OnePlus New Update: ఆ సమస్యను పరిష్కరించిన వన్‌ప్లస్.. మళ్లీ వచ్చిన ఆక్సిజన్ఓఎస్!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ తన 9 సిరీస్ ఫోన్లకు ఆక్సిజన్ ఓఎస్ 12 అప్‌డేట్‌ను తిరిగి అందించింది.
వన్‌ప్లస్ 9, వన్‌ప్లస్ 9 ప్రోలకు ఆక్సిజన్ఓఎస్ 12 అప్‌డేట్‌ను తిరిగి అందిస్తుంది. గతంలో ఆపరేటింగ్ సిస్టంలో చాలా లోపాలు ఉన్నందున వాటిని సరిచేసే వరకు అప్‌డేట్‌ను కంపెనీ నిలిపివేసింది. దీనికి సంబంధించిన స్టేట్‌మెంట్‌ను కూడా వన్‌ప్లస్ గతంలో విడుదల చేసింది. ఇప్పుడు ఈ అప్‌డేట్‌ను తిరిగి ప్రారంభించింది. శాంసంగ్ కూడా గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3, గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3 స్మార్ట్ ఫోన్లకు ఈ అప్‌డేట్ అందించింది.
ఇంతకుముందు వచ్చిన అప్‌డేట్‌లో ముందుగా తెలిపిన ఫీచర్లు అందించలేదని, వినియోగదారులు కంప్లైంట్ చేశారు. దీంతోపాటు అంతకుముందు ఉన్న కొన్ని ఫీచర్లను తీసేశారని వినియోగదారులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇందులో బోలెడన్ని బగ్స్ ఉన్నాయని గుర్తించిన కంపెనీ ఆ అప్‌డేట్‌ను తాత్కాలికంగా నిలిపివేసి సమస్యలను ఫిక్స్ చేసింది. మొబైల్ డేటా కనెక్టివిటీ, నోటిఫికేషన్లు, ఫోన్ స్టక్ అవ్వడం వంటి సమస్యలు కూడా గతంలో తలెత్తాయి.
మనదేశంలో వన్‌ప్లస్ 9 వినియోగదారులకు LE2111_11_C.39 మోడల్ నంబర్, వేరే దేశంలో వినియోగదారులకు LE2115_11_C.39 మోడల్ నంబర్‌తో ఈ అప్‌డేట్ వచ్చింది. మనదేశంలో వన్‌ప్లస్ 9 ప్రోకు LE2111_11_C.39 మోడల్ నంబర్, వేరే దేశంలో వినియోగదారులకు LE2115_11_C.39 మోడల్ నంబర్‌తో ఈ అప్‌డేట్‌ను అందించారు.
ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా ఆక్సిజన్ ఓఎస్ 12 అప్‌డేట్‌ను కంపెనీ రూపొందించింది. దీంతోపాటు డిసెంబర్ 2021 ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ కూడా అందించనున్నారు. ఇంతకు ముందు వచ్చిన అప్‌డేట్‌లో యాప్ హైబర్నేషన్, మైక్రోఫోన్, కెమెరా ఇండికేటర్లు వంటి ఫీచర్లు అందించారు. ఈ అప్‌డేట్‌లో కొన్ని ఫీచర్లు అందుబాటులో లేవని వినియోగదారులు ఫిర్యాదు చేస్తున్నారు.
వన్‌ప్లస్ 9, వన్‌ప్లస్ 9 ప్రోలకు ఆక్సిజన్ఓఎస్ 12 అప్‌డేట్‌ను కంపెనీ నిలిపివేసిందని ఆండ్రాయిడ్ పోలీస్ గతంలోనే తన కథనంలో పేర్కొంది. ‘ఆక్సిజన్ ఓఎస్ 12 అప్‌డేట్ ద్వారా వినియోగదారులకు కొన్ని సమస్యలు తలెత్తిన సంగతి మా దృష్టికి వచ్చింది. ప్రస్తుతం ఉన్న అప్‌డేట్‌ను నిలిపివేసి.. కొత్త అప్‌డేట్‌ను అందిస్తాం.’ అని వన్‌ప్లస్ అంతకుముందు ఇచ్చిన ప్రకటనలో పేర్కొంది. ఇప్పుడు ఆ అప్‌డేట్‌లోని బగ్స్‌ను కంపెనీ ఫిక్స్ చేసింది.
Also Read: Jio 1 Rs Recharge Plan: రూ.1కే జియో రీచార్జ్ ప్లాన్.. లాభాలు ఏంటంటే?
Also Read: Honor 60: 108 మెగాపిక్సెల్ కెమెరాతో హానర్ కొత్త ఫోన్.. వ్లాగర్ల కోసం ప్రత్యేక ఫీచర్ కూడా!
Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!
Also Read: Moto G51 5G: అత్యంత చవకైన మోటో 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. మరో వారంలో లాంచ్.. ధర ఎంతంటే?
Also Read: Redmi New Phone: రెడ్‌మీ కొత్త ఫోన్ వచ్చేసింది.. 8 జీబీ ర్యామ్.. ధర ఎంతంటే?
Also Read: Lava AGNI 5G: స్వదేశీ 5జీ ఫోన్ వచ్చేసింది.. ఇలా కొంటే రూ.2,000 తగ్గింపు!