Samsung Vs Google: యాపిల్, గూగుల్‌కు శాంసంగ్ పోటీ - ఎస్25 స్లిమ్ లాంచ్ త్వరలో!
Samsung Galaxy S25 Slim: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ తన కొత్త ఫోన్‌ను త్వరలో లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్25 స్లిమ్ పేరుతో ఈ ఫోన్ లాంచ్ కానున్నట్లు సమాచారం.
Samsung Galaxy S25 Slim Launch: శాంసంగ్ త్వరలో గెలాక్సీ ఎస్25 సిరీస్‌ను మార్కెట్లో లాంచ్ చేయనుంది. ఈ సిరీస్‌లో రాబోయే ఫోన్లలో అనేక అద్భుతమైన ఫీచర్లను కూడా చూడవచ్చు. ఈ సిరీస్‌లో స్లిమ్ మోడల్‌ను కూడా మనం పొందవచ్చు. వార్తల్లో వినిపిస్తున్న దాని ప్రకారం ఈ మోడల్ పేరు 'శాంసంగ్ గెలాక్సీ ఎస్25 స్లిమ్' అయ్యే అవకాశం ఉంది.
ప్రీమియం సిరీస్‌లో నాలుగో మోడల్
ఈ ఫోన్ శాంంసంగ్ ప్రీమియం సిరీస్‌లో నాలుగో మోడల్ అని చెబుతున్నారు. ఈ ఫోన్ ఇతర శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ల కంటే చాలా సన్నగా ఉండబోతుంది. ఈ సమాచారం కొరియన్ అవుట్‌లెట్ ఈటీ న్యూస్‌లో వచ్చింది. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ మధ్య ఈ ఫోన్ లాంచ్ అవుతుంది. అయితే సిరీస్‌లోని మిగిలిన మోడళ్లను ముందుగా ప్రారంభించాలని భావిస్తున్నారు.
3+1 తీసుకురానున్న శాంసంగ్
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 లైనప్‌లో మూడు మోడల్స్ పరిచయం కానున్నాయి. వీటిలో శాంసంగ్ గెలాక్సీ ఎస్25 మోడల్ నంబర్ SM-S931 అని ఉంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్25 ప్లస్ మోడల్ నంబర్ SM-S936, శాంసంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రా మోడల్ నంబర్ SM-S938. దీంతో పాటు నాలుగో మోడల్‌ను కూడా పరిచయం చేసే అవకాశం ఉంది. దీని అమెరికన్ వేరియంట్ మోడల్ నంబర్ SM-S937U అని తెలుస్తోంది. ఇది జీఎస్ఎంఏ ఐఎంఈఐ సైట్‌లో కూడా కనిపించింది.
ఐఫోన్ ఎస్ఈ4తో పోటీ...
ఈ స్లిమ్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయడం ద్వారా కంపెనీ రాబోయే చవకైన ఐఫోన్‌తో పోటీ పడాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. గత కొన్నేళ్లుగా యాపిల్ కూడా ఐఫోన్ ఎస్ఈ సిరీస్‌లో కొత్త మోడల్‌ను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. అటువంటి పరిస్థితిలో శాంసంగ్ ఈ ఫోన్‌కు పోటీ ఇవ్వాలని రెడీ అవుతోంది. వచ్చే ఏడాది రెండో త్రైమాసికంలో అంటే ఏప్రిల్ నుంచి జూన్ మధ్య శాంసంగ్ ఈ ఫోన్‌ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
Also Read: షాకిస్తున్న పైరసీ ఇన్‌కమ్ - నిర్మాతల కంటే ఎక్కువ డబ్బులు వీరికే - ఏటా ఎన్ని వేల కోట్లు?
గూగుల్ పిక్సెల్ 9తో కూడా...
అంతే కాదు శాంసంగ్ గూగుల్‌తో కూడా పోటీ పడేందుకు సిద్ధమవుతోంది. గూగుల్ తన పిక్సెల్ 9ని త్వరలో విడుదల చేయడానికి సిద్ధం అవుతోంది. ఇది కూడా శాంసంగ్ గెలాక్సీ ఎస్25 స్లిమ్ ఈ డివైస్‌తో పోటీపడుతుంది. రాబోయే కొద్ది నెలల్లో ఈ ఫోన్ గురించి మరింత సమాచారం వెల్లడికావచ్చు. శాంసంగ్ తీసుకురానున్న ఈ నాలుగో ప్రీమియం మోడల్ ధర, లుక్ పరంగా ప్రత్యేకంగా ఉంటుంది.
ప్రస్తుతం మనదేశంలో శాంసంగ్ నంబర్ వన్ మొబైల్ బ్రాండ్‌గా ఉంది. శాంసంగ్ కంటే కేవలం ఒక్క శాతం వెనకబడి యాపిల్ రెండో స్థానంలో నిలిచింది. తన నంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి శాంసంగ్ శతవిధాలా కృషి చేస్తుంది. ఇందులో భాగంగానే ఫ్లాగ్ షిప్ సిరీస్‌లో కూడా మంచి ఫోన్లను తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది.
Also Read: మోస్ట్ అవైటెడ్ వన్‌ప్లస్ 13 లాంచ్ - ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయి?