అన్వేషించండి

Samsung Galaxy F04: 8 జీబీ ర్యామ్ ఉన్న శాంసంగ్ ఫోన్ రూ.6,499కే - మోటొరోలా, రెడ్‌మీ బడ్జెట్ మొబైల్స్‌కు పోటీ!

శాంసంగ్ కొత్త స్మార్ట్ ఫోన్ గెలాక్సీ ఎఫ్04 మనదేశంలో ఎంట్రీ ఇచ్చింది. దీని ధర రూ.7,499 మాత్రమే కావడం విశేషం.

Samsung F04: శాంసంగ్ గెలాక్సీ ఎఫ్04 స్మార్ట్ ఫోన్ మనదేశంలో బుధవారం లాంచ్ అయింది. 6.5 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేను ఇందులో అందించారు. ఫ్రంట్ కెమెరా కోసం వాటర్ డ్రాప్ తరహా నాచ్ అందుబాటులో ఉంది. ఇందులో ర్యామ్ ప్లస్ ఫీచర్ అందించారు. ఈ ఫీచర్ ద్వారా ర్యామ్‌ను 8 జీబీ వరకు పెంచుకోవచ్చు. 64 జీబీ స్టోరేజ్ ఈ ఫోన్‌లో అందుబాటులో ఉంది. మోటొరోలా ఈ32ఎస్, రెడ్‌మీ 9ఐ ఫోన్లతో ఇది పోటీ పడనుంది.

శాంసంగ్ గెలాక్సీ ఎఫ్04 ధర
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే లాంచ్ అయింది. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ ఉన్న ఈ వేరియంట్ ధరను రూ.7,499గా నిర్ణయించారు. దీన్ని స్పెషల్ లాంచ్ ప్రైస్ అని కంపెనీ తెలిపింది. అయితే ఎన్ని రోజులు ఈ ధరకు విక్రయిస్తారో తెలియరాలేదు. జేడ్ పర్పుల్, ఓపెన్ బ్లూ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. జనవరి 12వ తేదీన ఫ్లిప్‌కార్ట్, శాంసంగ్.కాం వెబ్‌సైట్లలో దీని సేల్ జరగనుంది.

ఐసీఐసీఐ కార్డుల ద్వారా ఈ ఫోన్ కొనుగోలు చేస్తే రూ.1,000 డిస్కౌంట్ లభించనుంది. అంటే రూ.6,499కే ఈ ఫోన్‌ను దక్కించుకోవచ్చన్న మాట. నెలకు రూ.330 నుంచి ఈ ఫోన్ ఈఎంఐ ఆప్షన్లు ప్రారంభం కానున్నాయి.

శాంసంగ్ గెలాక్సీ ఎఫ్04 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఆండ్రాయిడ్ 12 ఆధారిత వన్ యూఐ 4.1 ఆపరేటింగ్ సిస్టంపై ఈ బడ్జెట్ ఫోన్ పని చేయనుంది. ఇందులో 6.5 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే అందించారు. వాటర్ డ్రాప్ తరహా నాచ్ ఈ ఫోన్‌లో ఉంది. మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్‌పై శాంసంగ్ గెలాక్సీ ఎఫ్04 పని చేయనుంది. 5000 ఎంఏహెచ్ సామర్థ్యం ఉన్న బ్యాటరీ కూడా ఈ ఫోన్‌లో ఉంది.

ఇక కెమెరా విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 12 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ కూడా అందుబాటులో ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరా అందించారు.

4 జీబీ ర్యామ్ ఈ ఫోన్‌లో ఉంది. ర్యామ్ ప్లస్ ఫీచర్‌ను అందించారు. దీని ద్వారా ర్యామ్‌ను మొత్తంగా 8 జీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది. 64 జీబీ స్టోరేజ్ ఈ ఫోన్‌లో ఉంది. మైక్రో ఎస్‌డీ ద్వారా స్టోరేజ్‌ను 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. దీని మందం 0.91 సెంటీమీటర్లు కాగా, బరువు 188 గ్రాములుగా ఉంది.

