By: ABP Desam | Updated at : 20 Nov 2021 06:32 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
రియల్‌మీ జీటీ 2 ప్రో స్మార్ట్ ఫోన్ త్వరలో లాంచ్ కానుంది.
రియల్‌మీ జీటీ 2 ప్రో కీలక స్పెసిఫికేషన్లు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. ప్రముఖ టిప్‌స్టర్ తెలుపుతున్న దాని ప్రకారం.. ఈ రియల్‌మీ స్మార్ట్ ఫోన్‌లో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 898 ప్రాసెసర్ అందించనున్నారు. ఎల్పీడీడీఆర్5 ర్యామ్, యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ ఇందులో ఉండనున్నాయి. త్వరలో లాంచ్ కానున్న ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఆండ్రాయిడ్ 12 ఆధారిత రియల్‌మీ యూఐ 3.0 ఆపరేటింగ్ సిస్టం ఉండనుంది. డిస్‌ప్లే, కెమెరా, చార్జింగ్, కనెక్టివిటీ ఫీచర్లు అన్నీ రియల్‌మీ జీటీ 2 ప్రో తరహాలోనే ఉండనున్నాయి. ఈ నెల ప్రారంభంలో దీని ధర కూడా లీకైంది.
రియల్‌మీ జీటీ 2 ప్రో స్పెసిఫికేషన్లు(అంచనా)
వైల్యాబ్ అనే ప్రముఖ టిప్‌స్టర్ వీబోలో వేసిన పోస్ట్‌ను బట్టి ఇందులో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 898 ప్రాసెసర్ ఉండనుంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 888కు తర్వాతి వెర్షన్‌గా ఈ ప్రాసెసర్‌ను క్వాల్‌కాం లాంచ్ చేయనుంది. తాజాగా వచ్చిన లీకుల ప్రకారం ఇందులో ఎల్పీడీడీఆర్5 ర్యామ్, యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ కూడా ఉండనుంది.
ఈ టిప్‌స్టర్ తెలిపిన దాని ప్రకారం.. ఈ స్మార్ట్ ఫోన్ RMX 3301 మోడల్ నంబర్‌తో లాంచ్ కానుంది. ఇందులో 6.51 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లే ఉండనుంది. దీని డిస్‌ప్లే యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉండనుంది. ఎక్కువ రిఫ్రెష్ రేట్, 404 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ కూడా ఇందులో ఉండనుంది.
దీంతోపాటు ఇందులో వెనకవైపు ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్‌గా ఉండనుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్(ఓఐఎస్) ఫీచర్ కూడా ఇందులో అందించనున్నారు. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుంది.
ఈ ల్యాప్‌టాప్ 125W ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. అంటే దాదాపు అరగంటలోనే ఈ ఫోన్ పూర్తిగా చార్జ్ అయిపోతుందన్న మాట. వైఫై 6, బ్లూటూత్ వీ5.2 వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఇందులో అందించారు. ముందే చెప్పినట్లు ఆండ్రాయిడ్ 12 ఆధారిత రియల్‌మీ యూఐ 3.0 ఆపరేటింగ్ సిస్టం కూడా ఇందులో ఉండనుంది.
రియల్‌మీ జీటీ 2 ప్రో ధర(అంచనా)
ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ తెలిపిన దాని ప్రకారం.. ఈ ఫోన్ ధర 4,000 యువాన్ల(సుమారు రూ.46,500) రేంజ్‌లో ఉండనుంది. ఇందులో స్పెషల్ ఎడిషన్ కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది. దీని ధర 5,000 యువాన్లుగా(సుమారు రూ.58,200) ఉండనుందని సమాచారం. అయితే రియల్‌మీ దీని గురించి అధికారికంగా ప్రకటించలేదు.
Also Read: Infinix New Phone: రూ.6 వేలలోనే కొత్త స్మార్ట్‌ఫోన్.. 6000 ఎంఏహెచ్ బ్యాటరీ.. మిగతా ఫీచర్లు?
Also Read: Lava AGNI 5G: స్వదేశీ 5జీ ఫోన్ వచ్చేసింది.. ఇలా కొంటే రూ.2,000 తగ్గింపు!
Also Read: రూ.18 వేలలోపే 5జీ ఫోన్.. భారీ డిస్‌ప్లే కూడా!
Also Read: 7 అంగుళాల భారీ డిస్‌ప్లేతో హానర్ కొత్త ఫోన్.. అదిరిపోయే ఫీచర్లు.. 5జీ కూడా!
Phone in Rain: మీ మొబైల్ ఫోన్ వర్షంలో తడిచిపోయిందా? వెంటనే స్విచ్ ఆఫ్ చేసి, ఇలా చేయండి
Chinese Phone Ban: చైనాకు మోదీ భారీ షాక్! ఆ బడ్జెట్ ఫోన్లపై బ్యాన్!
రాఖీకి మీ సోదరికి మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా - అయితే ఈ ఆప్షన్లపై ఓ లుక్కేయండి!
కేవలం 12 నిమిషాల్లోనే 80 శాతం చార్జింగ్ - రియల్‌మీ కొత్త ఫోన్ లాంచ్‌కు రెడీ!
Vivo V25 Pro: బెస్ట్ ఫోన్లతో పోటీకి రెడీ అవుతున్న వివో - కెమెరాలు అయితే కేక!
Karthi Confirms Kaithi 2 : 'ఖైదీ' సీక్వెల్ కన్ఫర్మ్ చేసిన కార్తీ - విజయ్ సినిమాతో ముడి పడిన మేటర్ మరి
Warangal: ‘లాహిరి లాహిరిలో’ మూవీ సీన్ రిపీట్! ఎదురుపడ్డ ప్రత్యర్థులు - చివరికి ఎవరు నెగ్గారంటే?
KTR Tweet: నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో నీతి ఆయోగ్ లో నీతి కూడా అంతే: కేటీఆర్ సెటైర్లు
Godavari Floods: భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి - రెండో ప్రమాద హెచ్చరిక జారీ