదరాబాద్‌లో ఐటీ సోదాల కలకలం- చట్నీస్‌ హోటల్స్‌ ఓనర్‌పై ఫోకస్
Brothers As DGPs: దేశ పోలీసు వ్య‌వ‌స్థ‌లో రికార్డు.. రెండు రాష్ట్రాల‌కు డీజీపీలుగా అన్న‌ద‌మ్ములు
దేశ పోలీసు వ్య‌వ‌స్థ‌లో రికార్డు.. రెండు రాష్ట్రాల‌కు డీజీపీలుగా అన్న‌ద‌మ్ములు
Elections Commission News: ఎన్నికల్లో అక్రమాలు జరిగితే ఈల వేసి అధికారులను పిలవండి- మీ చేతిలోనే పవర్‌ అస్త్ర
ఎన్నికల్లో అక్రమాలు జరిగితే ఈల వేసి అధికారులను పిలవండి- మీ చేతిలోనే పవర్‌ అస్త్ర
SS Rajamouli: ఎన్టీఆర్ క్యారెక్టర్ మార్చిన రాజమౌళి - 'ఆర్ఆర్ఆర్'ను అలా తీస్తే ఎలా ఉండేదో?
ఎన్టీఆర్ క్యారెక్టర్ మార్చిన రాజమౌళి - 'ఆర్ఆర్ఆర్'ను అలా తీస్తే ఎలా ఉండేదో?
Iswarya Menon Photos:  పింక్ శారీలో ఐశ్వర్య మీనన్ ని చూస్తే రెప్పవేయడం మర్చిపోతారంతే!
Iswarya Menon Photos: పింక్ శారీలో ఐశ్వర్య మీనన్ ని చూస్తే రెప్పవేయడం మర్చిపోతారంతే!
Embed widget