Redmibook Pro 15: రెడ్‌మీ కొత్త ల్యాప్‌టాప్ వచ్చేసింది - అదిరిపోయే ఫీచర్లు - 16 జీబీ వరకు ర్యామ్!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షియోమీ తన కొత్త ల్యాప్‌టాప్ రెడ్‌మీ బుక్ ప్రో 15 (2022)ని లాంచ్ చేసింది.
రెడ్‌మీ బుక్ ప్రో 15 (2022) ల్యాప్‌టాప్‌ను కంపెనీ చైనాలో లాంచ్ చేసింది. ఇందులో 15.6 ఇంచెస్ భారీ డిస్‌ప్లేను అందించడం విశేషం. విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ల్యాప్‌టాప్ పనిచేయనుంది. 12వ తరం ఇంటెల్ ఐ5, ఐ7 ప్రాసెసర్‌లను ఇందులో అందించారు. 16 జీబీ వరకు ర్యామ్ వీటిలో ఉంది. 12 గంటల బ్యాటరీ లైఫ్‌ను ఇది అందించనుంది.
రెడ్‌మీ బుక్ ప్రో 15 (2022) ధర
దీని ధరను చైనాలో 5,599 యువాన్లుగా (సుమారు రూ.67,000) నిర్ణయించారు. ఇందులో 12వ జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్‌ను, ఇంటెట్ యూహెచ్‌డీ గ్రాఫిక్స్‌ను అందించారు. 12వ తరం ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్, ఎన్‌వీడియా జీఫోర్స్ ఆర్‌టీఎక్స్ 2050 వేరియంట్ ధర 6,799 యువాన్లుగా (సుమారు రూ.81,400) ఉంది. ఇక టాప్ ఎండ్ వేరియంట్ అయిన ఇంటెల్ కోర్ ఐ7 ప్రాసెసర్, ఎన్‌వీడియా జీఫోర్స్ 2050 జీపీయూని అందించారు. దీని ధర 7,499 యువాన్లుగా (సుమారు రూ.89,800) ఉంది. ఈ ల్యాప్‌టాప్ మనదేశంలో ఎప్పుడు లాంచ్ కానుందో తెలియరాలేదు.
రెడ్‌మీ బుక్ ప్రో 15 (2022) స్పెసిఫికేషన్లు
విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ల్యాప్‌టాప్ పనిచేయనుంది. ఇందులో 15.6 అంగుళాల ఐపీఎస్ స్క్రీన్‌ను అందించారు. దీని రిజల్యూషన్ 3,200x2,000 పిక్సెల్స్‌గా ఉంది. యాస్పెక్ట్ రేషియో 16:10గా ఉండగా, పీక్ బ్రైట్ నెస్ 400 నిట్స్‌గా ఉంది. 12వ తరం ఇంటెల్ కోర్ ఐ5, ఐ7 ప్రాసెసర్లు ఇందులో ఉన్నాయి.
16 జీబీ ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 512 జీబీ హైస్పీడ్ స్టోరేజ్ ఇందులో ఉంది. థండర్‌బోల్ట్ 4 పోర్టు ఇందులో ఉంది. డ్యూయల్ 4కే వీడియో అవుట్‌పుట్ కూడా ఇందులో ఉంది. హెచ్‌డీఎంఐ 2.0 పోర్టు, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ కూడా ఇందులో ఉన్నాయి.
బ్లూటూత్ వీ5.2ని ఇది సపోర్ట్ చేయనుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై 6 కనెక్టివిటీ కూడా ఇందులో ఉండనుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే ఏకంగా 12 గంటల బ్యాటరీ బ్యాకప్‌ను ఇది అందించనుంది. దీని మందం 1.5 సెంటీమీటర్లు కాగా... బరువు 1.8 కేజీలుగా ఉంది.
Also Read: యాపిల్ అత్యంత చవకైన 5జీ ఫోన్ వచ్చేసింది - లేటెస్ ప్రాసెసర్‌తో - ధర ఎంతంటే?
Also Read: కొత్త ఐప్యాడ్ వచ్చేసింది - అన్నీ లేటెస్ట్ ఫీచర్లే - ధర ఎంతంటే?