X

Moto G31: రూ.13 వేలలోపే ఓఎల్ఈడీ డిస్‌ప్లే.. అదిరిపోయే ఫోన్ లాంచ్ చేసిన మోటో!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మోటొరోలా మనదేశంలో మోటో జీ31 స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. ఇందులో ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు.

FOLLOW US: 

మోటో జీ31 స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. ఇందులో మీడియాటెక్ ప్రాసెసర్‌ను అందించారు. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. 50 మెగాపిక్సెల్ కెమెరాను ఇందులో ప్రధాన సెన్సార్‌గా అందించారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫోన్ అన్‌లాక్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

మోటో జీ31 ధర
ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999గా ఉంది. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.14,999గా నిర్ణయించారు. ఫ్లిప్‌కార్ట్‌లో డిసెంబర్ 6వ తేదీ నుంచి ఈ ఫోన్ సేల్ ప్రారంభం కానుంది. బేబీ బ్లూ, మీటియోరైట్ గ్రే రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

మోటో జీ31 స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 11 స్టాక్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.4 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఓఎల్ఈడీ పంచ్ హోల్ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 60 హెర్ట్జ్‌గా ఉంది. యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది. 6 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు.

దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 20W టర్బోపవర్ ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. దీని మందం 0.84 సెంటీమీటర్లుగానూ, బరువు 180 గ్రాములుగానూ ఉంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్‌గా ఉంది. దీంతోపాటు 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ కూడా ఉన్నాయి. ఇందులో ఎల్ఈడీ ఫ్లాష్ కూడా ఉంది. డ్యూయల్ క్యాప్చర్, స్పాట్ కలర్, నైట్ విజన్, పొర్‌ట్రెయిట్, లైవ్ ఫిల్టర్, ఏఆర్ స్టిక్కర్లు, ప్రో మోడ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ముందువైపు 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు.

4జీ ఎల్టీఈ, ఎఫ్ఎం రేడియో, 3.5 ఎంఎం ఆడియో జాక్, బ్లూటూత్ వీ5, డ్యూయల్ బ్యాండ్ వైఫై, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, జీపీఎస్, గ్లోనాస్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో అందించారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. ప్రాక్సిమిటీ సెన్సార్, యాక్సెలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, సార్ సెన్సార్, గైరోస్కోప్, ఈ-కంపాస్ కూడా ఇందులో మోటొరోలా అందించింది.

Also Read: ఈ సూపర్ ఇయర్‌బడ్స్ ధర భారీ తగ్గింపు.. ఏకంగా రూ.వేయికి పైగా.. ఇప్పుడు ఎంతంటే?

Also Read: రూ.17 వేలలోనే రెడ్‌మీ సూపర్ 5జీ ఫోన్.. త్వరలో మార్కెట్లోకి!

Also Read: OnePlus RT: మనదేశంలో వన్‌ప్లస్ కొత్త ఫోన్.. ఫీచర్లు సూపర్.. ధర ఎంతంటే?

Also Read: Xiaomi 12: ఒకే ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ కెమెరా, మూడు 48 మెగాపిక్సెల్ కెమెరాలు.. అదిరిపోయే మొబైల్ వచ్చేస్తుంది!

Also Read: Lava AGNI 5G: స్వదేశీ 5జీ ఫోన్ వచ్చేసింది.. ఇలా కొంటే రూ.2,000 తగ్గింపు!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: Motorola Moto New Phone Moto G31 Launched Moto Moto G31 India Launch Moto G31 Moto G31 Price in India Moto G31 SPecifications Moto G31 Features

సంబంధిత కథనాలు

Amazon Smartphone Offers: అమెజాన్‌లో రూ.15 వేలలోపు బెస్ట్ ఫోన్లు ఇవే.. అదిరిపోయే డీల్స్!

Amazon Smartphone Offers: అమెజాన్‌లో రూ.15 వేలలోపు బెస్ట్ ఫోన్లు ఇవే.. అదిరిపోయే డీల్స్!

Xiaomi 11T Pro Launched: 17 నిమిషాల్లోనే పూర్తి చార్జింగ్.. షియోమీ అదిరిపోయే కొత్త ఫోన్.. ప్రారంభ సేల్‌లో రూ.10 వేలు ఆఫర్!

Xiaomi 11T Pro Launched: 17 నిమిషాల్లోనే పూర్తి చార్జింగ్.. షియోమీ అదిరిపోయే కొత్త ఫోన్.. ప్రారంభ సేల్‌లో రూ.10 వేలు ఆఫర్!

Amazon offer on Tecno Pop 5: అత్యంత చౌక స్మార్ట్‌ఫోన్‌.. Rs. 5,670కే టెక్నోపాప్‌ 5.. ఫీచర్లివే!

Amazon offer on Tecno Pop 5: అత్యంత చౌక స్మార్ట్‌ఫోన్‌.. Rs. 5,670కే టెక్నోపాప్‌ 5.. ఫీచర్లివే!

Amazon Offers upto 40% off: బెస్ట్‌ సెల్లింగ్‌ మొబైల్స్‌పై మళ్లీ దొరకని ఆఫర్లు.. ఓ లుక్కేయండి!

Amazon Offers upto 40% off: బెస్ట్‌ సెల్లింగ్‌ మొబైల్స్‌పై మళ్లీ దొరకని ఆఫర్లు.. ఓ లుక్కేయండి!

Vivo T1 5G: వివో టీ1 5జీ వచ్చేస్తుంది.. ఆ ఫోన్లు ఇక కనిపించవు!

Vivo T1 5G: వివో టీ1 5జీ వచ్చేస్తుంది.. ఆ ఫోన్లు ఇక కనిపించవు!

టాప్ స్టోరీస్

Lavanya Tripathi: మెగా హీరోతో పెళ్లి పుకార్లకు పరోక్షంగా... తెలివిగా సమాధానం ఇచ్చిన లావణ్యా త్రిపాఠీ!?

Lavanya Tripathi: మెగా హీరోతో పెళ్లి పుకార్లకు పరోక్షంగా... తెలివిగా సమాధానం ఇచ్చిన లావణ్యా త్రిపాఠీ!?

Pushpa Memes: ‘మాస్క్’ తీసేదేలే.. ‘పుష్ప’ పోస్టర్‌తో కేంద్రం వినూతన ప్రచారం.. ఇలా కూడా వాడేస్తారా!

Pushpa Memes: ‘మాస్క్’ తీసేదేలే.. ‘పుష్ప’ పోస్టర్‌తో కేంద్రం వినూతన ప్రచారం.. ఇలా కూడా వాడేస్తారా!

AP Corona Cases: ఆంధ్రప్రదేశ్ లో కరోనా కల్లోలం.. కొత్తగా 10 వేలకుపైగా కేసులు నమోదు..

AP Corona Cases: ఆంధ్రప్రదేశ్ లో కరోనా కల్లోలం.. కొత్తగా 10 వేలకుపైగా కేసులు నమోదు..

Health News: పారాసెటమాల్, డోలో మాత్రలు అతిగా మింగేస్తున్నారా? ఏది ఎంత మోతాదులో తీసుకోవాలో తెలుసుకోండి

Health News: పారాసెటమాల్, డోలో మాత్రలు అతిగా మింగేస్తున్నారా? ఏది ఎంత మోతాదులో తీసుకోవాలో తెలుసుకోండి