By: ABP Desam | Updated at : 30 Jan 2023 05:37 PM (IST)
కోకా కోలా లాంచ్ చేయనున్న ఫోన్ లుక్ (Image Credits: StuffListings Twitter)
కోకా కోలా అనేది ప్రపంచవ్యాప్తంగా అస్సలు పరిచయం అక్కర్లేని బ్రాండ్. సిగ్నేచర్ కోలా టేస్ట్, ఐకానిక్ బాటిల్‌కు పేరుగాంచిన కంపెనీ ఇప్పుడు భారతదేశంలో బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్ విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కోకా కోలా మొబైల్ తయారీ రంగంలోకి దిగనుందా? లేకపోతే వేరే బ్రాండెడ్ మొబైల్‌ను ప్రజెంట్ చేస్తున్నారా? అన్నది తెలియరాలేదు.
టిప్‌స్టర్ ముకుల్ శర్మ షేర్ చేసిన ట్వీట్‌లో కోకాకోలా బ్రాండ్ స్మార్ట్‌ఫోన్ ఫొటోను డిస్‌ప్లే చేశారు. ఈ స్మార్ట్ ఫోన్ చూడటానికి రియల్‌మీ 10 4జీ తరహలో ఉంది. దీన్ని బట్టి రియల్‌మీ, కోకా కోలా భాగస్వామ్యం ఏర్పరచుకున్నట్లు కనిపిస్తోంది.
లీకైన ఫొటోలో స్మార్ట్‌ఫోన్ లుక్ ఎలా ఉందో చూడవచ్చు. కోకా కోలా స్మార్ట్‌ఫోన్‌లో వెనుక వైపు ఎల్ఈడీ ఫ్లాష్‌తో కూడిన కెమెరా సెటప్ ఉండే అవకాశం ఉంది. ఫోన్ రౌండ్ అంచులను కలిగి ఉంది. వాల్యూమ్ బటన్లు కుడి వైపున ఉన్నాయి.
ఫోన్ వెనుక ప్యానెల్‌లో కోకా కోలా బ్రాండింగ్‌తో ఎరుపు రంగులో ఉంటుంది. లీక్ అయిన చిత్రం నుండి మనకు తెలిసిందల్లా అంతే. ఈ స్మార్ట్‌ఫోన్ ఒకవేళ రియల్‌మీ 10 4జీ ప్రత్యేక ఎడిషన్ అయినట్లయితే, ఫోన్ 2400 x 1080 పిక్సెల్స్ ఉన్న పుల్ హెచ్‌డీ+ రిజల్యూషన్ ఉన్న డిస్‌ప్లే అందించనున్నారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉండనుంది.
రియల్‌మీ 10లోనే 4జీతో పాటు 5జీ వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. ఇందులో 6.6 అంగుళాల పుల్ హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిజల్యూషన్ 1080 × 2400 పిక్సెల్స్ కాగా, స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉంది. ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. 8 జీబీ ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256 జీబీ వరకు యూఎఫ్ఎస్ 2.2 ఇంటర్నల్ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్, ఏఐ లెన్స్ కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 33W ఫాస్ట్ చార్జింగ్‌ను కూడా సపోర్ట్ చేయనుంది.
రియల్‌మీ 10 ప్రో స్మార్ట్ ఫోన్ కూడా గతంలోనే లాంచ్ అయింది. ఇందులో 6.72 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని పీక్ బ్రైట్‌నెస్ 680 నిట్స్‌గా ఉంది. దీని స్క్రీన్ టు బాడీ రేషియో 93.76 శాతం కాగా, స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. 12 జీబీ వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256 జీబీ యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు.
ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 108 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత రియల్‌మీ యూఐ 4.0 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది.
దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 33W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. కేవలం 30 నిమిషాల్లోనే 50 శాతం చార్జింగ్ ఎక్కుతుందని కంపెనీ అంటోంది. ఒక్కసారి పూర్తిగా చార్జ్ చేస్తే 44 గంటల పాటు ఏకబిగిన మ్యూజిక్ వినవచ్చట. దీని మందం కేవలం 0.81 సెంటీమీటర్లు మాత్రమే.
Redmi Note 12 Turbo: రూ.34 వేలలోపే 1000 జీబీ స్టోరేజ్ స్మార్ట్ ఫోన్ - రెడ్మీ సూపర్ మొబైల్ వచ్చేసింది!
GitHub Layoffs: భారతదేశంలో ఇంజినీరింగ్ టీం మొత్తాన్ని తొలగించిన గిట్‌హబ్ - ఏకంగా 142 మందిపై వేటు!
Moto G13: రూ.10 వేలలోపు ధరతోనే మోటొరోలా కొత్త ఫోన్ - 50 మెగాపిక్సెల్ కెమెరా కూడా!
Third Party Apps: థర్డ్ పార్టీ యాప్స్ డౌన్ లోడ్ చేస్తున్నారా? అయితే, APK ఫైల్ గురించి కాస్త తెలుసుకోండి!
Vodafone Idea: నష్టాల్లో వొడాఫోన్ ఐడియా - అదే జరిగితే, ఇక ఆ ‘సర్వీస్’ క్లోజ్ ?
CM Jagan Party Meet : ఏప్రిల్ 3న పార్టీ నేతలతో సీఎం జగన్ కీలక సమావేశం, కఠిన నిర్ణయాలుంటాయని జోరుగా ప్రచారం
Manchu Vishnu: మనోజ్‌తో గొడవపై మంచు విష్ణు ఊహించని ట్విస్ట్ - తాజా వీడియో చూస్తే తల పట్టుకుంటారు!
Mla Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్ పై ముంబయిలో కేసు నమోదు
Data Theft ED Case : సైబరాబాద్ డేటా చోరీ కేసులో ఈడీ ఎంటర్, మనీలాండరింగ్ కింద కేసు నమోదు