News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Xiaomi 12 Pro Sale: షియోమీ 12 ప్రో సేల్ మొదలైంది - రూ.10 వేల వరకు స్టార్టింగ్ ఆఫర్ - ఫీచర్లు మాత్రం సూపర్!

షియోమీ కొత్త ఫ్లాగ్ షిప్ ఫోన్ 12 ప్రో సేల్ మనదేశంలో ప్రారంభం అయింది. అమెజాన్‌లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

FOLLOW US: 
Share:

షియోమీ 12 ప్రో సేల్ అమెజాన్‌లో ప్రారంభం అయింది. ఇందులో వెనకవైపు మూడు 50 మెగాపిక్సెల్ కెమెరాలు ఉన్నాయి. 120 హెర్ట్జ్ ఈ5 అమోఎల్ఈడీ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. శాంసంగ్ గెలాక్సీ ఎస్22, వన్‌ప్లస్ 10 ప్రోలతో ఇది పోటీ పడనుంది. 120W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 50W వైర్‌లెస్ చార్జింగ్ వంటి ఫీచర్లు ఈ ఫోన్‌లో అందించారు.

షియోమీ 12 ప్రో ధర
షియోమీ 12 ప్రో ధర రూ.62,999 నుంచి ప్రారంభం కానుంది. ఇది 8 జీబీ ర్యామ్ వేరియంట్ ధర. 12 జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ.66,999గా నిర్ణయించారు.కోచర్ బ్లూ, నోయిర్ బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ లాంచ్  అయింది. అమెజాన్, షియోమీ అధికారిక వెబ్ సైట్, ఎంఐ హోం స్టోర్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌పై ప్రారంభ ఆఫర్ కింద రూ.4,000 తగ్గింపును అందించారు. ఐసీఐసీఐ బ్యాంకు కార్డు లేదా ఈఎంఐ ఆప్షన్ల ద్వారా కొనుగోలు చేస్తే అదనంగా రూ.6,000 తగ్గింపు లభించనుంది. అంటే మొత్తంగా రూ.10 వేల తగ్గింపును ఈ ఫోన్ కొనుగోలుపై అందించనున్నారన్న మాట.

షియోమీ 12 ప్రో స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎంఐయూఐ 13 ఆపరేటింగ్ సిస్టంపై షియోమీ 12 ప్రో పనిచేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.72 అంగుళాల డబ్ల్యూక్యూహెచ్‌డీ+ ఈ5 అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. డాల్బీ విజన్, హెచ్‌డీఆర్10+ సపోర్ట్ కూడా ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్‌ను స్క్రీన్ సేఫ్టీ కోసం అందించారు.

12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ఈ స్మార్ట్ ఫోన్‌లో ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ టాప్ ప్రాసెసర్ 8 జెన్ 1పై ఈ ఫోన్ పనిచేయనుంది. షియోమీ 12 ప్రో బ్యాటరీ సామర్థ్యం 4600 ఎంఏహెచ్ కాగా... 120W షియోమీ హైపర్ చార్జ్ ఫాస్ట్ వైర్డ్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. క్విక్ చార్జ్ 4, క్విక్ చార్జ్ 3+, పవర్ డెలివరీ 3.0 చార్జింగ్, 50W వైర్‌లెస్ టర్బో చార్జింగ్ సపోర్ట్ కూడా ఈ స్మార్ట్ ఫోన్‌లో ఉంది.

షియోమీ 12 ప్రో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్, 50 మెగాపిక్సెల్ టెలిఫొటో సెన్సార్ కూడా ఉన్నాయి. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.

5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6ఈ, బ్లూటూత్ వీ5.2, జీపీఎస్, ఏ-జీపీఎస్, నావిక్, ఐఆర్ బ్లాస్టర్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. యాక్సెలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, బారోమీటర్, గైరోస్కోప్, ప్రాక్సిమిటీ సెన్సార్‌లను కూడా ఇందులో షియోమీ అందించింది. సెక్యూరిటీ కోసం ఈ స్మార్ట్ ఫోన్‌లో ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించారు. షియోమీ 12 ప్రో మందం 0.81 సెంటీమీటర్లు కాగా... బరువు 205 గ్రాములుగా ఉంది.

Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?

Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!

Published at : 02 May 2022 10:48 PM (IST) Tags: Xiaomi New Phone Xiaomi 12 Pro Xiaomi 12 Pro Specifications Xiaomi 12 Pro Features Xiaomi 12 Pro Price in India Xiaomi 12 Pro Amazon Sale Xiaomi 12 Pro Sale

ఇవి కూడా చూడండి

Smartphone Hacking Signs: మీ ఫోన్ ఇలా ప్రవర్తిస్తుందా? - అయితే హ్యాక్ అయినట్లే - రీసెట్ చేయాల్సిందే!

Smartphone Hacking Signs: మీ ఫోన్ ఇలా ప్రవర్తిస్తుందా? - అయితే హ్యాక్ అయినట్లే - రీసెట్ చేయాల్సిందే!

Smartphone Charging Tips: ఫోన్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? - పేలిపోయే అవకాశం ఉంది జాగ్రత్త!

Smartphone Charging Tips: ఫోన్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? - పేలిపోయే అవకాశం ఉంది జాగ్రత్త!

Upcoming Smartphones: డిసెంబర్ మొదటి వారంలో ఏకంగా ఐదు ఫోన్లు లాంచ్ - ఏమేం వస్తున్నాయి? - వీటి కోసం వెయిట్ చేయవచ్చా?

Upcoming Smartphones: డిసెంబర్ మొదటి వారంలో ఏకంగా ఐదు ఫోన్లు లాంచ్ - ఏమేం వస్తున్నాయి? - వీటి కోసం వెయిట్ చేయవచ్చా?

Most Secured Smartphone: ప్రపంచంలో అత్యంత సెక్యూర్డ్ స్మార్ట్ ఫోన్లు ఇవే - ఒక్కదాని పేరైనా మీరు విన్నారా?

Most Secured Smartphone: ప్రపంచంలో అత్యంత సెక్యూర్డ్ స్మార్ట్ ఫోన్లు ఇవే - ఒక్కదాని పేరైనా మీరు విన్నారా?

Meizu 21: 200 మెగాపిక్సెల్ కెమెరా, లేటెస్ట్ ప్రాసెసర్‌తో గేమింగ్ ఫోన్ - ధర ఎంతంటే?

Meizu 21: 200 మెగాపిక్సెల్ కెమెరా, లేటెస్ట్ ప్రాసెసర్‌తో గేమింగ్ ఫోన్ - ధర ఎంతంటే?

టాప్ స్టోరీస్

Pavan Babu Meet : చంద్రబాబుతో పవన్ భేటీ - అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలపై చర్చ!

Pavan Babu Meet :    చంద్రబాబుతో పవన్ భేటీ -  అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలపై చర్చ!

CM Revanth : మాట నిలబెట్టుకున్న రేవంత్ - దివ్యాంగురాలు జ్యోతికి ప్రమాణస్వీకారానికి ఆహ్వానం

CM  Revanth  :  మాట నిలబెట్టుకున్న రేవంత్ -  దివ్యాంగురాలు జ్యోతికి ప్రమాణస్వీకారానికి ఆహ్వానం

AP High Court: ఎస్‌ఐ ఫలితాల వెల్లడికి లైన్ క్లియర్, 'స్టే' ఎత్తివేసిన హైకోర్టు

AP High Court: ఎస్‌ఐ ఫలితాల వెల్లడికి లైన్ క్లియర్, 'స్టే' ఎత్తివేసిన హైకోర్టు

MLA Raja Singh: ఏడాదిలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలిపోతుంది, తర్వాత బీజేపీ - కారణమేంటో చెప్పిన రాజాసింగ్‌

MLA Raja Singh: ఏడాదిలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలిపోతుంది, తర్వాత బీజేపీ - కారణమేంటో చెప్పిన రాజాసింగ్‌
×