Smartphone Charging Tips: ఫోన్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? - పేలిపోయే అవకాశం ఉంది జాగ్రత్త!
Charger Wire Cut: మీ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ ఛార్జింగ్ పెట్టే వైర్ తెగిపోయిందా? అయినా దాన్నే ఉపయోగిస్తున్నారా?
Mobile Charging Tips: మనం ఉపయోగించే ఏ డివైస్‌ను అయినా సరే ఛార్జ్ చేయడానికి ఛార్జర్ అవసరం. మార్కెట్‌లో ప్రస్తుతం మూడు రకాల స్మార్ట్ ఫోన్ ఛార్జర్‌లు అందుబాటులో ఉన్నాయి, వీటిలో మీకు సాధారణ ఛార్జర్, ఫాస్ట్ ఛార్జర్, సీ-టైప్ ఛార్జర్ లభిస్తాయి. కానీ కొన్నిసార్లు ఈ ఛార్జర్‌లు ఉపయోగించే సమయంలో పాడైపోయి వాటి వైర్లు తెగిపోతాయి. ఇలా తెగిపోయినప్పటికీ చాలా మంది వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్‌లను అలాంటి ఛార్జర్‌లతోనే ఛార్జ్ చేస్తూనే ఉంటారు. మీరు కూడా అలాంటి పని చేస్తూ ఉంటే జాగ్రత్తగా ఉండాలి.
తెగిన వైర్‌తో కూడిన ఛార్జర్ బాంబు కంటే ఏమాత్రం తక్కువ కాదు. మీరు ఇటువంటి ఛార్జర్‌తో మీ ఫోన్‌ను ఛార్జ్ చేస్తుంటే, మీ ఫోన్ బ్యాటరీ పేలిపోయి మీరు కరెంట్ షాక్‌కు గురికావచ్చు. అటువంటి పరిస్థితిలో, వైర్లు తెగిన ఛార్జర్‌కి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇది మీ ఫోన్‌తో పాటు మిమ్మల్ని కూడా రక్షిస్తుంది.
స్మార్ట్‌ఫోన్ ఛార్జర్ ఎలా ఉండాలి?
మీ స్మార్ట్‌ఫోన్‌ను ఛార్జ్ చేసే ఛార్జర్ వేరే బ్రాండ్‌ది అయి ఉండకూడదు. ఎప్పుడూ ఒరిజినల్ ఛార్జర్ ద్వారా మాత్రమే ఫోన్ ఛార్జింగ్ పెట్టాలని టెక్ నిపుణులు సలహా ఇస్తున్నారు. మీరు దీన్ని పాటించకపోతే మీకే హాని కలుగుతుంది.
వైర్లు కట్ అయిన ఛార్జర్ వల్ల కలిగే హాని ఏమిటి?
వైర్లు కట్ అయిన ఛార్జర్‌తో మీ మొబైల్‌ను ఛార్జ్ చేస్తే మీరు నష్టపోవటం ఖాయం. పాడైపోయిన ఛార్జర్‌ని ఉపయోగించడం వల్ల ఫోన్ బ్యాటరీ పాడవడమే కాకుండా, ఫోన్ పేలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది.
ఒరిజినల్ ఛార్జర్ మాత్రమే ఉపయోగించండి
మీరు మీ స్మార్ట్‌ఫోన్ లేదా మొబైల్‌ను ఛార్జ్ చేయడానికి లోకల్ ఛార్జర్‌ని ఉపయోగిస్తుంటే మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చీప్ క్వాలిటీ లోకల్ ఛార్జర్‌లో ఎప్పుడైనా స్పార్కింగ్ జరగవచ్చు. దీని కారణంగా మీ స్మార్ట్‌ఫోన్ దెబ్బతింటుంది.
మరోవైపు మెయిజు 21 స్మార్ట్ ఫోన్‌ను చైనాలో ఇటీవలే అధికారికంగా లాంచ్ చేశారు. ఈ స్మార్ట్ ఫోన్‌లో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌ను అందించారు. 12 జీబీ వరకు ర్యామ్ మెయిజు 21లో ఉంది. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 200 మెగాపిక్సెల్ కావడం విశేషం. నాలుగు వేర్వేరు కలర్ ఆప్షన్లలో ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, ఐపీ54 రేటెడ్ బిల్ట్, 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఇందులో ఉన్నాయి. మెయిజు 21 బ్యాటరీ సామర్థ్యం 4800 ఎంఏహెచ్‌గా ఉంది.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply
Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!