Redmi: ఈ రెడ్‌మీ ఫోన్లు వాడుతున్నారా - అయితే కొత్త ఫోన్లు కొనాల్సిందే!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షియోమీ కొన్ని పాత ఫోన్లకు సపోర్ట్ నిలిపివేయనున్నట్లు ప్రకటించింది.
![Redmi: ఈ రెడ్‌మీ ఫోన్లు వాడుతున్నారా - అయితే కొత్త ఫోన్లు కొనాల్సిందే! Xiaomi Released End of Support Smartphones List including Redmi Note 7 Series K20 Redmi: ఈ రెడ్‌మీ ఫోన్లు వాడుతున్నారా - అయితే కొత్త ఫోన్లు కొనాల్సిందే!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/02/cab5d1f26249711ef7e9bf4116c84314_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
రెడ్‌మీ నోట్ 7, రెడ్‌మీ కే20, రెడ్‌మీ 7, ఎంఐ ప్లే, ఎంఐ 9 ఎస్ఈ సహా కొన్ని స్మార్ట్ ఫోన్లకు షియోమీ సపోర్ట్‌ను నిలిపివేయనుంది. సాఫ్ట్‌వేర్, ఫర్మ్‌వేర్ అప్‌డేట్లు నిలిచిపోయిన స్మార్ట్ ఫోన్ల జాబితాను కంపెనీ విడుదల చేసింది. ఈ ఫోన్లకు సెక్యూరిటీ అప్‌డేట్లను కూడా అందించబోవడం లేదు.
ఎండ్ ఆఫ్ సపోర్ట్ లిస్ట్‌లో ఉన్న స్మార్ట్ ఫోన్లకు సెక్యూరిటీకి సంబంధించిన సమస్యలు ఎదురైనా కంపెనీ స్పందించదు. కాబట్టి సపోర్ట్ సిస్టం ఎండ్ అయిన స్మార్ట్ ఫోన్లు ఉపయోగించకుండా కొత్త ఫోన్లు కొనడం బెటర్. ఎందుకంటే సపోర్ట్ సిస్టం ఎండ్ అయిన ఫోన్లకు సెక్యూరిటీ అప్‌డేట్స్ రాకపోవడం వల్ల డేటా లీక్, ఫోన్ హ్యాక్ వంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. లాంచ్ అయిన రెండు సంవత్సరాల వరకు షియోమీ తన స్మార్ట్ ఫోన్లకు నెలవారీ లేదా త్రైమాసిక సెక్యూరిటీ అప్‌డేట్లను అందిస్తుంది.
ఈ ఎండ్ ఆఫ్ సపోర్ట్ లిస్ట్‌లో రెడ్‌మీ కే20, రెడ్‌మీ నోట్ 7 ప్రో, రెడ్‌మీ నోట్ 7ఎస్, రెడ్‌మీ నోట్ 7, రెడ్‌మీ 7, రెడ్‌మీ వై3, ఎంఐ ప్యాడ్ 4, ఎంఐ ప్యాడ్ 4 ప్లస్, ఎంఐ ప్లే, ఎంఐ 9 ఎస్ఈ ఉన్నాయి. వీటికి ఎంఐయూఐ 13 అప్‌డేట్‌ను కంపెనీ అందించదు. ఈ జాబితాలో రెడ్‌మీ నోట్ 7 సిరీస్, రెడ్‌మీ కే20లు పాపులర్ స్మార్ట్ ఫోన్లు.
ఎంఐయూఐ 12.5 ఆపరేటింగ్ సిస్టంకు తర్వాతి వెర్షన్‌గా ఎంఐయూఐ 13 లాంచ్ అయింది. ఈ కస్టం స్కిన్ డివైసెస్‌లో డీఫ్రాగ్మెంటేషన్ సామర్థ్యాన్ని పెంచుకుంది. అంటే స్మార్ట్ ఫోన్ మరింత మెరుగ్గా పనిచేస్తుందన్న మాట. మెరుగైన పెర్ఫార్మెన్స్, సరికొత్త డిజైన్, మల్టీటాస్కింగ్ ఫీచర్లను కంపెనీ ఇందులో అందించే అవకాశం ఉంది. ఇందులో కొత్త సిస్టం లెవల్ ఫైల్ స్టోరేజ్ సిస్టంను అందించారు. దీనికి లిక్విడ్ స్టోరేజ్ అని పేరు పెట్టారు.
Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?
Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)