OnePlus Y1S TV Series: వన్‌ప్లస్ స్మార్ట్‌టీవీలు వచ్చేస్తున్నాయి.. రూ.25 వేలలోపే!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ మనదేశంలో త్వరలో వై1ఎస్ స్మార్ట్ ఫోన్లు లాంచ్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
వన్‌ప్లస్ తన వై1ఎస్ టీవీ సిరీస్‌ను త్వరలో మనదేశంలో లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త స్మార్ట్ టీవీలు రెండు డిస్‌ప్లే సైజుల్లో రానున్నాయని సమాచారం. దీంతోపాటు వీటి ధర, కీలక స్పెసిఫికేషన్లు కూడా లీకయ్యాయి. 32, 43 అంగుళాల సైజుల్లో హెచ్‌డీఆర్10+ సపోర్ట్‌తో ఈ టీవీలు లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది.
వన్‌ప్లస్ వై1ఎస్ టీవీ ధర
ఇప్పటివరకు లీకైన వివరాల ప్రకారం.. ఈ టీవీల ధర రూ.25 వేల ధరలోపే ఉండే అవకాశం ఉంది. అయితే సరిగ్గా ఏరోజు లాంచ్ అవుతుందో మాత్రం తెలియరాలేదు. వన్‌ప్లస్ కూడా ఈ టీవీల లాంచ్‌ను అధికారికంగా ప్రకటించలేదు.
వన్‌ప్లస్ వై1ఎస్ టీవీ స్పెసిఫికేషన్లు
ఇందులో 32 అంగుళాలు, 43 అంగుళాల వేరియంట్లు ఉండనున్నాయని తెలుస్తోంది. ఆండ్రాయిడ్ టీవీ 11 ఆధారిత కస్టం స్కిన్‌పై ఈ టీవీలు పనిచేయనున్నాయి. వీటిలో హెచ్‌డీఆర్10+ ఫీచర్ అందించనున్నారు. డాల్బీ అట్మాస్, అట్మాస్ రికార్డింగ్ ఫీచర్లు కూడా ఇందులో ఉండనున్నట్లు సమాచారం. వీటిలో 20W స్పీకర్లు ఉండనున్నాయి. వీటిలో డ్యూయల్ బ్యాండ్ వైఫై కనెక్టివిటీ ఉండనున్నట్లు తెలుస్తోంది.
దీంతోపాటు వన్‌ప్లస్ 10 ప్రో కూడా మనదేశంలో త్వరలో లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ప్రస్తుతానికి చైనాలో మాత్రమే అందుబాటులో ఉంది. మనదేశంలో, యూరోప్‌లో మార్చిలో లాంచ్ కానుందని వార్తలు వస్తున్నాయి. ఫీచర్లు మాత్రం చైనా వేరియంట్ తరహాలోనే ఉండే అవకాశం ఉంది.
OnePlus TV Y1s will launch soon in india🇮🇳
— Technical Gaadhe (@SameerGaadhe) January 18, 2022
32"/43" HDR10+
Android TV 11.0
Dolby Audio (with Atmos decoding) 20W speakers
dual-band Wi-Fi#oneplus #oneplusY1s #TV #oneplusTV pic.twitter.com/6UdGfxeufp
Exclusive: New OnePlus budget TVs coming to India.
— Ishan Agarwal (@ishanagarwal24) January 18, 2022
The OnePlus TV Y1S Series will have two screen sizes: 32" & 43"
Upgrades include Android TV 11, Dual Band WiFi & Dolby Atmos decoding.
Please link: https://t.co/oakTlwn1Ve
Also Read: Realme 9i: రూ.14 వేలలోపే రియల్‌మీ కొత్త ఫోన్.. సూపర్ అనిపించే ఫీచర్లు.. లేటెస్ట్ ప్రాసెసర్ కూడా!
Also Read: Samsung Offers: గుడ్‌న్యూస్.. ఈ శాంసంగ్ ఫోన్ ధర తగ్గింపు.. ఇప్పుడు రూ.13 వేలలోపే!