View this post on Instagram
 
A post shared by Samsung India (@samsungindia)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Manchu Family Issue News : మనోజ్‌ను ఇంట్లో నుంచి గెంటేసిన విష్ణు - రెండు వర్గాల బౌన్సర్ల మధ్య ఘర్షణ - ఆత్మగౌరవ పోరాటమన్న మనోజ్
మనోజ్‌ను ఇంట్లో నుంచి గెంటేసిన విష్ణు - రెండు వర్గాల బౌన్సర్ల మధ్య ఘర్షణ - ఆత్మగౌరవ పోరాటమన్న మనోజ్
Satyavathi Rathod With ABP Desam: బిడ్డ ఆసుపత్రిలో ఉంటే తల్లి బ్యూటీపార్లర్‌కు వెళ్లినట్లుంది రేవంత్ పాలన- ఏబీపీ దేశంతో సత్యవతి రాథోడ్
బిడ్డ ఆసుపత్రిలో ఉంటే తల్లి బ్యూటీపార్లర్‌కు వెళ్లినట్లుంది రేవంత్ పాలన- ఏబీపీ దేశంతో సత్యవతి రాథోడ్
Kia Price Hike: జనవరి నుంచి పెరగనున్న కియా కార్ల ధరలు - ఎంత పెరగనున్నాయి?
జనవరి నుంచి పెరగనున్న కియా కార్ల ధరలు - ఎంత పెరగనున్నాయి?
Ram Gopal Varma Bail: డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మకు ఊరట- ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మకు ఊరట- ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ముంబయిలో బస్ బీభత్సం, ఏడుగురు మృతితండ్రి ఆరోపణలపై మంచు మనోజ్ ఫైర్Manchu Manoj vs Mohan babu | కరిగిన మంచు...ముదిరిన వివాదం | ABP DesamPushpa Day 4 Collections | రోజు రోజుకూ కలెక్షన్లు పెంచుకుంటున్న పుష్ప 2 | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Manchu Family Issue News : మనోజ్‌ను ఇంట్లో నుంచి గెంటేసిన విష్ణు - రెండు వర్గాల బౌన్సర్ల మధ్య ఘర్షణ - ఆత్మగౌరవ పోరాటమన్న మనోజ్
మనోజ్‌ను ఇంట్లో నుంచి గెంటేసిన విష్ణు - రెండు వర్గాల బౌన్సర్ల మధ్య ఘర్షణ - ఆత్మగౌరవ పోరాటమన్న మనోజ్
Satyavathi Rathod With ABP Desam: బిడ్డ ఆసుపత్రిలో ఉంటే తల్లి బ్యూటీపార్లర్‌కు వెళ్లినట్లుంది రేవంత్ పాలన- ఏబీపీ దేశంతో సత్యవతి రాథోడ్
బిడ్డ ఆసుపత్రిలో ఉంటే తల్లి బ్యూటీపార్లర్‌కు వెళ్లినట్లుంది రేవంత్ పాలన- ఏబీపీ దేశంతో సత్యవతి రాథోడ్
Kia Price Hike: జనవరి నుంచి పెరగనున్న కియా కార్ల ధరలు - ఎంత పెరగనున్నాయి?
జనవరి నుంచి పెరగనున్న కియా కార్ల ధరలు - ఎంత పెరగనున్నాయి?
Ram Gopal Varma Bail: డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మకు ఊరట- ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మకు ఊరట- ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
Fastest Mobile Internet: ప్రపంచంలో ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ అందించే టాప్-10 దేశాలు ఇవే!
ప్రపంచంలో ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ అందించే టాప్-10 దేశాలు ఇవే!
Mega Family vs Manchu Family: మెగా ఫ్యామిలీలో ఉన్న యూనిటీ మంచు ఫ్యామిలీలో లేదా? మరోసారి తెరపైకి కంపేరిజన్
మెగా ఫ్యామిలీలో ఉన్న యూనిటీ మంచు ఫ్యామిలీలో లేదా? మరోసారి తెరపైకి కంపేరిజన్
Nagababu Minister: త్వరలో మంత్రివర్గంలోకి నాగబాబు- పాత వీడియోలతో ఏకేస్తున్న వైసీపీ సోషల్ మీడియా 
త్వరలో మంత్రివర్గంలోకి నాగబాబు- పాత వీడియోలతో ఏకేస్తున్న వైసీపీ సోషల్ మీడియా 
Ram Charan - Salman Khan: రామ్ చరణ్ సినిమాలో సల్మాన్ ఖాన్ ఉన్నాడా? డైరెక్టర్ ఏం చెప్పాడంటే?
రామ్ చరణ్ సినిమాలో సల్మాన్ ఖాన్ ఉన్నాడా? డైరెక్టర్ ఏం చెప్పాడంటే?
Embed widget