By: ABP Desam | Updated at : 11 May 2022 06:30 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
జెడ్‌టీఈ యాక్సాన్ 40 అల్ట్రా స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. (Image Credits: ZTE)
జెడ్‌టీఈ యాక్సాన్ 40 అల్ట్రా స్మార్ట్ ఫోన్ చైనాలో లాంచ్ అయింది. ఇందులో అండర్ డిస్‌ప్లే సెల్ఫీ కెమెరా, వెనకవైపు మూడు 64 మెగాపిక్సెల్ కెమెరాలు ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. కర్వ్‌డ్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేతో ఈ ఫోన్ తీసుకువచ్చారు. గతంలో లాంచ్ అయిన యాక్సాన్ 30 సిరీస్‌కు తర్వాతి వెర్షన్‌గా ఇవి లాంచ్ అయ్యాయి.
జెడ్‌టీఈ యాక్సాన్ 40 అల్ట్రా ధర
8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ ఉన్న బేస్ వేరియంట్ ధరను 4,998 యువాన్లుగా (సుమారు రూ.57,500) నిర్ణయించారు. మిగతా వేరియంట్ల ధర ఇంకా ప్రకటించలేదు. బ్లాక్, సిల్వర్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. మనదేశంలో ఈ ఫోన్ లాంచ్ అవుతుందో లేదో తెలియరాలేదు.
జెడ్‌టీఈ యాక్సాన్ 40 అల్ట్రా స్పెసిఫికేషన్లు
ఇందులో 6.8 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ కర్వ్‌డ్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 20:9గానూ, స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గానూ ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 16 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 1 టీబీ వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ ఇందులో ఉన్నాయి.
ఆండ్రాయిడ్ 12 ఆధారిత మైఓఎస్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు. డీటీఎస్ ఎక్స్ అల్ట్రా టెక్నాలజీ ఉన్న డ్యూయల్ స్టీరియో స్పీకర్లు జెడ్‌టీఈ యాక్సాన్ 40 అల్ట్రాలో ఉన్నాయి. ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఇందులో అందించడం విశేషం.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు 64 మెగాపిక్సెల్ కెమెరాలు ఉన్నాయి. వీటిలో ఒకటి ప్రధాన కెమెరా కాగా... మరొకటి వైడ్ యాంగిల్ లెన్స్, ఇంకోటి పెరిస్కోపిక్ టెలిఫొటో లెన్స్. ముందువైపు అండర్ డిస్‌ప్లే కెమెరాను జెడ్‌టీఈ ఇందులో అందించడం విశేషం.
Moto G52j: మోటొరోలా కొత్త ఫోన్ వచ్చేసింది - అదిరిపోయే ఫీచర్లు - ఫోన్ ఎలా ఉందో చూశారా?
Lava Z3 Pro: రూ.8 వేలలోపే లావా కొత్త ఫోన్ - ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
Redmi Note 11T: రెడ్మీ నోట్ 11టీ సిరీస్ వచ్చేస్తుంది - బడ్జెట్ ధరలోనే సూపర్ 5జీ ఫోన్లు!
Vivo Y75: వివో కొత్త ఫోన్ వచ్చేసింది - అదిరిపోయే ఫీచర్లు - ధర ఎంతంటే?
OnePlus Nord 2T: వన్‌ప్లస్ నార్డ్ 2టీ వచ్చేసింది - సూపర్ కెమెరాలు, వేగవంతమైన ప్రాసెసర్ - ఎలా ఉందో చూశారా?
Whatsapp End Support: ఈ ఫోన్లకు వాట్సాప్ ఇక పనిచేయదు - అధికారికంగా తెలిపిన మెటా - మీ మొబైల్స్ ఉన్నాయేమో చూసుకోండి!
Minister Harish Rao : కొండాపూర్ ఏరియా ఆసుపత్రిలో మంత్రి హరీశ్ రావు, డబ్బులడిగిన డాక్టర్ పై వేటు!
Pawan Kalyan: సిరివెన్నెలను గుర్తు చేసుకున్న పవన్ కళ్యాణ్
MP Raghurama Krishn Raju : ఎంపీ రఘురామ అనర్హత పిటిషన్ పై విచారణ, ప్రివిలేజ్ కమిటీ ఎదుట మార్గాని భరత్ హాజరు!