Realme 9i: రియల్‌మీ కొత్త ఫోన్ ఫీచర్లు లీక్.. ధర రూ.15 వేలలోపే?
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ త్వరలో లాంచ్ చేయనున్న రియల్‌మీ 9ఐ స్మార్ట్ ఫోన్ ధర, ఫీచర్లు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి.
రియల్‌మీ 9ఐ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. ఈ ఫోన్ త్వరలోనే లాంచ్ కానుందని తెలుస్తోంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 50 మెగాపిక్సెల్ కెమెరా అందించనున్నట్లు తెలుస్తోంది. 2022 జనవరిలో ఈ ఫోన్ గ్లోబల్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
దీనికి సంబంధించిన ఇతర స్పెసిఫికేషన్లు కూడా ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. దీని ప్రకారం ఇందులో 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్న ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించనున్నారు. వెనకవైపు 50 మెగాపిక్సెల్ కెమెరా ఉండనున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు ఇందులో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 680 4జీ ప్రాసెసర్ కూడా ఉండనుంది.
రియల్‌మీ 9ఐ రెండర్లు కూడా ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. దీని డిజైన్ చూడటానికి రియల్‌మీ జీటీ నియో 2 తరహాలో ఉంది. వీటి ప్రకారం ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. దీంతోపాటు ఎల్ఈడీ ఫ్లాష్, సింగిల్ స్పీకర్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు కూడా ఉండనున్నాయి. అలాగే ఇందులో హోల్ పంచ్ డిస్‌ప్లే కూడా ఉండనుంది.
అయితే రియల్‌మీ 9ఐ గురించి కంపెనీ ఇటువంటి ప్రకటనా చేయలేదు. రియల్‌మీ 8ఐ కంటే దీని స్పెసిఫికేషన్లు కొంచెం అప్‌గ్రేడెడ్‌గానే ఉండే అవకాశం ఉంది. ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో రియల్‌మీ 8ఐ మార్కెట్లోకి వచ్చింది. ఇందులో బేస్ వేరియంట్ అయిన 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.13,999గా నిర్ణయించారు. దీన్ని బట్టి రియల్‌మీ 9ఐ ధర కూడా మనదేశంలో రూ.15 వేలలోపే ఉండే అవకాశం ఉంది.
రియల్‌మీ 8ఐ స్పెసిఫికేషన్లు చూస్తే.. ఇందులో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ96 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఫోన్ వెనకవైపు 50 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ముందువైపు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అందుబాటులో ఉంది.
ఇందులో 128 జీబీ స్టోరేజ్ ఉంది. దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 256 జీబీ స్టోరేజ్ వరకు పెంచుకోవచ్చు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 18W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది.
Also Read: Honor 60: 108 మెగాపిక్సెల్ కెమెరాతో హానర్ కొత్త ఫోన్.. వ్లాగర్ల కోసం ప్రత్యేక ఫీచర్ కూడా!
Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!
Also Read: Moto G51 5G: అత్యంత చవకైన మోటో 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. మరో వారంలో లాంచ్.. ధర ఎంతంటే?
Also Read: Redmi New Phone: రెడ్‌మీ కొత్త ఫోన్ వచ్చేసింది.. 8 జీబీ ర్యామ్.. ధర ఎంతంటే?
Also Read: Lava AGNI 5G: స్వదేశీ 5జీ ఫోన్ వచ్చేసింది.. ఇలా కొంటే రూ.2,000 తగ్గింపు!