Mike Tyson Vs Jake Paul: సరైన టైమ్‌లో హ్యాండిచ్చిన నెట్‌ఫ్లిక్స్ - విరుచుకుపడుతున్న నెటిజన్లు!
Netflix Outage: మైక్ టైసన్, జేక్ పాల్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. కానీ ఈ మ్యాచ్ జరుగుతున్నప్పుడు నెట్‌ఫ్లిక్స్ క్రాష్ అవ్వడంతో వినియోగదారులు ఇబ్బందులు పడ్డారు.
Netflix Crash: మైక్ టైసన్, జేక్ పాల్ మధ్య హై వోల్టేజ్ బాక్సింగ్ మ్యాచ్ జరగడానికి ముందు చాలా మంది నెట్‌ఫ్లిక్స్ యూజర్లు భారతదేశం, యూఎస్‌లో నెట్‌ఫ్లిక్స్‌ను చూడటంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సర్వీస్ అంతరాయాలను ట్రాక్ చేసే డౌన్‌డెటెక్టర్ అనే వెబ్‌సైట్ ప్రకారం భారతదేశం, యూఎస్‌లో నెట్‌ఫ్లిక్స్ డౌన్ అయినట్లు చాలా రిపోర్ట్స్ వచ్చాయి.
ఈ విషయంపై నెట్‌ఫ్లిక్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. నెట్‌ఫ్లిక్స్ డౌన్ అయిన వెంటనే #NetflixCrash అనే హ్యాష్ ట్యాగ్ భారతదేశంలో ట్రెండ్ అవ్వడం ప్రారంభం అయింది. ఈ అవుటేజ్ అనేది విస్తృతంగా కనిపించనప్పటికీ భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లోని వినియోగదారులు వీడియో స్ట్రీమింగ్, యాప్, వెబ్‌సైట్ వినియోగంలో సమస్యలను ఎదుర్కొంటున్నారు. డౌన్‌డెటెక్టర్ ప్రకారం యూఎస్ నుంచి నెట్‌ఫ్లిక్స్ డౌన్ అయినట్లు 95,324 రిపోర్ట్స్ అందగా భారతదేశంలో 1,310 రిపోర్ట్స్ వచ్చాయి.
Also Read: 1.77 కోట్ల సిమ్ కార్డులు బ్లాక్ చేసిన ట్రాయ్ - మీ సిమ్ బ్లాక్ అయిందేమో చూసుకోండి!
భారతదేశంలో నెట్‌ఫ్లిక్స్ గురించి వచ్చిన ఫిర్యాదులు ఇవే...
వీడియో స్ట్రీమింగ్ విషయంలో 86 శాతం
యాప్‌లు విషయంలో 8 శాతం
వెబ్‌సైట్ విషయంలో 6 శాతం
అమెరికాలో నెట్‌ఫ్లిక్స్ గురించి వచ్చిన ఫిర్యాదులు ఇవే...
వీడియో స్ట్రీమింగ్ 88 శాతం
సర్వర్ కనెక్షన్లు విషయంలో 11 శాతం
లాగిన్ సమస్యలు విషయంలో 1 శాతం
వినియోగదారులు ఏం అంటున్నారు?
మైక్ టైసన్ వర్సెస్ జేక్ పాల్ మ్యాచ్‌కు కొన్ని గంటల ముందు ఈ అంతరాయం వినియోగదారులకు కోపం, నిరాశను మిగిల్చింది. చాలా మంది వినియోగదారులు తమ అనుభవాలను ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో షేర్ చేశారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మ్యాచ్ నవంబర్ 16వ తేదీన టెక్సాస్‌లోని ఏటీ అండ్ టీ స్టేడియంలో జరుగుతుంది. నెట్‌ఫ్లిక్స్‌లో లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది.
ఇంతకు ముందు ఎప్పుడు డౌన్ అయింది?
ఇంత పెద్ద ఈవెంట్ సమయంలో ఇలా నెట్‌ఫ్లిక్స్ డౌన్ అవ్వడం వినియోగదారులకు చాలా అసౌకర్యంగా ఉంది. అయితే ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదు. గత సంవత్సరం అంటే 2023లో డిసెంబర్ 12వ తేదీన నెట్‌ఫ్లిక్స్ ఒక పెద్ద గ్లోబల్ సమస్యను ఎదుర్కొంది. దీని కారణంగా సర్వీసులకు దాదాపు మూడు గంటలపాటు అంతరాయం కలిగింది. డెస్క్‌టాప్ వినియోగదారులు కూడా చాలా సమస్యలను ఎదుర్కొన్నారు. మొబైల్, టీవీ యూజర్లపై తక్కువ ఎఫెక్ట్ పడింది. ఆ సమయంలో డౌన్‌డెటెక్టర్‌పై 20,000కు పైగా ఫిర్యాదులు నమోదయ్యాయి. నెట్‌ఫ్లిక్స్ దీనిని "సాంకేతిక సమస్య" అని పేర్కొంది. కాసేపట్లోనే నెట్‌ఫ్లిక్స్ తన సర్వర్లను తిరిగి రీస్టోర్ చేసింది.
Also Read: రూ.11కే 10 జీబీ డేటా - బెస్ట్ ప్లాన్ తెచ్చిన జియో - కానీ వ్యాలిడిటీ మాత్రం!
300 Mbps network speed, Netflix needs to answer for this, not advising users. The live feed is pathetic, and they’re telling us to check our internet? What a joke. #TysonPaul #MikeTyson #NetflixIsTrash #Netflix #NetflixFight #netflixcrash pic.twitter.com/uICoQsBVwU
— Naga Udaya Bhaskar Prabhala (@geekybhaskar) November 16, 2024