By: ABP Desam | Updated at : 17 Jan 2022 06:25 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
అమెజాన్‌లో వన్‌ప్లస్ 9ఆర్‌టీ స్మార్ట్ ఫోన్ సేల్ ప్రారంభం అయింది. (Image Credit: OnePlus)
వన్‌ప్లస్ 9ఆర్‌టీ స్మార్ట్ ఫోన్ సేల్ మనదేశంలో ప్రారంభం అయింది. ఈ ఫోన్ ఇటీవలే మనదేశంలో లాంచ్ అయింది. వన్‌ప్లస్ 9 సిరీస్‌లో ఇది తాజా స్మార్ట్ ఫోన్. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కూడా ఇందులో అందించారు.
వన్‌ప్లస్ 9ఆర్‌టీ ధర
ఇందులో రెండు వేరియంట్లు లాంచ్ అయ్యాయి. వీటిలో 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.42,999గా ఉంది. 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను వన్‌ప్లస్ రూ.46,999గా నిర్ణయించింది. హ్యాకర్ బ్లాక్, నానో సిల్వర్ రంగుల్లో వన్‌ప్లస్ 9ఆర్‌టీ కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్‌ను అమెజాన్‌లో ఎస్‌బీఐ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ.4,000 తగ్గింపు లభించనుంది.
వన్‌ప్లస్ 9ఆర్‌టీ ఫీచర్లు
ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఆక్సిజన్ఓఎస్ 11 ఆపరేటింగ్ సిస్టంపై వన్‌ప్లస్ 9ఆర్‌టీ పనిచేయనుంది. 6.62 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ శాంసంగ్ ఈ4 అమోఎల్ఈడీ డిస్‌ప్లేను ఈ స్మార్ట్ ఫోన్‌లో అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది.హెచ్‌డీఆర్10+ సపోర్ట్ కూడా ఇందులో కంపెనీ అందించింది.
ఈ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్‌గా ఉంది. 65W ఫాస్ట్ చార్జింగ్‌ను వన్‌ప్లస్ 9ఆర్‌టీ సపోర్ట్ చేయనుంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌పై వన్‌ప్లస్ 9ఆర్‌టీ పనిచేయనుంది. 12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ కూడా ఇందులో ఉంది. స్మార్ట్ ఫోన్‌ను ఆటోమేటిక్‌గా కూల్ చేసే స్పేస్ కూలింగ్ టెక్నాలజీ కూడా ఇందులో కంపెనీ అందించింది.
ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరాగా 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్766 సెన్సార్ అందుబాటులో ఉంది. దీంతోపాటు 16 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ కూడా ఇందులో ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫోన్ ముందువైపు 16 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్471 సెన్సార్‌ను అందించారు. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్ వీ5.2, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ సపోర్ట్ కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ మందం 0.83 సెంటీమీటర్లు కాగా, బరువు 198.5 గ్రాములుగా ఉంది.
Also Read: Vivo Y01 Price Leaked: వివో కొత్త ఫోన్ ధర, ఫీచర్లు లీక్.. రూ.10 వేలలోపే!
Also Read: Samsung Offers: గుడ్‌న్యూస్.. ఈ శాంసంగ్ ఫోన్ ధర తగ్గింపు.. ఇప్పుడు రూ.13 వేలలోపే!
Also Read: Cheapest 5G Phone: వేడెక్కుతున్న 5జీ మార్కెట్.. రూ.20 వేలలోపే మరో 5జీ ఫోన్!
Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!
Oppo A57 2022: రూ.13 వేలలోపే ఒప్పో కొత్త ఫోన్ - ఫీచర్లు ఎలా ఉన్నాయో చూశారా?
Boat Wave Neo: రూ.1,800లోపే అదిరిపోయే స్మార్ట్ వాచ్ - లాంచ్ చేసిన భారతీయ బ్రాండ్!
Realme C30: రూ.10 వేలలోపే రియల్మీ కొత్త ఫోన్ - లాంచ్ వచ్చే నెలలోనే?
Moto E32s: మోటొరోలా కొత్త బడ్జెట్ ఫోన్ వచ్చేసింది - ధర రూ.13 వేలలోపే!
Nothing Phone 1: మోస్ట్ అవైటెడ్ స్మార్ట్ ఫోన్ ధర లీక్ - లాంచ్ డేట్ కూడా!
Bandi Sanjay : కేంద్రాన్ని బదనాం చేస్తున్న కేసీఆర్ సర్కార్ ను కడిగేయండి, పార్టీ నేతలకు బండి సంజయ్ దిశానిర్దేశం
Writer Review - 'రైటర్' రివ్యూ: హెడ్ కానిస్టేబుల్ కేసులో ఇరుక్కుంటే? - ఆహాలో విడుదలైన సముద్రఖని సినిమా ఎలా ఉందంటే?
TS Police Jobs : తెలంగాణ పోలీస్ ఉద్యోగాలకు భారీ స్పందన, 17 వేల పోస్టులకు 12.91 లక్షల అప్లికేషన్లు
Rashmika Mandanna: బ్లాక్ డ్రెస్ లో రష్మిక - ఫొటోలు వైరల్